న్యూఢిల్లీ: 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఆత్మశోధనలో పడింది. తన తప్పిందాలను, లోపాలను, పొరపాట్లను నిజాయితీగా అంగీకరించింది. స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అపరిమిత అధికారాలను చెలాయించారని, ఆమె తనయుడు సంజయ్‌గాంధీ ఏకపక్షంగా, నిరంకు శంగా అనేక చర్యలు తీసుకున్నారని అంగీకరించింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తరచు తన మంత్రివర్గం లోను, పార్టీలోనూ ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారని, పార్టీలో సంస్కరణలు తెస్తానని తను చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోలేకపోయారని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకొంది.‘ఎమర్జెన్సీ కాలంలో సాధారణ రాజకీయ కార్యకలాపాలు, ప్రాథమిక హక్కులు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రెస్ సెన్సార్‌షిప్ విధించారు.
న్యాయవ్యవస్థ అధికారాలు కుం చించుకుపోయాయి. ప్రభుత్వానికి, పార్టీకి సంబం ధించి విస్తృతాధికారాలను ప్రధాని తన గుప్పిట్లో ఉంచుకొన్నా రు’ అని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఒక పుస్తకంలో పేర్కొన్నారు.పార్టీ 125 వసంతాల్ని పూర్తిచేసుకున్న సంద ర్భంగా ‘ది కాంగ్రెస్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ నేషన్’ అనే పేరుతో విడుదలైన ఈ పుస్తకానికి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ ప్రధాన సంపాదకుడి గా వ్యవహరించారు. ముఖ్యంగా ఎమర్జెన్సీపై ఈ పుస్తకం లో నిశితమైన విమర్శ ఉంది. 1975 జూన్ నుంచి 1977 జనవరి వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. వరకట్న నిర్మూలనకు, అక్షరాస్యత పెంపొందించేందుకు సంజయ్‌గాంధీ కొన్ని చర్యలు తీసుకున్నా అవి ఏకపక్షం గా, నిరంకుశ పద్ధతిలో జరిగాయి.
కుటుంబని యంత్రణ అమలు, మురికివాడల నిర్మూలన వంటి కొన్ని రంగాల్లో అతిగా వ్యవహరించడం కూడా జరిగింది’ అని ఆ పుస్తకం పేర్కొంది. దరల పెరుగదల విషయంలో కూడా కాంగ్రెస్ ఒక విధంగా తన అసహాయతను ప్రకటించింది. పెరుగు తున్న ధరలు యూపీఏ - 2 ప్రభుత్వానికి ఒక సవాల్ అని పుస్తకంలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వానికి సింగ్ సుస్థిర తను చేకూర్చారని ప్రధానిని ఈ పుస్తకం కొనియాడింది. ఢిల్లీకి చెందిన ఒక విద్యాసంస్థ ఈ పుస్తకా న్ని ప్రచురిం చింది. 2004లో ప్రధానమంత్రి పదవిని తృణీకరించి న సోనియాగాంధీ త్యాగశీలతను కూడా ఈ పుప్తకం అభినం దించింది.
జయప్రకాశ్‌ను తప్పుపట్టలేం :సంపూర్ణ విప్లవానికి పి లుపునిచ్చిన జయప్రకాశ్ నారాయణ్ నిజాయితీని, సమై క్యవాదాన్ని, నిస్వార్థపరత్వా న్ని తప్పు పట్టలేమని కూడా ఆ పుస్తకంలో అంగీకరించా రు. ఆయన ఉద్యమం ఎమర్జె ె్జన్సీ విధించేందుకు దారితీ సింది. ఆయన సిద్ధాంతం అ యోమయంగా ఉందని, ఆయన ఉద్యమం రాజ్యాంగ వ్య తిరేకం, అప్రజాస్వామికమని ఆ పుస్తకంలో పేర్కొన్నా రు. స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావును ఆ పుస్తకం కొని యాడింది. ఆయన ప్రభుత్వం మైనారిటీలో ఉన్నా అయిదే ళ్ల పూర్తి కాలాన్ని పూర్తి చేయగలిగిందని, కాంగ్రెస్ మేనిఫె స్టోలో ఉన్న ఆర్థిక సంస్కరణల్ని ఆయన ప్రభుత్వం అమ లు చేసిందని ఆ పుస్తకంలో ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక సందర్భంగా రాహుల్‌గాంధీ తీసుకున్న చర్యల్ని కూడా పార్టీ వెలువరించిన ఈ పుస్తకంలో కొనియాడారు.
2జి పై జేపీసీ దర్యాప్తు జరగాలని ప్రతిపక్షం ఎంత బలంగా కోరుతోందో, ప్రభుత్వం అంతకంటే బలంగా వ్యతిరేకిస్తోంది. సర్కార్‌లో పెద్దలు ఏ తప్పూ చేయనప్పుడు జేపీసీ వేయడానికి అభ్యంతరమేమిటని ప్రతిపక్షం నిలదీస్తోంది.ఇందుకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. అసలు జేపీసీని అడ్డుకుంటున్నది ఎవరు? ఎందుకు అని ఆలోచిస్తే, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీనే కారణమని అంటున్నారు.
జేపీసీపై ప్రభుత్వంలో ఇతరులెవరూ ప్రకటనలు చేయడం లేదు. ప్రతిసారీ జేపీసీని వేసేది లేదంటూ ప్రణబ్‌ముఖర్జీనే చెబుతూ వస్తున్నారు. ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రధాని మన్మోహన్‌సింగ్ కానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కానీ జేపీసీ పై ఎందుకు మాట్లాడడం లేదు? ప్రణబ్ పట్టుదల వల్ల యూపీఏ ప్రతిష్ట దెబ్బతింటోందని కూడా కొందరు అంటున్నారు. ప్రణబ్‌కు కావలసింది అదేనా? అన్న సందేహమూ కలుగుతోంది. మన్మోహన్ కానీ, సోనియా కానీ ఆయనకు ఎదురు చెప్పలేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది.
ప్రసారభారతి మాజీ ఛైర్మన్ లల్లీ కూడా కామన్వెల్త్ క్రీడల కుంభకో ణంలో చిక్కుకున్నారు. అది క్రీడోత్స వాల్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయడానికి హక్కులకు సంబంధించిన అంశం. క్రీడోత్సవాల ప్రసారానికి హక్కులు కొను క్కోవాలి. బ్రిటన్‌కు చెందిన ఒక కంపెనీకి ప్రసార హక్కుల కాంట్రాక్ట్ ఇచ్చారు.
ఆ కంపెనీలో ప్రసారభారతి మాజీ ఛైర్మన్ లిల్లీ కుమార్తె పనిచేస్తున్నారని, ఆమె చెప్పినందువల్లే ఆ కంపెనీ ప్రసార హక్కుల్ని పొందిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్ని లల్లీ ఖండించారు. హక్కుల కాంట్రాక్ట్ విషయంలో తను ఫలానా కంపెనీని సిఫార్సు చేసినా చివరికి కాంట్రాక్టు ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకున్నది సమాచార శాఖ మంత్రి అంబికాసోనీనే అని లల్లీ మంత్రిని విమర్శించారు. దీనిపై మంత్రికి, ప్రసారభారతి మాజీ ఛైర్మన్ లల్లీ మధ్య వివాదం రేగింది. చివరకు రాష్టప్రతి ఉత్తర్వుతో లల్లీ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది.
కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో ప్రాజెక్టుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలు మరో కథ. ఈ కుంభ కోణానికి క్రీడోత్సవాల నిర్వహణ కమిటీ (ఓసీ) ఛైర్మన్ సురేష్ కల్మాడీ కేంద్ర బిందువుగా నిలిచారు. క్రీడోత్సవాల్లో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో మొదట వేసిన అంచనాలకన్నా, ఆ తర్వాత క్రమంగా కేటాయింపులు పెరుగుతూ వచ్చాయి.
అందుకు నిర్వహణా కమిటీలో ఉన్న వారే కారణమని ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టుల వ్యయం పెరగడానికి తను కారణం కాదని సురేష్ కల్మాడీ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఆర్ ప్రాపర్టీస్ కన్‌స్ట్రక్షన్స్‌కు కాంట్రాక్టు ఇవ్వడం వివాదాస్పదమైంది. కేటాయింపుల్లో తన పాత్ర చాలా తక్కువ శాతమేనని, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేటాయింపుల్లో ప్రధాన పాత్ర వహించారనీ ఆయన ఆరోపించారు.
ఆమధ్య జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. బీహార్ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి నిలిపింది. సవాల్‌గా భావించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ బీహార్‌లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ అయితే, మిగతా ఇద్దరు నాయకులకన్నా ఎక్కువ సార్లే ప్రచారంకోసం బీహార్ వెళ్లారు. అయినా లాభం లేకపోయింది.
పరాజయానికి కారణం బీహార్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ముకుల్ వాస్నిక్ అని అంటారు. వాస్నిక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను అమ్ముకున్నారని, గెలుపు గుర్రాలకు కాకుండా, డబ్బిచ్చిన వారికి టిక్కెట్లిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీహార్ ఎన్నికల్లో పరాజయం కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం చూిపుతుందంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఒక రాష్ట్రాన్ని పోగొట్టుకోవడం కేంద్రంలో ఆ పార్టీ బలహీనపడేందుకు దారితీసి, ప్రభుత్వానికి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా సొంతపార్టీలో పరిణా మాలు అధిష్ఠానానికి చికాకు కలిగిస్తున్నాయి. ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలు సొంతపార్టీవారు చేయడం, అసమ్మతి ఓ విధంగా తిరుగుబాటుకు దారితీయడం అధినాయకత్వానికి మింగుడు పడడం లేదు. వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని వదిలి, ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటికి వెళ్లడం, సొంతంగా పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేయడం ఢిల్లీ నాయకత్వానికి కొరుకుడు పడడం లేదు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఆ రాష్ట్రంలో పార్టీ వ్యవహరాల్లో అనుసరిస్తున్న వైఖరే ఈ విపరిణామాలకు కారణమనే ఆరోపణలు కూడా లేకపోలేదు.
జగన్‌పట్ల అధిష్ఠానం పట్టువిడుపులు లేకుండా మొండిగా వ్యవహరించ డమే ఆయన పార్టీని వదిలి వెళ్లేందుకు దారితీసిందని, ఇందుకు పటేల్ అనుసరించిన వైఖరే కారణమని, అందువల్లే ఏపీలో రాజకీయాలు చేయిదాటి పోయాయని విమర్శలు వచ్చాయి. ఇన్ని రాజకీయ పరిణామాలు జరిగినా, అవినీతి వీరవిహారం చేస్తున్నా ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టమైన చర్య తీసుకునే విషయంలో మౌనంగా ఉండడం సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వంలో పెద్దలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే స్థాయి కూడా దాటిపోయి, నేరుగా ప్రధానిపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.
టెలికాం మంత్రిగా రాజా రాజీ నామా చేయాల్సి వచ్చింది. జరిగిన కుంభకోణంలో తన పాత్ర లేదని, అంతా ప్రధానమంత్రి మన్మోహ న్‌సింగ్‌కు తెలిసే జరిగిందని రాజా పదేపదే చెప్పారు. 2జి స్పెక్ట్రం కేటాయింపుల సందర్భంగా తను ప్రధానికి లేఖలు కూడా రాశానని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాధానాలు కూడా వచ్చాయని రాజా చెప్పారు. పైగా, ఆయన మరో వాదం కూడా లేవనెత్తారు.
టెలికాం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయింపుల్లో తను కొత్త విధానాన్ని ఏదీ అనుసరించలేదని, గతంలో ఈ శాఖ మంత్రులుగా పనిచేసిన మురసోలీ మారన్, ప్రమోద్ మహాజన్‌ల బాటలోనే తను కూడా నడిచానని రాజా సమర్థించుకున్నారు. అయితే ఇది అంతటితో ఆగలేదు. రాజా కేంద్రప్రభుత్వాన్నే సవాలు చేస్తున్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారం ఈనాటిది కాదని ఏన్డీఏ హయం నుంచి విచారణ జరపాలని పట్టుపడుతున్నారు. దశాబ్ధ కాలంగా పనిచేసిన టెలికాం మంత్రులందరిని బరిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. 








‘‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, యువ ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏకాకిని చేసి బలహీనపర్చాలన్న కుట్ర జరుగుతోంది. వైఎస్ జ్ఞాపకాలను సైతం చెరిపేయాలని, జగన్‌ను బలహీనపరచాలని ఢిల్లీలోని కొందరు పెద్దలు పన్నుతున్న మహాకుట్రలో వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిని పావుగా వాడుకుంటున్నారన్న అనుమానం కలుగుతోంది’’ అని కాంగ్రెస్ నేత, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు ఆరోపించారు. వైఎస్ కుటుంబ గౌరవాన్ని అభాసుపాలు చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగం కావద్దని వివేకానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు. సాక్షి చానెల్‌లో వచ్చిన కథనాలు తప్పని, జగన్‌మోహన్‌రెడ్డితో సోనియాగాంధీకి వివరణ ఇప్పిస్తానని ఢిల్లీలో వివేకానందరెడ్డి పేర్కొనడంపై రాంబాబు అభ్యంతరం వ్యక్తంచేశారు. సాక్షిలో వచ్చిన కథనాలకు జగన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని, జగన్ ఏ తప్పూ చేయలేదని వివరించారు. 




1947లో మనకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చినప్పుడు కూడా వీరు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ స్వాతంత్య్రం ఇద్దరు బూర్జువాల మధ్య జరిగిన అధికార మార్పిడి అని.. భారత్‌లో అధికారం తెల్ల బూర్జువా నుంచి నల్ల బూర్జువాకు మారిందని ఎద్దేవా చేశారు. 1948లో అప్పుడే పుట్టిన భారత రాజ్యంపై సీపీఐ ఒక సాయుధ తిరుగుబాటు కూడా చేసింది. దీనిని కట్టడిచేయటానికి మూడేళ్లు పట్టింది. చివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల.. సోవియట్ నియంత స్టాలిన్ ప్రభావితం చేయటం వల్ల-(ఆ సమయంలో పాశ్చాత్య దేశాల పాలనలో ఉండి స్వాతంత్య్రం పొందిన దేశాలను స్నేహం చేసుకోవటానికి సోవియట్ యూనియన్ ప్రయత్నించేది)- విప్లవకారులు అండర్‌గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు. రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటించారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కూ మధ్య విభేదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయా? పార్టీ విధానాలకు, ప్రభుత్వానికీ మధ్య సమన్వయం ఏర్పరచగల నేతగా మన్మోహన్ ఉపయోగపడడం లేదని సోనియా భావిస్తున్నారా? ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందా? వచ్చే ఎన్నికల లోపే ప్రత్యామ్నాయ నేతను సోనియా ఎంపిక చేసుకోవాల్సి వస్తుందా? గత కొంత కాలంగా హస్తినలో కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఇది!