Tuesday, December 28, 2010

నిజమే...తప్పులు చేశాం * 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ

pms 
న్యూఢిల్లీ: 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు ఆత్మశోధనలో పడింది. తన తప్పిందాలను, లోపాలను, పొరపాట్లను నిజాయితీగా అంగీకరించింది. స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అపరిమిత అధికారాలను చెలాయించారని, ఆమె తనయుడు సంజయ్‌గాంధీ ఏకపక్షంగా, నిరంకు శంగా అనేక చర్యలు తీసుకున్నారని అంగీకరించింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తరచు తన మంత్రివర్గం లోను, పార్టీలోనూ ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారని, పార్టీలో సంస్కరణలు తెస్తానని తను చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోలేకపోయారని కాంగ్రెస్‌ పార్టీ ఒప్పుకొంది.‘ఎమర్జెన్సీ కాలంలో సాధారణ రాజకీయ కార్యకలాపాలు, ప్రాథమిక హక్కులు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రెస్‌ సెన్సార్‌షిప్‌ విధించారు.

న్యాయవ్యవస్థ అధికారాలు కుం చించుకుపోయాయి. ప్రభుత్వానికి, పార్టీకి సంబం ధించి విస్తృతాధికారాలను ప్రధాని తన గుప్పిట్లో ఉంచుకొన్నా రు’ అని కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ఒక పుస్తకంలో పేర్కొన్నారు.పార్టీ 125 వసంతాల్ని పూర్తిచేసుకున్న సంద ర్భంగా ‘ది కాంగ్రెస్‌ అండ్‌ ది మేకింగ్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ నేషన్‌’ అనే పేరుతో విడుదలైన ఈ పుస్తకానికి ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ ప్రధాన సంపాదకుడి గా వ్యవహరించారు. ముఖ్యంగా ఎమర్జెన్సీపై ఈ పుస్తకం లో నిశితమైన విమర్శ ఉంది. 1975 జూన్‌ నుంచి 1977 జనవరి వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. వరకట్న నిర్మూలనకు, అక్షరాస్యత పెంపొందించేందుకు సంజయ్‌గాంధీ కొన్ని చర్యలు తీసుకున్నా అవి ఏకపక్షం గా, నిరంకుశ పద్ధతిలో జరిగాయి.

sonia-umberella 

కుటుంబని యంత్రణ అమలు, మురికివాడల నిర్మూలన వంటి కొన్ని రంగాల్లో అతిగా వ్యవహరించడం కూడా జరిగింది’ అని ఆ పుస్తకం పేర్కొంది. దరల పెరుగదల విషయంలో కూడా కాంగ్రెస్‌ ఒక విధంగా తన అసహాయతను ప్రకటించింది. పెరుగు తున్న ధరలు యూపీఏ - 2 ప్రభుత్వానికి ఒక సవాల్‌ అని పుస్తకంలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వానికి సింగ్‌ సుస్థిర తను చేకూర్చారని ప్రధానిని ఈ పుస్తకం కొనియాడింది. ఢిల్లీకి చెందిన ఒక విద్యాసంస్థ ఈ పుస్తకా న్ని ప్రచురిం చింది. 2004లో ప్రధానమంత్రి పదవిని తృణీకరించి న సోనియాగాంధీ త్యాగశీలతను కూడా ఈ పుప్తకం అభినం దించింది.

జయప్రకాశ్‌ను తప్పుపట్టలేం :సంపూర్ణ విప్లవానికి పి లుపునిచ్చిన జయప్రకాశ్‌ నారాయణ్‌ నిజాయితీని, సమై క్యవాదాన్ని, నిస్వార్థపరత్వా న్ని తప్పు పట్టలేమని కూడా ఆ పుస్తకంలో అంగీకరించా రు. ఆయన ఉద్యమం ఎమర్జె ె్జన్సీ విధించేందుకు దారితీ సింది. ఆయన సిద్ధాంతం అ యోమయంగా ఉందని, ఆయన ఉద్యమం రాజ్యాంగ వ్య తిరేకం, అప్రజాస్వామికమని ఆ పుస్తకంలో పేర్కొన్నా రు. స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావును ఆ పుస్తకం కొని యాడింది. ఆయన ప్రభుత్వం మైనారిటీలో ఉన్నా అయిదే ళ్ల పూర్తి కాలాన్ని పూర్తి చేయగలిగిందని, కాంగ్రెస్‌ మేనిఫె స్టోలో ఉన్న ఆర్థిక సంస్కరణల్ని ఆయన ప్రభుత్వం అమ లు చేసిందని ఆ పుస్తకంలో ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌, మరికొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక సందర్భంగా రాహుల్‌గాంధీ తీసుకున్న చర్యల్ని కూడా పార్టీ వెలువరించిన ఈ పుస్తకంలో కొనియాడారు.

No comments:

Post a Comment