Friday, April 6, 2012

త్రిమూర్తులకు గర్వభంగం!

త్రిమూర్తులు హస్తిన వెళ్లి వచ్చారు. మరి సంధి కుదిరిందా అంటే... ఆ దాఖలాలైతే కనిపించడం లేదు. ముగ్గురూ కలిసి టిఫిన్‌ చేసినా ఎవరిదారిన వారు ఇళ్లకు వచ్చేశారు. ఉమ్మడిగా మీడియాతో మాట్లాడు తారనుకుంటే అదీ జరగలేదు. చివరకు సోనియా అపాయింట్ మెంటూ దక్కలేదు. ఆపత్కాలంలో పార్టీకి అండగా ఉంటారని అందలమెక్కిస్తే భ్రష్టూ పట్టించిన ఈ అగ్ర నేతలపై అధినేత్రి ఎంత గుస్సాతో ఉన్నారో ఈ పరిణామమే చెబుతున్నది.

cmmత్రిమూర్తుల హస్తిన పర్యటన ముగిసింది. ఎవరి ఇళ్లకు వారు వచ్చేశారు. ఇరవై నాలుగ్గంటల పాటు సుదీర్ఘ మంతనాల తర్వాత పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? అందరికీ వచ్చే సహజ సందేహం ఇదొక్కటే కాదు. ఇంకా అనేక సందేహాలున్నాయి. వెళ్లేటప్పుడు విడివిడిగా వెళ్లిన కిరణ్‌, బొత్స తిరిగి వచ్చేటప్పుడు కూడా విడివిడిగానే హైదరాబాదు చేరుకోవడం ఒక విశేషం. 



 ఢిల్లీ వెళ్లిన వాళ్లు సంధి కుదిరి చెట్టాపట్టాల్‌ వేసుకుని వస్తారని ఆశించిన వారికి ఆశా భంగమే ఎదురైంది. చర్చలు కాగానే ఒకసారి ముగ్గురూ కారెక్కి కనిపించి కాసేపు మురిపించారు. మర్నాడు ఉదయా న్నే ముఖ్యమంత్రి మిగతా ఇద్దర్నీ అల్పాహారానికి పిలిచారు. కలిసి కూర్చుని టిఫిన్‌ తిన్నారు. ఇదీ శుభపరిణామమే. పనిలో పనిగా బాబూ జగ్జీవన్‌రామ్‌కి కలిసికట్టుగానే శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత ఇక ఎవరి దారి వారిదైంది. ముఖ్యమం త్రేమో ప్రధానమంత్రిని కలవడానికి వెళితే బొత్స సత్యనారా యణ తనదైన శైలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అది ఎందుకు పెట్టారో.. అందులో ఆయన చెప్పిన విశేషాలేమిటో బోధపడక అందరూ తలలు పట్టుకున్నారు. ముఖ్యమంత్రికీ, తనకూ మధ్య విభేదాలే లేవని ఒక పరమ నిజం చెప్పారు. ఆజాద్‌తో సమావేశం లో ఉప ఎన్నికల గురించి, పార్టీ వ్యూహం గురించీ చర్చించాం తప్ప ఇతరత్రా ఏ విషయాలూ రాలేదని అన్నారు. అదే నోటితో పనిలో పనిగా ఎక్సయిజ్‌ ఐపీఎస్‌ శ్రీనివాసరెడ్డి ఎవరో ఆ కథేంటో తనకు అస్సలు తెలీదని వక్కాణించారు.

Sonia 

చెప్పకపోతే పత్రికల వాళ్లు, టీవీల వాళ్లు ఇంకేవేవో రాసేసుకుంటారని ఈ మాత్రమైనా చెప్తున్నానని కూడా సెలవిచ్చారు. ముఖ్యమంత్రీ, పీసీసీ అధ్యక్షుడూ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడతారని అందరూ ఊహించారు. కాని అది మరీ ఇబ్బందికరంగా ఉంటుందనుకున్నారో ఏమో ఆ సాహసం చేయలేకపోయారు. ఇవన్నీ పరిశీ లించాక, అస్సలు వీరిద్దరి మధ్యా నిజమైన సంధి కుదిరిందా అన్న అను మానం రాక మానదు. తమ మధ్య విభేదాలు లేవని గాని, ఉన్నా మన స్ఫూర్తిగా వాటిని పరిష్కరించుకున్నామని గాని వాళ్లిద్దరూ చిత్తశుద్ధితో భావిస్తే, ఇద్దరూ ఒక చోట కలిసి ఒకే గొంతుకతో చెప్పేవాళ్లు. అది జరగ లేదు కాబట్టే ఇన్ని సందేహాలు.

ఇదంతా ఒక ఎత్తయితే ఇంత పెద్ద కసరత్తు జరిగాక వీళ్లిద్దరూ కాం గ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలవక పోవడం మరొక పెద్ద సందే హానికి బీజాలు వేసింది. వీళ్లిద్దరూ ఢిల్లీలో కాలు మోపిన సమయంలోనే కిరణ్‌ ప్రత్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమె దగ్గరకు ఇలా వెళ్లి అలా పావు గంట సేపు మాట్లాడి వచ్చారు.
రాష్ట్ర నేతలు చాలా మంది దాదాపు నిత్యం ఆమెను కలుస్తూనే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి ఏవేవో చెప్పి వస్తున్నారు. వాటన్నింటికీ కర్త, కర్మ, క్రియలుగా ముద్రపడ్డ కిరణ్‌, బొత్స ఆజాద్‌ దగ్గర పంచాయతీ తర్వాత అధినేత్రిని కలవకపోవడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందే. నిజానికి ఆనవాయితీ ప్రకారం పంచాయతీ ముగిశాక ఆజాదే వాళ్లిద్దర్నీ ఆమె దగ్గరకు తీసుకెళ్లి చర్చల సారాంశం చెప్పి, ఆమె చేత చివరిగా నాలుగు మంచి మాటలు చెప్పించాలి. కాని అది కూడా జరగలేదు. రాజకీయపరంగా చాలా కీలక సమావేశంగా ప్రచారంలోకి వచ్చిన ఈ ఉదంతం చివరకు ఆజాద్‌ దగ్గరే ఆగిపోవడాన్ని నిశి తంగా పరిశీలించాలి. ఆమె వీళ్లతో మాట్లాడేందుకు నిరాకరించారా? ఆపత్కాలంలో పార్టీకి అండగా నిలుస్తారని గంపెడు ఆశలతో వీళ్లిద్దరికీ కీలక బాధ్యతలు అప్పగిస్తే చివరకిలా పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టుపటి ్టస్తున్నారని ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.

_DKr 


అందుకే ఆ వ్యవహా రాన్ని ఆజాద్‌కి అప్పగించి, తాత్కాలిక ఉపశమనానికి చర్యలు తీసు కోమని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికల గొడవ అయ్యాక, వీరిద్దర్నీ లేదా ఇద్దర్లో ఎవరో ఒకర్ని తప్పించాలని అధిష్టానం స్ధాయిలో సూత్రప్రాయంగా నిర్ణయించినందునే ఆమె వీరిని పిలిపించలేదని అం టున్నారు. లేకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి.. అదీ రాజకీయ రచ్చబండకు వచ్చి.. సోనియాను కలవకుండా వెళ్లడం అరుదైన విషయమే.ఈ సంకేతాలు నర్మగర్భంగా అందినందువల్లే కిరణ్‌, బొత్స ఉమ్మడిగా విలేకరుల ముందుకు రాకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారన్నది మరొక కథనం.

ఉప ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులు అంటే కొత్త తలనొప్పులు వస్తాయని, అందువల్ల మంచో చెడో వీళ్లతోనే ఆ తతంగాన్ని ముగించడం ఉన్నంతలో రక్షణాత్మక చర్యగా అధిష్టానం భావించింది. అందుకే ఎంతో సస్పెన్స్‌తో మొదలైన త్రిమూర్తుల డిల్లీ పర్యటన చివరకు నీరుగారి తేలిపోయింది. ఇదమిద్దంగా ఏమి తేల్చారో ఎవ్వరూ చెప్ప లేకపోయారు. ఆజాద్‌ కూడా పెదవి విప్పలేదు. ముగ్గురికీ మనస్సు తడిసేలా తలంటిపోసి పంపించాల్సిందిగా సోనియా ఆజాద్‌ని ఆదేశించారు. ఆ పనిని ఆజాద్‌ నిర్విఘ్నంగా నిర్వహించారు. అందుకే తలంటి పోయించుకున్న వారు కిక్కురుమనలేదు. తలంటి పోసిన
వారు నోరెత్తలేదు.

Friday, December 16, 2011

రాజకీయ యుద్ధం ... జోడెద్దుల డీ


రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయ చిత్రపటం ఒక్కసారిగా మారిపోతున్నది. రాజకీయ సమీకరణాల్లో మార్పులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. హైదరాబాదు నుంచి ఢిల్లీ దాకా అసంతృప్తి పవనాలు వీస్తున్నాయి. ఆ పవనాలన్నీ కిరణ్‌ కుమార్‌ మీదగానే పోతుండటం ఇక్కడ విశేషం. ఆయన మీద బలమైన శక్తులే కత్తులు ఝళిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చాప కింద నీరులా తన మానాన తాను పని చేసుకుంటూపోతున్నారని అందరూ భావిస్తున్న తరుణంలో అదంతా సక్రమమైన భావన కాదని, కేవలం భ్రాంతి మాత్రమేనని ధ్రువపరుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో అంత ర్యుద్ధమే జరుగుతోంది. అది నివురు గప్పిన నిప్పులా ఉండి, ఉన్నట్టుండి ఒక్కసారిగా బయటపడుతున్నది. ఇప్పుడది బహిరంగ యుద్ధంగా మారింది.

ఒక పక్క పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్య మంత్రి ఒంటెత్తు పోకడలపై ఢిల్లీలో నేరుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేబినెట్‌ని విశ్వాసంలోకి తీసుకోకుండా తనంత తానుగా పథకాలు ప్రకటించేసుకుంటున్నారని ఆయన సోనియాకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. మంత్రులను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని, దాంతో మంత్రులు పాలనకు దూరమైనామన్న భావనలో ఉన్నారని ఆయన చెప్పినట్లు తెలిసింది. కేబినెట్‌ని కలుపుకొనిపోలేక పోతున్నారని, అది ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నదని బొత్స మేడమ్‌కి చాలా ఆందోళనకరంగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల కథనం.

మరోపక్క మంత్రులు సైతం ఏమాత్రం ముఖ్యమంత్రి పట్ల సంతోషంగాను, సంతృప్తికరంగాను లేరన్న సంగతి రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో బట్టబయలైంది. ఎస్పీల మీటింగులో ముఖ్యమంత్రి తమను బైటికెళ్లిపోతే ఎస్పీలతో కాన్ఫిడెన్షియల్‌గా మాట్లాడుకుంటాననడం పెద్ద వివాదంగా మారింది. ముఖ్యమంత్రి తమను అవమానించారని మంత్రులు లోలోన బాధపడుతున్నారు. తమ సీనియారిటీ సైతం చూడకుండా ముఖ్యమంత్రి అలా అనుచితంగా వ్యవహరించడం బాధాకరమని కొందరు మంత్రులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మొత్తానికి రాష్ట్ర కేబినెట్‌ సమైక్యంగా లేదన్న విషయం కలెక్టర్ల సదస్సుతో బైటపడింది. మంత్రులు ముఖ్యమంత్రి మీదున్న అసంతృప్తిని కలెక్టర్ల మీద వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి నిర్ణయాల్లో కొన్నింటికి కేబినెట్‌ అంగీకారం లేదని, కేబినెట్‌లో చర్చించనే లేదని కొందరు మంత్రులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
kiran--ministers
ఇక చేనేత, జౌళి శాఖ మంత్రి శంకర్రావు సంగతి సరేసరి. మంత్రులంతా వెళ్లినా ఆయన కలెక్టర్ల సదస్సులో అలాగే కూర్చుండిపోవడం..ముఖ్యమంత్రి తన సన్నిహిత అధికారి చేత బైటికెళ్లాలని చెప్పించడం..అదంతా మంత్రి శంకర్రావు వెలుపలికొచ్చి మీడియా ముందు చెప్పడం క్షణాల్లో జరిగిపోయాయి. కిరణ్‌ కుమార్‌ రెడ్డికి వ్యతిరేకంగా కేబినెట్లో పెద్ద వర్గమే సమీకృతమవుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ దీర్ఘకాలిక మనుగడ మీద ప్రభావం చూపుతాయని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అటు బొత్సతోను, ఇటు కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రులతోను ఏకకాలంలో యుద్ధం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు అంటున్నారు. ఈ యుద్ధం చివరకు ఎక్కడికి దారి తీస్తుందన్నది వేచి చూడాల్సిందేనన్నది వారి అభిప్రాయం. ఈ ప్రమాద ఘంటికల ప్రతిధ్వనులు ఢిల్లీ దాకా వినిపించేందుకు కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఇప్పటికే ఏర్పాట్లు చేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

సూర్య ప్రధాన ప్రతినిధి:రాష్ట్ర కాంగ్రెస్‌లో 1983 ముందు నాటి పరిస్థితి పునరావృతం కానుందా? గతంలో మాదిరిగానే ముఖ్యమంత్రులపై తిరుగుబాటు చేసే సంస్కృతి మళ్లీ మొదలుకానుందా? మునుపటి మాదిరిగానే ముఖ్యమంత్రులపై మంత్రులు యుద్ధం ప్రకటించబోతున్నారా? ముఖ్యమంత్రికి మంత్రులకూ పూడ్చలేనంత అగాథం పెరిగిపోతోందా?.. గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలతో పాటు రెండురోజులపాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో మంత్రులు విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయి.

అసలే అంతంత మాత్రంగా ఉన్న ముఖ్యమంత్రి-మంత్రుల సంబంధాలు జిల్లా కలెక్టర్ల భేటీతో పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. చాలాకాలం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి-మంత్రుల నడుమ పైకి కనిపించని దూరం ఉంది. కిరణ్‌ నియంతృత్వపోకడలతో వెళుతున్నారని, తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని, సోదరులతోనే అన్నీ నడిపిస్తున్నారని, కనీసం తమ ఫైళ్లు కూడా సీఎంఓ నుంచి కదలడం లేదని బాహాటంగానే మండిపడుతున్నారు. సీఎం తమ శాఖల్లో తమకు చెప్పకుండానే నిర్ణయాలు తీసుకోవడం ఎవరికీ రుచించడం లేదు. శంకర్‌రావు శాఖకు సంబంధించిన శాఖ సమీక్షకు ఆయనను పిలవడమే మానేశారు.

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, సీనియర్‌ మంత్రులు జానారెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డి, శంకర్‌రావు, వట్టి వసంతకుమార్‌, పొన్నాల లక్ష్మయ్య తదితరులకు కిరణ్‌ వ్యవహారశైలి, నిర్లక్ష్య ధోరణి ఏమాత్రం రుచించడం లేదు. వట్టి, పొన్నాల మినహా మిగిలిన వారంతా కిరణ్‌ కంటే సీనియర్లు కావడంతో ఆయన నిర్లక్ష్య ధోరణిని వారంతా అవమానంగా పరిగణిస్తున్నారు. ప్రధానంగా.. వీరంతా కిరణ్‌ తండ్రి అమర్‌నాధ్‌రెడ్డితో కలసి పనిచేసిన వారే. మిగిలిన వారంతా వైఎస్‌ హయాంలో మంత్రులుగా ఇప్పటివరకూ రెండు, మూడుసార్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు. కిరణ్‌ మంత్రి కాకుండా నేరుగా సీఎం అయినప్పటికీ, తమపై నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శించడాన్ని ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఒక జూనియర్‌ కింద తాము పనిచేస్తున్నామన్న భావన వారిని అసంతృప్తికి గురిచేస్తోంది. ‘మా కంటే కిరణ్‌ జూనియర్‌ అయినా హైకమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన సీటును చూసి గౌరవిస్తున్నాం. కానీ ఆయన మాత్రం మాకు కనీస గౌరవం ఇవ్వడం లేదు. మా సహనానికీ హద్దు ఉంటుంది కదా? వైఎస్‌ అంతటి వాడే మమ్మల్ని గౌరవించారు’ అని ఓ సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు.

కలెక్టర్ల సమావేశం తొలిరోజులో రఘువీరారెడ్డి, సబితా ఇంద్రరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మహీధర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, శ్రీధర్‌బాబు, డికె అరుణ, ముఖేష్‌ మినహా మిగిలిన మంత్రులంతా సమస్యలను అడ్డుపెట్టుకుని సీఎంపై తిరుగుబాటు చేసినంత పనిచేశారు. సమావేశం నుంచి అసంతృప్తి, ఆగ్రహంతో బయటకు వచ్చి మీడియా, తమ సహచరుల వద్ద జనాంతికంగా వారు చేసిన వ్యాఖ్యలు కిరణ్‌పై మంత్రులకు ఉన్న అసంతృప్తి, దూరాన్ని స్పష్టం చేశాయి. ఇద్దరు మంత్రులయితే కిరణ్‌ను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ వెళ్లిపోయారు. ఇందిరజలప్రభ మంత్రివర్గ సమిష్ఠి నిర్ణయం కాదని, దానిపై సమీక్షించవలసిన అవసరం ఉందని జానారెడ్డి తాజాగా వ్యాఖ్యానించడం బట్టి.. కిరణ్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వారి ఆవేదన నిజం చేసినట్టయింది. దీన్ని బట్టి మంత్రులకు- ముఖ్యమంత్రికీ యుద్ధం మొదలు కానుందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

అయితే, తొలిరోజు సమావేశంలో మంత్రుల అసంతృప్తిని పసిగట్టి, ముఖ్యమంత్రి రెండోరోజుయినా వారిని బుజ్జగిస్తారని చాలామంది అంచనా వేశారు. కానీ, కిరణ్‌ తన మొండి వైఖరి రెండోరోజు కూడా కొనసాగించి, తమను అవమానించారని మంత్రులు మండిపడ్డారు. సీనియర్‌ మంత్రి శ ంకర్‌రావును సీఎంఓ ముఖ్య అధికారితో చెప్పించి మరీ సమావేశం నుంచి వెళ్లగొట్టడంతో మంత్రుల అహం మరింత దెబ్బతిన్నట్టయింది. ఎస్పీలతో సమావేశ సమయంలో మంత్రులెవరినీ ఉండవద్దని ఆదేశించడంతో మంత్రుల ఈగో పూర్తిగా దెబ్బతిన్నట్టయింది. ఎస్పీల సమావేశంలో ఉండాలని గానీ, ఉండకూడదని గానీ నిబంధన ఏమీ లేదని, అయినా అందులో రహస్యాలు ఏమి ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.

కిరణ్‌ రాజకీయాలకు రాకముందు నుంచీ చురుకుగా పనిచేయడంతో పాటు, మంత్రులుగా పనిచేసిన తమను కిరణ్‌ ఎస్పీల ఎదుట అవమానించారని కన్నెర్ర చేస్తున్నారు. ఇది తమను అవమానించడమేనని బయటకు వచ్చిన మంత్రులు వ్యాఖ్యానించారు. మంత్రులకు విలువలేదని, అంతా తానేనని కలెక్టర్లు, ఎస్పీలకు సంకేతాలు ఇచ్చేందుకే కిరణ్‌ కావాలని తమను అవమానించారంటున్నారు. పాలనలో పారదర్శకత పేరుచెబుతున్న కిరణ్‌.. మంత్రులనే సమావేశం నుంచి బయటకు పంపించారంటే సీఎం తాను చెబుతున్న విధానాలను తానే ఎంతవరకూ అమలుచేస్తున్నారో అర్ధమవుతోందంటూ రుసరుసలాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎస్పీల సదస్సులో మంత్రులనూ ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

‘మేం మంత్రులం కాదా? లా ఆర్డర్‌లో ఏం జరుగుతోందో మాకు తెలుసుకునే హక్కు లేదా? మేం ప్రభుత్వంలో భాగస్వాములం కాదా? మమ్మల్ని బయటకు పంపించడం కిరణ్‌ అహంకారానికి నిదర్శనం. కార్యకర్తలు, ప్రజల నుంచి మాకొచ్చే ఫిర్యాదులను వారి దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు, వారి పనితీరును తెలుసుకుని మేమూ మా అనుభవాలతో సూచనలు చేసే అవకాశం ఉంది. కానీ, కిరణ్‌ మాత్రం మేం అక్కడ ఉంటే తనకు ఇబ్బందిగా భావించి మమ్మల్ని వెళ్లగొట్టారు. సీనియర్‌ మంత్రి శంకర్‌రావు సీఎం నాయనతో కలసి పనిచేశారు. ఢిల్లీలో వాళ్లిద్దరూ ఒకే రూములో ఉండేవారు. అలాంటి వ్యక్తి వయసుకూ కనీస గౌరవం ఇవ్వకపోవడం దారుణం. మేం లేకపోతే కిరణ్‌ ఎక్కడున్నారు. ఇంతకంటే మొండి సీఎంలను చాలామందిని చూశాం.


అందరితో సమన్వయం చేసుకోకుండా నియతంగా వ్యవహరిస్తే మేమే కాదు. పార్టీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడితే హైకమాండే ఊరుకోదు’ అని ఓ సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు.చివరకు సీనియర్‌ జానారెడ్డి సైతం కిరణ్‌ అనుమతి తీసుకుని మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యలపై ప్రస్తావించవలసిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి వల్ల మంత్రులు సరిగా పనిచేయలేకపోతన్నారని, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. కిరణ్‌ను గాడిలోకి పెట్టకపోతే పరిస్థితి చేయిదాటిపూయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంను పిలిచి మంత్రులతో సఖ్యతగా ఉండాలని ఆదేశించవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్‌కూ బొత్స ఇదే విషయం స్పష్టం చేశారు.

గంభీర వాతావరణం
కాగా.. తొలిరోజు సమావేశంలో మంత్రులు విరుచుకుపడిన వైనం మీడియాలో ప్రముఖంగా రావడంతో రెండవ రోజు గంభీర వాతావరణం నెలకొంది. డికె అరుణ, రఘువీరారెడ్డి మీడియా వద్దకు వచ్చి తొలిరోజు ఎలాంటి గొడవ జరగలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. రఘువీరారెడ్డి మాత్రం మీడియాది రాక్షస ఆనందం అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి సైతం మీడియాను పట్టించుకోవలసిన పనిలేదని తన సహజ శైలిలో వ్యాఖ్యానించారు.

Thursday, September 1, 2011

రాజకీయాల్లోకి రాను రానంటూనే... ఇందిరను మరిపించే ప్రియాంక


 http://www.telegraphindia.com/1080503/images/03priyanka.jpg
ఒకానొక దశలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని భావించిన ప్రియాంక గాంధీ ఆ తరువాత అకస్మాత్తుగా తెరమరుగయ్యారు. కుటుంబ జీవితానికి పరిమితమయ్యారు. ఇటీవల ఆమె పార్లమెంట్‌ ఆవరణలో ప్రత్యక్షం కావడం తిరిగి రకరకాల ఊహాగానాలకు తెరదీసింది. 
http://www.asiantribune.com/files/images/Priyanka_0.bmp
తల్లి ఆరోగ్యం బాగా ఉందని చెప్పడానికి మాత్రమే తాను వచ్చినట్లు ప్రియాంకా గాంధీ చెబుతున్నప్పటికీ, ఊహాగానాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. రాహుల్‌ గాంధీ పరోక్షంగా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ ఫలితాలు మాత్రం నిరాశాజనకంగా ఉండడం కాంగ్రెస్‌ శ్రేణులను కుంగదీస్తోంది. 
http://static.indianexpress.com/m-images/Tue%20Apr%2014%202009,%2012:19%20hrs/M_Id_71571_priyanka_gandhi.jpg
పార్టీలోని సీనియర్‌ నాయకులు కొంతమంది రాహుల్‌ స్థానంలో ప్రియాంక పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు. ముమ్మూర్తులా నాయనమ్మ ఇందిరాగాంధీని పోలి ఉండే ప్రియాంక గాంధీకి అభిమానులు కూడా అనేకం ఉన్నారు. భవిష్యత్తులో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటే, ప్రయోగించే అస్త్రంగా ప్రియాంక ఉంటారనే వాదనలూ ఉన్నాయి.
http://static.indianexpress.com/m-images/Tue%20Apr%2028%202009,%2010:41%20hrs/M_Id_74162_priyanka_gandhi.jpg
ప్రొఫైల్‌
పేరు		: ప్రియాంక  
పుట్టిన తేదీ	: 12 జనవరి 1972
తల్లిదండ్రులు	: సోనియా, రాజీవ్‌ గాంధీ
భర్త		: రాబర్ట్‌ వధేరా
పిల్లలు		: రైహన్‌ వధేరా, 
		  ఒమిరయా వధేరా
హాబీలు	: అమెచ్యూర్‌ రేడియో ఆపరేటర్‌


రాజకీయాల్లో...
Priyanka---Indira 
ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు ఒకప్పుడు బాగా సాగి నప్పటికీ, ఆమె మాత్రం ఎన్నడూ తన పరిమితులు దాటలేదు. రాజకీయాల్లో తల్లికి, సోదరుడికి సహకరించినప్ప టికీ, తన ప్రాధాన్యాలేంటో స్పష్టం చేశారు. తన కుటుంబం, ఇద్దరు పిల్లల పెంపకానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చారు.1999 నాటి ఎన్నికల ప్రచారం సంద ర్భంగా ఆమె బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. 
http://www.telegraphindia.com/1060509/images/09priyanka.jpg
ప్రజల కన్నా కూడా రాజకీయాలు ముఖ్యం కాదన్నారు. రాజకీయాల్లోకి రాకుండానే తాను ప్రజలకు చేయగలిగింది చేస్తానని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. 
priyankad
ఆమె ఇంతగా వెల్లడించినా కాంగ్రెస్‌ నాయకులకు మాత్రం ఆశ చావలేదు. ఆమె ఎప్పటికైనా రాజకీయాల్లోకి రాకపోదా అని చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. http://specials.rediff.com/news/2004/aug/20sld03.jpg
రాజీవ్‌, సోనియాగాంధీల ముద్దుల పట్టీగా ప్రియాంక భారత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావించే కాంగ్రెస్‌ నేతలు ఒక్కసారిగా తిరిగి తమ గళాన్ని విప్పుతున్నారు. వారంతా ఆమెలో ఇందిరాగాంధీని దర్శిస్తున్నారు. 
http://media2.intoday.in/indiatoday/images/stories//march09/090418105137_priyankssss.jpg
ఆమె గనుక పార్టీ పగ్గాలు చేపడితే ఇందిర తరహాలో పార్టీకి పునర్‌ వైభవం తేగలరని భావిస్తున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ప్రియాంక గాంధీ పెళ్ళి అయిన తరువాత ప్రియాంక వధేరాగా మారిపోయారు.

విద్యాభ్యాసం...
Priyanka-Gandhi-kids 
ఢిల్లీలోని కాన్వెంట్‌ ఆఫ్‌ జీసస్‌ అండ్‌ మేరీలో ప్రియాంక ప్రాథమిక విద్యా భ్యాసం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆమె సైకాలజీలో డిగ్రీ పొందారు. ఆమె అమెచ్యూర్‌ రేడియో ఆపరేటర్‌ కావడం విశేషం.http://4.bp.blogspot.com/_xS8RbsvLaAM/SwzxbwxunzI/AAAAAAAAQ1Y/eXxCojKYQHE/s1600/1-739487.jpg
తల్లికి, సోదరుడికి సహకరిస్తూ...
ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ, తల్లి నియోజకవర్గం రాయ్‌బరేలిలో, సోదరుడి నియోజకవర్గం అమేథీలో తరచూ పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆమె ఎక్కడ పర్యటించినా ప్రజాస్పందన బాగా ఉండేది. అమేథి కా ఢంకా బైఠియా ప్రియాంక అనే నినాదం అక్కడ బాగా ప్రాచుర్యంలో ఉంది. చక్కటి కార్యనిర్వాహకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. తల్లికి వివిధ రాజకీయ అంశాల్లో ఆమె సలహా లిచ్చేవారు.
http://livinggallery.oneindia.in/d/7298-2/priyanka-and-rahul-gandhi.jpg
2004 సాధారణ ఎన్నికల్లో ఆమె తల్లికి క్యాంపెయిన్‌ మేనేజర్‌గా వ్యవహరించా రు. సోదరుడు రాహుల్‌గాంధీ ప్రచార వ్యవహారాలను కూడా ఆమె పర్యవేక్షించా రు. 
http://static.indianexpress.com/m-images/Thu%20Apr%2023%202009,%2016:30%20hrs/M_Id_73311_priyanka_gandhi.jpg
ప్రజలకు సేవ చేయడమే రాజకీయం... రాజకీయాల్లోకి రాకుండానే నేను ఆ పని చేస్తున్నాను అని అంటారు ఆమె. మరో ఐదేళ్ళ పాటు మాత్రమే ఇలా రాజకీయాల్లో సహకరించే అవకాశం ఉందని కూడా అప్పట్లోనే ఆమె స్పష్టం చేశారు.

వివాహం...

pol_priyanka 
ఢిల్లీకి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త రాబర్ట్‌ వధేరా ను ఆమె వివాహం చేసుకు న్నారు. వారికి ఇద్దరు పిల్ల లు. రాజీవ్‌ కుటుంబానికి సన్నిహితమైన ఖత్రోచి ఇంట్లో ప్రియాంక, రాబర్ట్‌ల తొలి పరిచయం జరిగి ఉం టుందని భావిస్తున్నారు. 1997 ఫిబ్రవరి 18న వీరి పెళ్ళి జరిగింది. రాబర్ట్‌ సోదరుడు రిచర్డ్‌ 2003లో తన నివాసంలో మృతి చెంది కన్పించారు. రాబర్ట్‌ సోదరి మిషిల్లె 2001లో కారుప్రమాదంలో మరణించింది.రాబర్ట్‌ తండ్రి రాజీం దర్‌ 2009లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు.సోనియాగాంధీ అల్లుడిగా రాబర్ట్‌ వధేరా శరవేగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిపోయారు.

Priyanka 
యూనిటెక్‌లో ఆయనకు 20 శాతం వాటా ఉంది. జ్యుయలరీ, హస్తకళలకు సంబంధించిన ఆర్టెక్స్‌ అనే చిన్న కంపెనీని ఆయన సొంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన కంపెనీలు డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ నుంచి అన్‌ సెక్యూర్డ్‌ రుణాలు పొందాయి. ఆయన, ఆయన తల్లి భాగస్వాములుగా ఉన్న సై్క లైట్‌ హాస్పిటాలిటీ ప్రై.లి. దక్షిణ ఢిల్లీలోని హిల్టన్‌ గార్డెన్‌ ఇన్‌లో వాటా కలిగి ఉంది. 2009 నాటికి సై్క లైట్‌ హాస్పిటాలిటీ సంస్థ డీఎల్‌ఎఫ్‌ నుంచి రూ. 25 కోట్ల మేరకు రుణాలుపొందింది. బ్లూ బ్రీజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ (ఎయిర్‌క్రాఫ్ట్‌ ఛార్టరింగ్‌), నార్త్‌ ఇండియా ఐటీ పార్క్‌‌స ప్రై.లి., రియల్‌ ఎర్త్‌ ఎస్టేట్స్‌ ప్రై.లి., సై్క లైట్‌ రియాలిటీ ప్రై.లి. తదితరాల్లో ఆయనకు వాటాలున్నాయి. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఒక దశలో వచ్చాయి.

Tuesday, August 30, 2011

కులకలం!

kulam
 
కాంగ్రెస్‌ పార్టీని పుట్టి ముంచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం కుల సమీకరణానికి తెరలేపింది. పార్టీకి ఆది నుంచీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా జగన్‌ వైపు వెళ్లే ప్రమాదం కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌ నాయకత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. అందులో భాగంగా కుల సమీకరణను ఎంచుకుంది. రెడ్డి- రాయలసీమ కోటాలో ముఖ్యమంత్రిగా నియమించిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇచ్చిన అవకా శాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న అసంతృప్తి ఇంకా నాయకత్వంలో ఉన్నట్లు సమా చారం.

జగన్‌ వైపు రెడ్డి సామాజిక వర్గం వెళ్లకుండా చూడటంలో కిరణ్‌ పూర్తిగా విఫలమయ్యారన్న అభిప్రాయం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఆంధ్రా రెడ్లను గానీ, ఇటు తెలంగాణ రెడ్లను గానీ మెప్పించలేకపోతున్నారన్న భావన నెలకొంది. 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా కిరణ్‌ ఏ స్థాయిలోనూ అడ్డుకోలేకపోయారని, కేవలం ఆయన వైఫల్యం వల్లే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జగన్‌ గూటి కి చేరారన్న నివేదికలు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరాయి. కిరణ్‌ సమర్థవంతంగా వ్యవహరించి, అందరినీ సమన్వయం చేసుకుని, వారికి అనుకూలంగా ఉన్నట్టయితే కనీసం 20 మంది కాంగ్రెస్‌లోనే ఉండిపోయారన్న భావన నాయకత్వంలో ఉంది. ముఖ్యమంత్రి సమన్వయలోపం-లౌక్యం లేకపోవడం, వేగంగా ఎత్తులు వేయకపోవడం, సీనియర్ల సలహాలు తీసుకోకపోవడం, గిరిగీసుకుని ఉండటం, కొందరికే పరిమితం కావడం వంటి కారణాలే ఈ దుస్థితికి కారణమన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మిగిలిన కులాలు చేజారకుండా ఉండేందుకు ఆయా వర్గాలకు చెందిన నేతలకు పదవులు ఇచ్చి ఆయా కులాలను సంతృప్తి పరిచే వ్యూహాన్ని అమలుచేస్తున్నట్లు ఆ పార్టీ నాయకత్వం తీసుకుంట్నున నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. వారిని సమన్వయం చేసుకోవడం కిరణ్‌కు సాధ్యం కాదని గ్రహించే కులాల వారీగా నియామకాలు చేస్తున్నట్లు ఇటీవలి కాలంలో వరసగా చేస్తున్న నియామకాలు స్పష్టం చేస్తున్నాయి. జనాభాలో సింహభాగం ఉన్న బీసీలను సంతృప్తి పరిచేందుకు ఆ వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. దీనితో బీసీలు తన వైపు ఆకర్షితులవుతారని అంచనా వేస్తోంది. బొత్స సాంకేతికంగా బీసీ వర్గానికి చెందిన తూర్పు కాపు వర్గానికి చెందిన నేత అయినప్పటికీ, ఆయన కాపులతో సత్సంబంధాలు ఎక్కువగా ఉండటం కలసివచ్చే పరిణామంగా భావిస్తోంది.

అయితే, ఒక్క బొత్సకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా బీసీలకు న్యాయం చేసినట్లు కాదని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు ఇవ్వకపోతే వారిలో నెలకొన్న అసంతృప్తిని టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సద్వినియోగం చేసుకునే ప్రమాదం లేకపోలేదని నేతలు హచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమ, ఉభయ గోదావరి జిల్లాలో శెట్టి బలిజలు, కోస్తాలో యాదవ, మత్స్య, రాయలసీమలో బోయ, ఈడిగ, తెలంగాణలో యాదవ, గౌడ, మున్నూరుకాపు, పద్మశాలి వంటి ప్రధాన కులాలకు అవకాశాలు ఇవ్వకపోతే పార్టీ దెబ్బతింటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

బొత్స బీసీ నేతగా కాకుండా కాపు నేతగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో బీసీకార్డుతో నాయకత్వం ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ, దానిని కాపుల కోసం వినియోగిస్తుండటంతో బీసీలు దూరమవుతున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్యాయి. కాపులను బీసీల్లో చేర్పించే యత్నాలకు బొత్స మద్దతు పలుకుతుండటం బీసీల్లో వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తోంది. తాజాగా వైశ్య వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు తమిళనాడు గవర్నర్‌గా అవకాశం ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. ప్రతి పట్టణoలోనూ ఆర్థికంగా బలంగా ఉండే వైశ్య వర్గాన్ని ఆకట్టుకునే యత్నాలు ప్రారంభించింది.

రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ఏపీఐఐసీ చైర్మన్‌గా అదే వర్గానికి చెందిన శివరామ సుబ్రమణ్యానికి అవకాశం ఇచ్చినప్పటికీ, ఆయన ఇప్పటికీ సంస్థపై పట్టు సాధించలేకపోయారు. ఆయనను అధికారులతో సహా ఎవరూ లెక్కచేసే పరిస్థితి లేకపోవడంతో ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారు. అటు పార్టీకీ ఆయన వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న అభిప్రాయం నెలకొంది.ఇక కోస్తాలో బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని దరిచేర్చుకునేందుకు ఆ వర్గానికి చెందిన యువనేత నాదెండ్ల మనోహర్‌కు స్పీకర్‌ పదవి ఇవ్వడం ద్వారా కమ్మ వర్గానికి చేరవయ్యే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఖమ్మం జిల్లాల్లో బలంగా ఉన్న ఈ వర్గం ఓట్లబ్యాంకును కొల్లగొట్టడమే కాంగ్రెస్‌ లక్ష్యమని నాదెండ్ల నియామకంతో కనిపిస్తోంది. అయితే, మనోహర్‌ నియామకంలో రోశయ్య కీలకపాత్ర పోషించారు.

జగన్‌ నిష్ర్కమణతో దూరమయిన రెడ్డి ఓటు బ్యాంకు స్ధానంలో ప్రత్యామ్నాయంగా కాపులను తెరమీదకు తీసుకువచ్చింది. గత ఎన్నికల్లో 17 లక్షల ఓట్లు సాధించిన చిరంజీవిని తనలో విలీనం చేసుకోవడంలో అదే ప్రధాన కారణంగా స్పష్టమవుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కాపు, కడప, అనంతపురం జిల్లాల్లోని బలిజ వర్గాలను ఆకర్షించేందుకు చిరును ఓ సాధనంగా మలచుకుంటోంది. 4 శాతం ఉన్న రెడ్లు వెళ్లినా వారి స్థానంలో 10 శాతం ఉన్న కాపులతో నష్టనివారణ చేయవచ్చన్న వ్యూహం అధిష్ఠానం ఆలోచనలో కనిపిస్తోంది.

ఇక ఎస్సీల్లోని రెండు ఉప కులాలకూ నాయకత్వం సమ ప్రాధాన్యం ఇచ్చింది. మాల వర్గానికి చెందిన భట్టి విక్రమార్క, మాదిగ వర్గానికి చెందిన దామోదర రాజనర్శింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా మాల-మాదిగలను సంతృప్తి పరచాలన్న వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో ఎక్కువగా ఉన్న మాదిగలను, కోస్తాలో అధికంగా ఉన్న మాలలను ఏకకాలంలో సంతృప్తి పరిచేందుకు నాయకత్వం ఈ రెండు నియామకాలను పూర్తి చేసింది.


ఇక తాజాగా క్షత్రియ వర్గానికి చెందిన కనుమూరి బాపిరాజుకు ప్రతి ష్ఠాత్మకమైన టిటిడి చైర్మన్‌ పదవి ఇవ్వడం ద్వారా గోదావరి, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ఆ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు నాయకత్వం ప్రయ త్నించింది. సౌమ్యుడిగా పేరున్న బాపిరాజుకు ఆ పదవి ఇవ్వడం ద్వారా రాజు లను మచ్చిక చేసుకోవాలన్నది కాంగ్రెస్‌ వ్యూహం. కేవలం 4 శాతమే ఉన్నప్పటికీ, ఆధిపత్యం, అంగ-అర్ధబలాలు దండిగా ఉన్న రెడ్ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ ఇన్ని కసరత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tuesday, July 12, 2011

మన్మోహన్‌ మంత్రివర్గానికి ... ‘' కొత్త '’ కళ

PM--Prez---Ministers
మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గానికి ‘కొత్త’ కళ వచ్చింది. మంగళ వారం జరిపిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఎనిమిది మంది కొత్తగా మంత్రులయ్యారు. వారిలో కళాకారులు, కళలపట్ల అభిరుచి ఉన్నవారు ఉన్నా రు. వీణ వాయించడం నుంచి విమానం నడపడం వరకు విభిన్న అభిరుచులు వారివి. కొత్త మంత్రుల్లో వి. కిశోర్‌చంద్రదేవ్‌ వంటి వయోధికులూ ఉన్నారు. మిలింద్‌ దేవర వంటి పిన్నవయస్కులూ ఉన్నారు. మరో విశేషమేమంటే కొత్త మంత్రులందరూ పట్టభద్రులే. వారందరిలోకీ అత్యున్నత విద్యావంతుడు సహాయమంత్రిగా నియమితులైన చరణ్‌దాస్‌ మహంత్‌. ఆయనకు ఎంఎస్‌సి, ఎంఏ, ఎల్‌ఎల్‌బి, పిహెచ్‌డి డిగ్రీలున్నాయి.

అభిరుచికల మంత్రులు
తాజాగా మంత్రులైనవారిలో కళాకారులున్నారు. మహంత్‌కు సంగీతం, చర్చలు, విహారయాత్రలు, కుటుంబంతో గడపడం అంటే ఇష్టం. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు జయంతి నటరాజన్‌కు కేబినెట్‌లో స్థానం లభించింది. ఆమె వైణికురాలు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటా రు. మన్మోహన్‌సింగ్‌కు ఆమె అభిరుచి తెలుసో తెలీదో కానీ జయంతి నటరాజ న్‌కు పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చారు. పర్యావరణం అంటే ప్రాణమిచ్చే జయంతి నటరాజన్‌కు తత్వశాస్త్రం, కవిత్వం, హాస్యానికి సంబంధించిన పుస్త కాలు చదవవడం హాబీ. పుస్తకాలను ఆమె ప్రేమిస్తారు. ఔత్సాహికుల నాటకాలన్నా ఇష్టమే.

అందరూ సంగీత ప్రేమికులే
కొత్త మంత్రుల్లో దాదాపు అందరూ సంగీత ప్రేమికులే. ఇప్పటి మంత్రుల్లో యువకుడైన మిలింద్‌ దేవరకు పాశ్చాత్య సంగీతమంటే అభినివేశముంది. ఆయన జాజ్‌ గిటార్‌ వాయిస్తారు. ఇకపై పార్లమెంటు సభ్యులు ఆయన జాజ్‌ను వినవచ్చు. భారతీయ శాస్ర్తీయ సంగీతం నుంచి ప్రారంభిస్తే ఆయన అభిరుచు లు అనంతం. ఆత్మకథల్ని చదవడం ఆయనకు ఇష్టం. సరే! వీరి సంగతి ఇలా ఉంటే, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన సుదీప్‌ బందోపాధ్యాయ తీరే వేరు. ఆయన పార్లమెంటునే కళావేదికగా మార్చగలరు. 1998లో విశ్వకవి రవీంద్ర నాథ్‌ ఠాగోర్‌ జయంతి సందర్భంగా బందోపాధ్యాయ రవీంద్ర సంగీతాన్ని మృదుమధురంగా ఆలపించారు.

mILIND-dEWARA 

ఇక 64 ఏళ్ల కిశోర్‌చంద్ర దేవ్‌ విషయానికి వస్తే ఆయన పొలిటికల్‌ సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. వంటచేయడం, జ్యోతి శ్శాస్త్రం దగ్గర్నుంచి సంగీతం వరకూ ఆయన అందె వేసిన చెయి. కొత్త అష్ట దిగ్గజాల్లో ఆయ నొక్కరే రచయిత. ఆయనకు ఈత, రైఫిల్‌ షూ టింగ్‌, బిలియర్డ్స్‌, చదరంగం, టెన్సిస్‌, క్రికెట్‌ కూడా వచ్చు. దేవ్‌కు 31 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి కేంద్రమంత్రివర్గంలో స్థానం లభించింది. మొదటిసారి ఆయన 1979లో కేంద్రంలో మంత్రి అయ్యారు. 40 ఏళ్ల జితేం ద్రసింగ్‌ గురితప్పకుండా కాల్చడంలో దిట్ట. క్రీడల్లో ఆయనకు జాతీయస్థాయి పతకం కూడా లభించింది. బీకాం పట్టభద్రుడైన జితేంద్రసింగ్‌కు మోటార్‌ మెకానిక్స్‌, విమానాలు నడపడం, ఫోటోగ్రఫీ, హిమాలయాల ఆరోహణ అంటే ఇష్టం. కోల్‌కతాలో గంగానది ప్రక్షాళన, పునరుద్ధరణ గురించి తను ఆలోచిస్తున్నానని 59 ఏళ్ల బందోపాధ్యాయ చెప్పారు.

ఆయన తన తీరిక సమయాన్ని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు చదవడం లోను, పెంపుడు పక్షులతోనూ గడుపుతారు.మహంత్‌కు కబీర్‌ కవిత్వం అంటే ఎనలేని మక్కువ. కవిసమ్మేళనాలు నిర్వహించారు. పెయింటింగ్‌, చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గిరిజనుల అభి వృద్ధికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారుచేశారు. జానపద కళలు, నాటకం, గీతాలను ఆయన ప్రోత్సహిస్తున్నారు. 61 ఏళ్ల పవన్‌సింగ్‌ ఘటోవార్‌ విద్య, సంస్కృతి, సాంఘిక సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. లా గ్రాడ్యుయేట్‌ రాజీవ్‌ శుక్లా (52) జర్నలిజం నుంచి వచ్చారు.

తెలుగువాడు ఒక్కడే...
సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌ను విస్తరించారు. మన రాష్ట్రానికి ఈసారీ దక్కింది నామమాత్రమే. కిషోర్‌కు చోటు ఇచ్చి సాయిప్రతాప్‌ను సాగనంపడంతో కేబినెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగుతున్నది. కాకపోతే కిషోర్‌కు కేబినెట్‌ హోదా ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రభావం కేబినెట్‌ కూర్పుపై ప్రస్ఫుటంగా కనిపించింది.

kishore-chandra-deo 
ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆంధ్రప్రదేశ్‌కు తగినంత ప్రాధాన్యం లభించలేదు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి కిశోర్‌ చంద్రదేవ్‌కు కేబినెట్‌ హోదా లభించడం తప్ప రాష్ట్రం మరే ప్రయోజనాన్ని పొందలేకపోయింది. కిశోర్‌చంద్రదేవ్‌ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని వ్యక్తి కనుకనే ఆయనకు ‘కేబినెట్‌’ దక్కిందని భావిస్తున్నారు. కిశోర్‌చంద్రదేవ్‌కు గిరిజన వ్యవహా రాలు, పంచాయతీరాజ్‌ శాఖలను కేటాయించారు. సహాయ మంత్రిగా ఉన్న పురందేశ్వరికి పదోన్నతి లభించలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాడు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన చాలామంది నాయకులు రాజీనామా చేయడం, దాంతో సంక్షోభం నెలకొనడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు మంత్రి వర్గ విస్తరణలో తగిన ప్రాధాన్యం లభించలేదని భావిస్తున్నారు. పైగా ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి ఎ సాయి ప్రతాప్‌ను తొలగించారు కూడా.

మార్పులు చేర్పులు
మంగళవారం జరిగిన యూపీఏ-2 మంత్రివర్గ పునర్‌వ్య వస్థీకరణలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అనేకమం ది మంత్రులకు ఇప్పటి మాదిరిగానే కొన్ని కీలక శాఖల అద నపు బాధ్యతలు తప్పలేదు. మంత్రుల ప్రమాణస్వీకారం అనం తరం మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌- వచ్చే లోక్‌సభ ఎన్నికలవరకు ఇక పునర్‌వ్యవస్థీకరణ ఉండదని, ఆరోపణలకు గురై రాజీనామాలు చేసిన ఇద్దరు డిఎంకె మంత్రుల శాఖలు ఖాళీగానే ఉంటాయని ‚స్పష్టం చేశారు. నాలుగు ప్రధాన కీలక శాఖలైన ఆర్థిక, రక్షణ, విదేశీ, హోంశాఖల జోలికి ప్రధాని వెళ్ల లేదు. ప్రస్తుతమున్న మంత్రులే ఇకపై కూడా ఆ శాఖల్ని నిర్వహిస్తారు. టెలికాం, పౌరవిమానయానశాఖల్ని ఈసారి కూడా ‘అదనపు బాధ్యతగా’నే ఉంచారు.

జైరాంకు పదోన్నతి
తన వ్యాఖ్యలతో వివాదాస్పదుడుగా ముద్ర పడిన జైరాం రమేష్‌ను పర్యావరణం నుంచి తప్పించి, గ్రామీణాభివృద్ధి శాఖ నిచ్చి కేబినెట్‌ హోదా కల్పించారు. ఈ శాఖనింతవరకు విలాస్‌ రావ్‌ దేశ్‌ముఖ్‌ నిర్వహించారు. న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీని ఆ శాఖ నుంచి మార్చడం కూడా ఎన్నదగిన మా ర్పే. సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వం ఇటీవల అనేక సందర్భా ల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంది. సల్మాన్‌ ఖుర్షీ ద్‌కు న్యాయశాఖను ఇచ్చారు. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయ కుడు దినేష్‌ త్రివేదికి పదోన్నతి లభించింది. ఆయనకు కేబినెట్‌ హోదాతో రైల్వేశాఖనిచ్చారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి కాకముందు మమతాబెనర్జీ ఆ శాఖను నిర్వహించారు. ఆ శాఖ తమ పార్టీ నుంచి జారిపోకుండా సాధించు కోవడంలో మమత కృతకృత్యులయ్యారు. ఇంతవరకు స్వతంత్రంగా ఉక్కు మంత్రిత్వశాఖను నిర్వహించిన బేనీ ప్రసాద్‌ వర్మకు కేబినెట్‌ హోదా లభించింది.

ప్రమాణస్వీకారం
కొత్తగా మంత్రివర్గంలో నియమితులైన ఎనిమిది మంది, కేబినెట్‌ హోదాకు పదోన్నతి పొందిన ముగ్గురు సహాయ మం త్రుల చేత రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌ రాష్టప్రతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టప్రతి హమీ ద్‌ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్స న్‌ సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ హాజరయ్యారు.

ఇప్పుడు 68 మంది

మంత్రివర్గంలో కొత్తగా మొత్తం ఎనిమిది మంది చేరడంతో మంత్రుల సంఖ్య 68కి చేరింది. వివిధ కారణాలవల్ల అంతకు ముందు ఏడుగురు రాజీనామా చేశారు.

కొత్త మంత్రులు

కొత్తగా చేరిన ఆరుగురిలో జయంతి నటరాజన్‌, పర్బన్‌ సింగ్‌ ఘటోవార్‌, సుదీప్‌ బందోపాధ్యాయ, జితేంద్రసింగ్‌, మిలింద్‌ దేవర, రాజీవ్‌ శుక్లా ఉన్నారు. తమను ఇండిపెం డెంట్‌ ఛార్జితో సహాయ మంత్రులుగా చేయడంపట్ల శ్రీకాం త్‌ జెనా, గురుదాస్‌ కామత్‌ అసంతృప్తి చెందారు. 11 మం ది మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత రాష్టప్రతి భవన్‌లో మాట్లాడుతూ మన్మో హన్‌సింగ్‌- వివిధ రాష్ట్రాలమధ్య సమ తుల్యత, సామర్థ్యం, కొనసాగింపు అంశాలను దృష్టిలో ఉంచుకొని పునర్‌వ్యవస్థీకరణ జరిగిందన్నారు.

అసంతృప్తి సహజమే: ప్రధాని
‘2014 లోక్‌సభ ఎన్నికల ముందు జరిపే చివరి విస్తరణ అని నేను భావిస్తున్నాను. మొత్తానికి ఇది సమగ్రమైన విస్తరణ’ అన్నారు. ‘కొందరికి అసంతృప్తి కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయని మీకు ముందే తెలుసా?’ అని అడగ్గా- ‘శాఖ లు మార్చినప్పుడు సమస్యలు సహజమే. దేశ ప్రయోజనాల్నే ముఖ్యంగా పరిగణనలోకి తీసుకున్నా’ మని ప్రధాని చెప్పారు.

కామత్‌ రాజీనామా
ప్రమాణస్వీకారానికి గురుదాస్‌ కామత్‌, శ్రీకాంత్‌ జెనా గైర్హాజరయ్యారు. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అసం తృప్తి వ్యక్తం చేశారు. ముంబయిలో ఉన్న కామత్‌ రాజీనామా లేఖ పంపగా రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌ ఆమోదించారు.

వీరికి ఉద్వాసన
మార్పులు, చేర్పుల్లో కొందరికి ఉద్వాసన పలికారు. వారిలో ఎంఎస్‌ గిల్‌, బికె హాందిక్‌, కాంతీలాల్‌ భూరియా, మురళీ దేవర, దయానిధి మారన్‌ ఉన్నారు. సహాయమంత్రులు సాయి ప్రతాప్‌, అరుణ్‌యాదవ్‌లను కూడా తొలగించారు. దయానిధి మారన్‌ రాజీనామా చేయగా, మురళీదేవర రాజీ నామాకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

డిఎంకె స్థానాలు పదిలం
రాజీనామాలు చేసిన ఇద్దరు డిఎంకె మంత్రుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయని, సంకీర్ణ ధర్మం ప్రకారం ఎవరినీ నియ మించలేదని, ఆ పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని ప్రధాని అన్నారు. ‘ప్రభుత్వం ప్రస్తుత సమ స్యల్ని అధిగమించగలుగుతుందా?’ అని అడగ్గా ‘తప్పకుండా. అందులో సందేహం లేదు’ అన్నారు. జైరాంశాఖ మార్పు గురిం చి చెబుతూ మరింత బాధ్యతాయుతమైన శాఖనిచ్చా మని, ఆయన అనుభవం ఆ శాఖకు ఉపయోగపడుతుందన్నారు.

రాహుల్‌ మాటేమిటి?

కేంద్ర మంత్రిమండలిలో ఇంతవరకు రాహుల్‌గాంధీని చేర్చుకోకపోవడంపై విలేకరులు అడగ్గా- ‘మంత్రివర్గంలో చేర మని నేను చాలాసార్లు కోరాను. కానీ తనకు పార్టీపరమైన బాధ్యతలున్నాయని ఆయన చెప్పారు’ అని ప్రధాని అన్నారు.

అదనపు శాఖలు
జౌళి, జలవనరుల శాఖల్ని ఆనంద్‌శర్మ, పికె బన్సాల్‌కు ఇచ్చామని ప్రధాని తెలిపారు. శర్మకు ఇప్పుడున్న వాణిజ్యం, పరిశ్రమలు, బన్సాల్‌కు పార్లమెంటరీ వ్యవహారాలు అలాగే కొనసాగుతాయి.కపిల్‌ సిబల్‌కు అదనంగా ఉన్న టెలికాం, భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్‌ రవి అదనంగా నిర్వహిస్తున్న పౌర విమానయానం వారివద్దే ఉంటాయన్నారు.

శాఖలపట్ల అసంతృప్తి
2009లో సహాయమంత్రిగా నియమితులైనప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న శ్రీకాంత్‌ జెనాకు మంగళవారం జరిగిన పునర్‌వ్యవస్థీకరణలో గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖల ఇండిపెండెంట్‌ ఛార్జి ఇచ్చి పదోన్నతి కల్పించారు. ప్రాధాన్యం లేని శాఖ ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. ఎరువులు, రసాయనాల శాఖ కేబినెట్‌ మంత్రిగా డిఎంకెకు చెందిన ఎంకె అళగిరి కొన సాగుతారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒకే ఒక ఎంపీ చరణ్‌దాస్‌ మ హంత్‌ తొలిసారి మంత్రి అయ్యారు. ఆయనకు వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల సహాయమంత్రి పదవి లభించింది.

గురుదాస్‌ కామత్‌ను హోం, కమ్యూనికేషన్‌ల నుంచి రక్షిత మంచినీరు, శానిటేషన్‌కు ఇండిపెండెంట్‌ ఛార్జి ఇచ్చి మార్చా రు. కానీ, ఆ శాఖపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కామత్‌ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. విదేశీ వ్యవహారాల సహా య మంత్రి ఇ అహ్మద్‌కు మానవ వనరుల అభివృద్ధి శాఖను కూడా కేటాయించారు. సహాయమంత్రులు వి నారాయణ స్వామి, అశ్వనీకుమార్‌లను పార్లమెంటరీ వ్యవహారాల నుంచి తప్పించారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన రాజీవ్‌ శుక్లాకు, హరీష్‌ రావత్‌కు ఆ పదవిని కేటాయించారు. నౌకాయానం, రైల్వేల సహాయమంత్రిగా ఉన్న ముకుల్‌ రాయ్‌కి కేబినెట్‌ హోదా ఇచ్చి రైల్వేశాఖను కేటాయించారు.

వారి పాపాలు మావి కావు
తనను న్యాయమంత్రిత్వశాఖ నుంచి తప్పించి కార్పొరేట్‌ వ్యవహారాలకు మార్చడంపై ఒకింత ఆగ్రహం చెందిన వీరప్ప మొయిలీ పాలనా మంత్రిత్వశాఖల పాపాలకు తమ మంత్రిత్వ శాఖను నిందించకూడదని, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆక్షేపణలకు పరిపాలనామంత్రిత్వశాఖ బాధ్యత వహించాలని అన్నారు.
చిరంజీవికి నిరాశే !
chiruf 
అనుభవమయితే గానీ తత్వం బోధపడదన్న వాస్తవాన్ని మెగాస్టార్‌ చిరంజీవికి కాంగ్రెస్‌తో కలసిన తర్వాత గానీ అర్ధం కాలేదు. కాంగ్రెస్‌ ధృతరాష్ట్ర కౌగిలి మొ దట ఊహల్లో తేల్చేదిగానే ఉంటుంది. ఆ తర్వాత సదరు బాధితుడి కష్టం కక్కలేక మింగలేక అన్నట్లుగా మారు తుంది. నిజంగా ఆ సినిమా కష్టం ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవికి సొంతమయింది. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవికి తానెంత పొరపాటు చేశానో ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. కేంద్రమంత్రి పదవి ఇస్తామని ఆశ చూపిన కాంగ్రెస్‌ చివరకు చిరంజీవికి శూన్య ‘హస్తం’ అందించింది.

satst 

కాంగ్రెస్‌లో విలీనానికి ముందు పార్టీ నాయ కత్వం చిరంజీవికి ఎనలేని గౌరవం ఇచ్చింది. జగన్‌ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన లేఖ రాసిన నెలరోజుల తర్వాత అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన సోనియాగాంధీ.. చిరంజీవికి వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. అటు ప్రధానితో సైతం రెండుసార్లు భేటీ అయ్యారు. ఒక్క ఎంపీ లేకపోయినా చిరంజీవి కేంద్రంలో మహా పలుకుబడి సంపాదిస్తున్నారని పాపం పీఆర్పీ నేతలు అప్పట్లో సంబరపడిపోయారు. తీరా చిరంజీవికి ఇప్పుడు ఆ అనుభూతే మిగిలినట్లు స్పష్టమయింది. తాజాగా జరిగిన కేంద్రమంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణలో చిరంజీవికి బెర్తు లభిస్తుందని ఆయన సన్నిహితులు, పీఆర్పీ నేతలు ఆశించారు. అయితే, ఆయన పేరు ఎక్కడా లేకపోవడంతో నిరాశపడ్డారు.

HANUMANTHARAO 

దానితోపాటు 2014 ఎన్నికల వరకూ చిరంజీవికి మంత్రి పదవి రాదన్న విషయం కూడా స్పష్టం కావడంతో జీర్ణిం చుకోలేకపోతున్నారు. 2014 వరకూ మంత్రివర్గ విస్తరణ ఉండదని ప్రధాని విస్పష్టంగా పేర్కొనడమే దానికి కారణం.దీనితో కాంగ్రెస్‌ తమను నమ్మించి మోసం చేసిందన్న విషయాన్ని పీఆర్పీ నేతలు గ్రహించారు. పార్టీలో చిరంజీవికి చాలాకాలం నుంచి సలహాలిస్తున్న ఒక సీనియర్‌ నాయకుడి మాటలు విని కాంగ్రెస్‌లో విలీనమయ్యామని, లేకపోతే తమకు ఇప్పటికీ గౌరవం ఉండేదని మండిపడుతున్నారు. సదరు నేత తన స్వార్థం కోసమే కాంగ్రెస్‌తో దోస్తీకి ప్రయత్నించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో తాము విలీనం కాకుండా బయటనుంచి మద్దతునిస్తే బాగుండేదని, కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామన్న భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

Satyanaraya 

2014 వరకూ చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి రాకపోతే ఇక తాము విలీనమయి ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దీని ప్రకారం చిరంజీవి స్థాయి రాష్టమ్రే తప్ప, కేంద్ర స్థాయి కాదని కాంగ్రెస్‌ చెప్పకనే చెప్పిందని మండిపడుతున్నారు. చిరంజీవి కూడా రాష్ట్రంలో ఏదో ఒక మంత్రిపదవి తీసుకుని సర్దుకుపొమ్మన్నట్లే కాంగ్రెస్‌ ధోరణి ఉందని విరుచుకుపడుతున్నారు.అయితే, ఇప్పుడు ఎంత పశ్చాత్తాపం చెందినా ప్రయోజనం లేదంటున్నారు. విలీన ప్రక్రియ మొత్తం పూర్తయినందున ఇప్పుడు చేసే ది కూడా ఏమీ లేదని వాపోతున్నారు. విలీన ప్రక్రియపై చిరంజీవిని తొందరపెట్టి, తప్పు దోవపట్టించిన సదరు సీనియర్‌ నాయకుడే తమ నాయకుడికి జరిగిన అవమానానికి బాధ్య త వహించాలంటున్నారు. ‘చిరంజీవిని అడుపెట్టుకున్న ఆయనకు అధిష్ఠానం వద్ద పలు కుబడి పెరిగింది. కానీ చిరంజీవికి మాత్రం అవ మానమే మిగిలింద’ని ఓ సీనియర్‌ నేత ఆవేదన వ్యక్తం చేశారు. 
అధిష్ఠానం వేటు మిత్రుడికి కత్తెర
SAI-PRATAP
కేంద్ర మంత్రివర్గం నుంచి సాయిప్రతాప్‌కు ఉద్వాసన చెప్పడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ హై కమాండ్‌ వైఎస్‌ కుటుంబానికి చెక్‌ పెట్టినట్లయింది. మైనింగ్‌ వ్యవహారాల లావాదేవీలతో వేళ్లూనుకుపోయిన వైఎస్‌ కుటుంబం ప్రత్యేకించి కడప పార్లమెంటు సభ్యుడు, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి చెక్‌ పెట్టింది. తన తండ్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉండగా కర్నాటకకు చెందిన గాలి జనార్ధన్‌రెడ్డికి పెద్ద ఎత్తున మైనింగ్‌ లీజులు లభించాయి. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పట్టుబట్టి తన మిత్రుడు రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అంతేగాకుండా మైనింగ్‌ వ్యవహారాలను తనకు అనుకూలమైన రీతిలో చక్కబెట్టుకోవచ్చునన్న అభిప్రాయంతోనే సాయిప్రతాప్‌కు భూగర్భ, మైనింగ్‌ శాఖను కేటాయింపజేసుకోగలిగినట్లు విమర్శలు వస్తున్నాయి.

సాయిప్రతాప్‌ సహాయ సహకారాలతోనే గాలి జనార్ధన్‌రెడ్డికి అవసరమైనన్ని మైనింగ్‌ లీజులను కూడా కట్టబెట్టించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబం గత మూడు దశాబ్దాల కాలంగా మైనింగ్‌ వ్యవహారాలద్వారా వచ్చిన సొమ్ముతోనే రాజకీయంగా నిలదొక్కుకుంటూ వచ్చింది.
మైనింగ్‌ వ్యాపారంలో గుట్టు, మట్టు తెలిసిన ఈ కుటుంబం వైఎస్‌ ముఖ్యమంత్రి కాగానే కేంద్ర స్థాయిలో తన మిత్రుడైన సాయిప్రతాప్‌కు అదే శాఖను కట్టబెట్టించి మైనింగ్‌ వ్యవహారాలు గనుల లీజులలో తనకు ఎదురు లేకుండా చేసుకోగలిగిందంటున్నారు.

మంత్రిగా ఉన్న సాయిప్రతాప్‌ ఇటీవల జరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారన్న అనుమానాలకు కూడా ధృవపడినట్లు సమాచారం. తన మిత్రుడు దివంగత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి తనయుడికి లబ్ధి చేకూరే విధంగా సహాయపడ్డారన్న సమాచారం కూడా పార్టీ అధీష్టానానికి చేరినట్లు తెలుస్తోంది. కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా జగన్‌పై పోటీ చేసిన మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డికి కూడా సాయిప్రతాప్‌ తగిన రీతిలో సహాయ సహకారాలందించలేదు. కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం గానీ పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించడంలోగానీ సాయిప్రతాప్‌ పెద్దగా ఆసక్తి కనబరచలేదంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌ పార్టీ హై కమాండ్‌ సాయిప్రతాప్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించి తద్వారా జగన్‌కు పరోక్ష హెచ్చరికలు చేసినట్లు భావిస్తున్నారు.

ఇవేం మార్పులు? - ఎ.కృష్ణారావు

కేంద్రంలో యుపిఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా దాటింది. కాంగ్రెస్‌కు గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం రెండేళ్లుగా ఊగిసలాటలోనే గడుపుతూ వస్తున్నది. ఇందుకు బహిర్గత కారణాల కంటే అంతర్గత కారణాలే ఎక్కువ ఉన్నాయి. మన్మోహన్ సింగ్ రెండవ సారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత గతంలో ఆయనకు బలంగా మద్దతు ఇచ్చిన పార్టీలోని అంతర్గతశక్తులే ఇప్పుడు ఆయన మానాన ఆయనను వదిలివేశాయి.

అయిదేళ్ల పూర్తికాలం ప్రధాని పదవిని నిర్వహించిన తర్వాత కూడా మన్మోహన్ సింగ్‌కు తన బాధ్యతల్ని స్వతంత్రంగా నిర్వహించగలిగిన శక్తి లేదు. నిజానికి తమ మంత్రిత్వ శాఖల్లో మంత్రులు ఏ పనులు చేస్తున్నారన్న విషయంలో ఆయనకు పట్టులేదు. ఒకవేళ సమాచారం ఉన్నా ఆయన ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో, కమ్యూనికేషన్ల మంత్రులుగా ఉన్న దయానిధి మారన్, ఎ. రాజా చేసిన అక్రమ వ్యవహారాల గురించి ప్ర«ధానమంత్రికి సమాచారం ఉన్నదనడానికి పలు ఆధారాలున్నాయి.

రాజా విషయంలోనైతే ప్రధానమంత్రి కార్యాలయానికి పలువురు ప్రతిపక్ష నేతలు ఉత్త్తరాలే రాశారు. ఇక దయానిధి మారన్ కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్ కంపెనీ అధినేత తన వాటాల్ని మలేషియాకు చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మాల్సిందిగా బలవంతపెట్టారని, ఈ కంపెనీ నుంచి దయానిధి మారన్ తన టీవీ ఛానల్‌కు ప్రయోజనం పొందారని సిబిఐ ఆరోపించింది.

నిజానికి మాక్సిస్ నుంచి మారన్ రూ.700కోట్ల ముడుపులు పొందారని ఢిల్లీకి చెందిన ఒక పత్రిక ఎప్పుడో వెల్లడించింది. టాటా-రూపర్ట్ మర్డోక్‌కు చెందిన టాటాస్కైను తన సన్ నెట్‌వర్క్‌లో 33.3 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సిందిగా దయానిధి మారన్ ఒత్తిడి చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇంత స్పష్టంగా తన మంత్రులు కార్పొరేట్ కంపెనీలకు వేలాది కోట్ల ప్రయోజనం చేకూరుస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతుంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చూస్తూ ఉండిపోయారు.

తాజాగా సిబిఐ దయానిధి మారన్‌పై ఆరోపణలు చేయడంతో ఆయన తన శాఖకు రాజీనామా చేశారు. బహుశా రాజా, కనిమొ ళి దారిలో ఆయన కూడా జైలు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడ్డ రాజకీయ నేతలు, అధికారులను ఉంచేందుకు తీహార్ జైలు సరిపోదని, ఒక ప్రత్యేక జైలు ఏర్పాటు చేయవలిసి వస్తుందేమోనని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిజానికి కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే మన్మోహన్‌సింగ్ మంత్రివర్గం పెట్టి పుట్టిందేమోనని అంటున్నారు.

గత జనవరి వరకు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉ న్న ఎన్‌సిపికి చెందిన ప్రఫుల్ పటేల్ ఎయిర్ ఇండియా ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రైవేట్ విమానయాన సంస్థలకు కోట్లాది ప్రయోజనాలు చేకూర్చారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీయే పేర్కొంది. మిత్రపక్షాలు అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకునే శక్తి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానికి లేకపోవచ్చు. కానీ దయానిధి మారన్, రాజాల గురించి కనీసం ప్రధాని జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా లేవు. సిఏజి నివేదిక బయటపడిన తర్వాతనే వారు తమ పదవులు వదులుకోవాల్సి వచ్చింది.

మిత్రపక్షాలకు చెందిన మంత్రులే కాదు స్వపక్షానికి చెందిన మంత్రుల విషయంలో కూడా ప్రధాని తన కళ్లకు గంతలు కట్టినట్లే వ్యవహరించారు. లేకపోతే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా ఉన్న మురళీ దేవర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రేపోమాపో జరుగుతుందనగా ఎందుకు రాజీనామా చేసి ఉంటారు? రిలయన్స్ కంపెనీ కెజి బేసిన్‌లో అభివృద్ది వ్యయాల్ని 117 శాతం పెంచేందుకు వీలుగా పెట్రోలియం మంత్రిగా ఆయన నిబంధనలు సడలించారని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ చమురు కంపెనీలు కొల్లగొట్టేందుకు వీలు కల్పించారని సిఏజి నివేదిక సమర్పించడంతో ఎందుకైనా మంచిదని మురళీ దేవర తప్పుకున్నారు.

మారన్, మురళీ దేవరలు మంత్రివర్గ మార్పులకు ముందే రాజీనామా చేయడం గురించి అభివర్ణిస్తూ ఒక ప్రతిపక్షనేత యుపిఏ ప్రభుత్వ పరిస్థితి ఓడ మునిగే ముందు ఎలుకలు ఖాళీ చేసినట్లుగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితికి ఈ వ్యాఖ్యానం స్పష్టంగా అద్దం పడుతున్నది.

అసలు కేంద్ర మంత్రుల్లో ఎవరు నిజాయితీపరులని చెప్పగలం? సాక్షాత్తు రాజాయే తాను అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం సలహా ప్రకారం నిర్ణయాలు తీసుకున్నానని ప్రధానికి లేఖ రాశారు. ఈ కుంభకోణం జరిగినప్పుడు చిదంబరం ఆర్థిక మంత్రిగా లైసెన్సుల మంజూరీలో కీలక పాత్ర పోషించారని, 2008లో 2001 ధరలకు స్పెక్ట్రమ్ లైసెన్సులు మంజూరు చేయమని చిదంబరమే రాజాకు సలహాలు ఇచ్చి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజా, కనిమొళి జైలు పాలైనప్పుడు మాత్రం చిదంబరంను మాత్రం ఎందుకు స్వేచ్చగా వదిలి వేయాలని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి కార్పొరేట్ కంపెనీలకు ఎంత పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చగలమో చిదంబరం కంటే బాగా తెలిసిన వారెవరూ లేరు. ఎందుకంటే ఆయన మంత్రికాక ముందు పలు కార్పొరేట్ కంపెనీల తరఫున లక్షల రూపాయల ఫీజు తీసుకుని వాదించి వారి ప్రయోజనాలను కాపాడారు. కనుక ఆయన సలహాలను రాజా లాంటి వారు తీసుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. మీడియాలో వార్తలు వస్తే ఎలా స్పందించాలో కూడా చిదంబరం రాజాకు సలహాలు ఇచ్చినట్లు ఇటీవల ఒక లేఖ ద్వారా వెల్లడైంది. అలాంటి వ్యక్తిని మన్మోహన్ సింగ్ యుపిఏ తొలివిడత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా నియమించారు.

ఆ తర్వాత ఆయనకు మరింత కీలకమైన హోంమంత్రి పదవిని అప్పగించారు. హోంమంత్రిగా ఆయన బుద్దిగా ఉన్నారని ఎవరైనా భావిస్తే అది అమాయకత్వ మే అవుతుంది. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఏరివేతకు గిరిజనులకు ఆయుధాలిచ్చి సల్వాజుడుం ఏర్పాటు చేయడం వెనుక వేల కోట్ల కుంభకోణం ఉన్నదని, కేంద్ర హోంశాఖనుంచి ఆ రాష్ట్రానికి కేటాయించే నిధుల్లో ముడుపులు ఆ హోంశాఖను నిర్వహిస్తున్న పెద్దమనిషికి చేరతాయని ఇటీవల ఒక సీనియర్ రాజకీయ నాయకుడు వెల్లడించారు. అంటే ప్రజల ప్రాణాల కన్నా తమ జేబులు నింపుకోవడమే రాజకీయ నేతలకు పరమావ«ధి అన్నమాట..

అందువల్ల కేంద్ర మంత్రివర్గంలో కొత్త ముఖాల్ని చేర్చి, ఏవో మార్పులు చేసి ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేందుకు మన్మోహన్ సింగ్ ప్రయత్నిస్తున్నారని ఎవరైనా చెబితే నవ్వుకోవడం మినహా ఏమీ చేయలేం. కేంద్రంలో నాలుగు కీలక శాఖల్ని మారుస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నది. కాని గత జనవరిలోనైనా, ఇప్పుడైనా ప్రధాని ఆ శాఖల్ని ముట్టుకోకుండానే మార్పుల్ని చేశారు. పర్యావరణ శాఖనుంచి జైరాం రమేశ్‌ను మార్చి ఆ శాఖలో చిదంబరంకు సన్నిహితురాలైన జయంతి నటరాజన్‌ను ఎందుకు నియమించారో ప్రధాని చెప్పగలరా?

ఒకప్పుడు జయంతి చిదంబరంతో పాటు మూపనార్ నేతృత్వంలోని తమిళమనీలా కాంగ్రెస్‌లో ఉన్నారని చాలా మందికి తెలుసు. రాజాకే సలహాలు ఇచ్చిన చిదంబరం పోస్కో, వేదాంత వంటి కంపెనీల విషయంలో జయంతికి మరింత సులభంగా సలహాలు ఇవ్వగ లరనడంలో ఆశ్చర్యం లేదు. గ్రామీణ ఉపాధి పథకం పేరు మీద రాష్ట్రాల్లో వేలకోట్ల మేరకు జరుగుతున్న అవినీతిని జైరాం రమేశ్ అరికట్టగలగడం అంత సులభంకాదు. ఒకే రోడ్డుకు రెండు పథకాల క్రింద నిధులు లాగగలిగిన ఘనులున్న వ్యవస్థలో జైరాం లాంటివారు ఆర్భాటమే కాని, ఆచరణలో చేయగలిగింది తక్కువఅని వాదించే వారు ఉన్నారు.

ఈ రీత్యా మంగళవారం మన్మోహన్ సింగ్ చేసిన పునర్వ్యవస్థీకరణ యుపిఏ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు పెద్దగా దోహదం చేయడం కష్టం. తృణమూల్ కాంగ్రెస్ పట్టుబట్టి మళ్లీ రైల్వేశాఖను తీసుకుంది. తన అధినేత్రి మమతా బెనర్జీ చెప్పినట్లు నడుచుకుంటానని ఆ శాఖ మంత్రి దినేశ్ త్రివేదీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించారు. మరి మన్మోహన్ ఎందుకున్నట్లు?

ఈ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ రాష్ట్రానికి అన్యాయమే జరిగింది. కిషోర్ చంద్రదేవ్‌కు స్థానం కల్పించారు కాని సాయిప్రతాప్‌ను ఎందుకు తీసుకున్నారో, ఎందుకు ఉద్వాసన చెప్పారో ఊహించడం కష్టం కాదు. 33 మంది ఎంపీలున్నా, రాష్ట్రానికి కేంద్రంలో ప్రాతినిధ్యం అంతగా లేకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం కావచ్చు. ప్రాంతీయ పోరాటాల్లో పడి జాతీయస్థాయిలో మన హక్కుల్ని విస్మరించడం బాధాకరమే.

 

Tuesday, June 14, 2011

నా టార్గెట్ సీఎం పీఠం! * వైఎస్ ఉన్నప్పుడే ఈ మాట చెప్పాను * జగన్ మాకు సమస్యే కాదు

నా టార్గెట్ సీఎం పీఠం!
వైఎస్ ఉన్నప్పుడే ఈ మాట చెప్పాను
జగన్ మాకు సమస్యే కాదు

కొంత నష్టం ఉన్నా.. భర్తీ చేసుకుంటాం!
నేను ఫ్లెక్సిబుల్.. ఎవరికీ పోటీ కాదు
సీఎం, నేను కలిసి పని చేస్తాం
ఆయన పరిణితి చెందుతున్నారు
వెన్ను దన్నుగా ఉంటాను
వైఎస్ ఉండగానే పీఆర్పీ విలీన నిర్ణయం
'స్థానిక' విజయమే తక్షణ కర్తవ్యం
'ఏబీఎన్' బిగ్ డిబేట్‌లో మనసు విప్పిన బొత్స 

  మాటల్లో విరుపు, చేతల్లో చొరవ, 'లక్ష్యం'పై స్పష్టత! ఇవన్నీ కలిస్తే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ! 'నా లక్ష్యం ముఖ్యమంత్రి పీఠం' అని స్పష్టంగా ప్రకటిస్తూనే... ఆశ పడటంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వైఎస్ హయాంలోనే చెప్పానని ప్రకటించారు. మంగళవారం రాత్రి 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన 'బిగ్ డిబేట్'లో బొత్స పాల్గొన్నారు.

అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. జగన్ వల్ల కొంత నష్టముందని అంగీకరిస్తూనే... దీనిని మరో రూపంలో భర్తీ చేసుకుంటామని బొత్స స్పష్టం చేశారు. తాను ఎవరికీ పోటీ కాదని, ఎవరైనా తనను పోటీ అనుకుంటే ఏమీ చేయలేనని తెలిపారు. సీఎం కిరణ్, తాను కలిసి పని చేస్తామని చెప్పారు. అమలాపురం ఎంపీ హర్షకుమార్‌తో తనకు విభేదాలు లేవన్నారు. పార్టీ పునరుత్తేజానికి 'ఫార్మాట్' సిద్ధంగా ఉందన్నారు. 'బిగ్ డిబేట్' విశేషాలివి...

1989లో కంటే దారుణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరమ్మతులు చేయగలమని భావిస్తున్నారా?

కాంగ్రెస్ పార్టీలో కలుపుకుని పోయే వ్యక్తిలేరనే అభిప్రాయం ఉంది. ఈ ప్రభుత్వం మనది అనే నమ్మకం క్యాడర్‌లో లేకుండా పోతోంది. దీనికి చాలా కారణాలున్నాయి. వైఎస్ మరణం తర్వాత... రోశయ్య బాధ్యతలు చేపట్టడం. తర్వాత మళ్లీ సీఎం మారడం. పీసీసీ బాధ్యతల నుంచి తప్పించాలని డీఎస్ అధిష్ఠానాన్ని కోరడం. ఓ వైపు తెలంగాణ, మరో వైపు సమైక్యాంధ్ర నినాదాలు. అయినా, నా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తా!

సాధారణంగా సీఎం అభిప్రాయం తీసుకుని పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారు. కానీ, మీ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగినట్లు ఉంది?

సీఎం నిర్ణయానికి భిన్నంగా జరిగిందనే వాదనతో నేను ఏకీభవించను. కిరణ్ అభిప్రాయం తీసుకునే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

మీ ఇద్దరి మధ్య సయోధ్య ఎలా ఉంది?

కావాలని ఎవరు సంఘర్షణ కోరుకోరు. కేబినెట్‌లో శాఖలకు సంబంధించి నా అభిప్రాయాలను సీఎంకు స్పష్టంగా చెప్పా. పొరపాట్లను సవరిస్తానని హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా.

బొత్సకు స్పీడ్ ఎక్కువ అంటారు?

స్పీడ్ కాదు. అనుకున్నది చేయాలనే తపన ఉంది. రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయాలనుకుంటాను. విశ్వాసం కూడా ఎక్కువే. ఇలాగే గతంలో ఒకసారి వోక్స్‌వ్యాగన్ విషయంలో పొరపాటు చేశాను.

ముఖ్యమంత్రి స్లో అండ్ స్టడీ... మీరు స్పీడ్! ఇద్దరికీ ఎలా కుదురుతుంది?
ఆయన బాధ్యత వేరు. నా బాధ్యత వేరు. ప్రభుత్వంలో తప్పులు జరిగితే నానా రకాలు ఆపాదిస్తారు. దురుద్దేశంతో చేశామని చెబుతారు. ఆచితూచి చేయాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. పీసీసీ చీఫ్‌గా క్యాడర్‌లో ఆత్మ విశ్వాసం నింపాల్సిన బాధ్యత నాది.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా సీఎం చుట్టూనే తిరుగుతుంటుంది. పార్టీ కార్యాలయానికి అంత ప్రాధాన్యం ఉండదు కదా?

నా వరకు పార్టీ, ప్రభుత్వం వేరు కాదు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అన్నీ చేస్తాం. గురువారం గాంధీభవన్‌లో అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశం పెడుతున్నాం. దీనికి హాజరు కావటానికి సీఎం కూడా సమయం కేటాయించారు. డజను మంది మంత్రులు కూడా వస్తారు. జిల్లాలకు సందేశం వెళ్లాలంటే ఇలాంటి సమావేశాలు అవసరం. ఒంటెత్తు పోకడ ఉండదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జగన్, తెలంగాణ సమస్యలెదుర్కుంటోంది. వీటిని పరిష్కరించగలమనే నమ్మకం ఉందా?
జగన్ ఓ సమస్య అనుకోవటం లేదు. మిగిలిన పార్టీల్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. జగన్ బయటకు వెళ్లడంవల్ల ఐదు లేదా పది శాతం నష్టం ఉంటుంది. ఆ నష్టాన్ని ఇంకో రకంగా పూడ్చుకోవటానికి ప్రయత్నిస్తాం. ఎవరైనా ఆ వంద శాతం నుంచే తెచ్చుకోవాలిగా. పార్టీ నుంచి బయటికి వెళ్లిన వారితోమాట్లాడి సమస్యకు కారణాలేంటో తెలుసుకుంటాం. వారిని వెనక్కి తెచ్చుకోవటానికి కృషి చేస్తాం. ఇక... తెలంగాణ సున్నితమైన సమస్య. కొంత మంది తెలంగాణ అంటే... మరికొంత మంది సమైక్యాంధ్ర అంటున్నారు. హై కమాండ్ రాష్ట్రంలోని పరిస్థితిని గుర్తించింది. ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది.

జూలై 1లోగా తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేయాలని డెడ్‌లైన్లు పెట్టారు కదా?

ఈ అంశం నా దృష్టికి రాలేదు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు వాళ్ల సమస్యలు వాళ్లకున్నాయి. ఎవరికీ ఇబ్బందిలేని పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నా.

పీసీసీ అధ్యక్షుడు అంటే తదుపరి సీఎంగా చూస్తారు. కాంగ్రెస్ సంస్కృతి కూడా అదే....

అది అధికారంలో లేనప్పుడు! హైకమాండ్ ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించింది. ఏరికోరి ఈ బాధ్యత ఇచ్చినప్పుడు నా వంతు కృషి చేస్తా. మన పని మనం చేసుకుంటూ పోతే సమస్య ఉండదు. 25 సంవత్సరాలుగా అలవాటైన పనే ఇది. పీసీసీ అధ్యక్షుడు అయినందు వల్ల మరో రెండు గంటలు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. నేను చాలా ఈజీగోయింగ్. పార్టీని దారికి తెచ్చేందుకు అవసరమైన 'ఫార్మాట్' నా దగ్గర ఉంది.

వైఎస్ ఉన్నప్పుడు టిక్కెట్లు.. ఎన్నికల ఖర్చు అంతా ఆయనే చూసుకుంటారనే ధీమా ఉండేది. ఇప్పుడా పరిస్థితి ఉందా?

సీఎం ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన చూసుకుంటారు. ఈ మేరకు నమ్మకం కల్పిస్తాం. సీఎం ఇప్పుడిప్పుడే పరిణితి చెందుతున్నారు. పుట్టగానే ప్రతి ఒక్కరికీ అన్ని వచ్చేయవుకదా. ప్రభుత్వంలో చాలా జాగ్రత్తగా వెళ్లాలి.

గతంలో వైఎస్, డీఎస్‌లను జోడెద్దులు అనేవారు...మరి మీరు ఇప్పుడు అలాగే ఉంటారా?

మా ఇద్దరిని సోనియా గాంధీనే నియమించారు. ప్రజలు సోనియాకు తీర్పు ఇచ్చారు. ఇద్దరి జవాబుదారీతనం పార్టీకే. సమిష్టి బాధ్యతతో పని చేయాల్సి ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా సీఎంకు వెన్నుదన్నుగా ఉంటానని ఆయన చెప్పారు. 2009లో ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్ నాతో చిరంజీవిని పార్టీలోకి తేవాలన్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీలోకి మరో కీలకనేతను తెస్తే ఆయన మనకు పోటీ కాడా అన్న చందంగా మాట్లాడా! మనకు చేతకాకపోతేనే ఇతరులు పెద్దవారు అవుతారని వైఎస్ అన్నారు. ఆ మాటలతో నేను సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఒకరికి ఒకరు పోటీ అనుకుంటే పొరపాటు. నేను ఎవరికీ పోటీ కాదు. అవతల వారెవరైనా నేను పోటీఅనుకుంటే ఏమీ చేయలేను. నేను పూర్తి ఫ్లెక్సిబుల్. టెన్షన్ ఫ్రీ.

రాష్ట్ర్రంలో కుల సమీకరణలు మారుతున్నట్లు ఉన్నాయి. రెడ్లు అంతా జగన్ వైపు వెళుతున్న మాట వాస్తవం కాదా?

ఇది అపోహే. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా కాపులు అంతా అటువైపు వెళతారని అన్నారు. రెడ్లు అయినా.. కాపులు అయినా కొంతమంది వెళితే వెళ్లి ఉండొచ్చు. అందరూ వెళ్లిపోయారనుకోవటం పొరపాటు.

మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా జోడు పదవుల్లో కొనసాగుతారా?

అది పార్టీ ఇష్టం. వ్యక్తిగతం ఏమైనా ఉంటే ఈ రోజు చికెన్ తినాలా...లేక వెజిటేరియనా అనేంత వరకే! అంత మాత్రాన ఓపెన్‌గా ఉండనని అర్థంకాదు. మంత్రి పదవులు మొదలుకుని ఏ విషయంలో అయినా సీఎం అడిగితే కుండబద్దలు కొట్టినట్లు నా అభిప్రాయం చెబుతా.

108, 104కు నిధులు కావాలని అడిగారు. సమీక్ష చేశారు. ఇది మీ పరిధి దాటడం కాదా?

చాలా చోట్ల సమస్యలతో 108 వాహనాలు ఆగిపోతున్నాయి. కొత్తవి కొనకపోతే ఇబ్బందు వస్తాయి. ఈ సమస్యలపై మాట్లాడటానికి వస్తానని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి నేను ఫోన్ చేసి చెబితే... ఆయనే నా చాంబర్‌కు వచ్చారు. నా దృష్టికి ఏదీ వచ్చినా తప్పకుండా అడుగుతా. గతంలోనూ ఇలాగే చేశా! అధికారులతోనూ మాట్లాడేవాడిని!

మీకు సీఎం కావాలనే ఆశ ఉందా?

ఆ కోరిక ఉంది. వైఎస్ ఉన్నప్పుడే ఈ మాట చెప్పాను. ఆశ పడడంలో తప్పేముంది? అలాంటి ఆశయం ఉండబట్టే సక్రమ మార్గంలో వెళతాం. ఆ ఆలోచన ఉండబట్టే అన్నీ తెలుసుకుంటున్నాను.

బొత్స ఉవాచ...

* మమ్మల్ని మేము ఓడించుకోవడమే తప్ప..
ఎవరూ మమ్మల్ని ఓడించలేరు.
* నాముందు సవాళ్లు ఉండటం నిజమే. కానీ...
సవాళ్ళుంటేనే విజయం విలువ తెలుస్తుంది.
* స్థానిక ఎన్నికలను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటే గెలుపు సులువే!
* ప్రభుత్వం పడిపోవాలని ఆశిస్తున్నవారు పేదలకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పాలి.
* (ఉద్యమాల నేపథ్యంలో టెన్త్‌లో ఒక్కమార్కుతో ఫెయిల్ అయిన వారికి గ్రేస్ మార్క్ ఇవ్వాలని కడప నుంచి ఒక వ్యక్తి కోరినప్పుడు...) అవకాశం ఉంటే పరిశీలిస్తాం. మంత్రితో మాట్లాడతాను. పీసీసీ అధ్యక్షుడుగా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట దొర్లితే సరిదిద్దుకునే అవకాశం ఉండదన్నారు.

జగనే వెళ్లిపోయారు!

"జగన్ తనంతట తానే కాంగ్రెస్‌ను వీడి వెళ్లారు. ఆయనను వదులుకోవాలని పార్టీకి ఏ కోశానా లేదు. పది మందితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చెప్పవచ్చు. నేను చెప్పేదే అంతా చేయాలంటే ప్రజాస్వామ్యంలో కష్టం. సీఎం పదవి ఇవ్వలేదని వెళ్లిపోతానంటే ఎలా? వైఎస్ హయాంలో రెండుసార్లు పార్టీ ఓటమి చెందినా, పదవులు దక్కకపోయినా ఆయన పార్టీని వీడలేదు. పార్టీని నమ్ముకుని ఉండబట్టే వైఎస్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి దక్కింది. జగన్ సీఎం కావాలని మేమూ సంతకాలు చేశాం. అధిష్ఠానం నిర్ణయం ప్రకారం ఆయన కూడా రోశయ్యకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు చెప్పలేదు.

మేమంతా వైఎస్ చనిపోయిన బాధలో ఉంటే.. జగన్ పావురాలగుట్ట వద్దే రాజకీయాలు మాట్లాడారు. మొదట్లో ఓదార్పు యాత్రకు పార్టీ అనుమతించింది. కానీ... పార్టీలో ఉంటూ పార్టీ నేతల ఫొటోలు లేకుండా యాత్రలు చేయడం సబబా? ఆయన ఓదార్పులో ఏమేం మాట్లాడారో ఒక్కసారి ఆ వీడియోలు తెచ్చి చూస్తే తెలుస్తుంది. అయినా... ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. వారి సిద్ధాంతాల ప్రకారం వెళితే మంచిది! ఈ విషయాలన్నీ అనవసరం. కావాలంటే... మరో సందర్భంలో చర్చ పెట్టుకుందాం. (జగన్ వర్గం నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ఇన్‌లోకి అడిగిన ప్రశ్నలకు)

త్వరలో చర్యలు!

అనర్హత పిటిషన్లు ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు. ధిక్కరించే వారిపై దశల వారీగా చర్యలుంటాయి. జగన్ వర్గ విమర్శలను తిప్పికొట్టలేకపోవడానికి కారణం వైఎస్‌పై ఉన్న ప్రేమే! ఏదైనా అంటే వైఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదు.

Monday, May 23, 2011

తప్పు మీద తప్పు!




రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ల మీద పరుగెడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. అటు పార్టీ అధిష్ఠానాన్నిగానీ, ఇటు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రిని గానీ లెక్క చేసే స్థితిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు లేరు. ప్రజా బలం లేని వారిని అధికార పీఠంపై కూర్చోబెట్టడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తింది. కడప ఎం.పి. జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి పడింది. దీనితో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఆ పార్టీలో ఎవరికీ లేదు.

అదే సమయంలో కడపలో జగన్ రికార్డు స్థాయి మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్‌కు చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆయనతో రహస్య ప్రేమాయణం నెరపుతున్నారు. ఫలితంగా రాజకీయాలలో కోవర్టులు అన్న పదం తెరపైకి వచ్చింది. తమ పార్టీలో కోవర్టులు చేరారని గతంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వాపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వాపోతున్నారు. తమ నాయకత్వ పటిమపై నమ్మకం లేనివారు, నమ్మకం కలిగించలేని వారు మాత్రమే ఇలా వాపోతూ ఉంటారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంత దుస్థితిలో కూరుకుపోవడానికి ప్రధాన బాధ్యతను పార్టీ అధిష్ఠానమే తీసుకోవాలి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం, ఆయనకు అపరిమిత అధికారాలిచ్చి, ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదగకుండా కట్టడి చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం కాదా? కీలక వ్యక్తులు సంస్థను వదలి వెళితే లోటు ఏర్పడకుండా ఉండటానికి ప్రైవేటు కంపెనీలు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాయి.

కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాష్ట్రంలో అందుకు భిన్నంగా వ్యవహరించింది. వై.ఎస్. హఠాన్మరణం తర్వాత నాయకత్వ లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో చిరంజీవి పార్టీని కాంగ్రెస్ విలీనం చేసుకుంది. అయితే చిరంజీవి నాయకత్వ పటిమపై అప్పటికే ప్రజల్లో సవాలక్ష సందేహాలు ఉన్న విషయాన్ని అధిష్ఠానం విస్మరించింది. విశేష ప్రజాదరణగల సినిమా నటుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవికి నాయకత్వ లక్షణాలు ఉండి ఉంటే 2009 ఎన్నికలలో ఆయన పార్టీయే అధికారంలోకి వచ్చి ఉండేది.

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పార్టీలో నాయకత్వ లోటును పూడ్చటానికి ప్రయత్నించకుండా, దానికి బదులు వై.ఎస్. నామ స్మరణ చేయవలసిందిగా పార్టీ శ్రేణులను ఆదేశించడం పార్టీ అగ్ర నాయకత్వం చేసిన మొదటి తప్పు. పార్టీపై పూర్తి పట్టురాకుండానే తొందరపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయడం రెండవ తప్పు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఈ రెండు విషయాలలో తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పూర్తి అజ్ఞానంలో ఉందని భావించవలసి ఉంటుంది.

వై.ఎస్. మరణం తర్వాత వారసత్వంగా ముఖ్యమంత్రి పదవిని ఆశించి, భంగపడిన జగన్మోహనరెడ్డి, సొంత పార్టీ పెట్టుకోవ డానికి, పార్టీకి రాజీనామా చేయడానికి ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన జూబ్లీ హిల్స్‌లోని లోటస్ పాండ్ వద్ద, పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా, 80 వేల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో భారీ భవంతికి మునిసిపల్ ప్లాన్‌కు అనుమతి పొందారు. అంటే వై.ఎస్. మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవిని తనకు ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకున్న మరుక్షణం నుంచే జగన్ సొంత కుంపటి ఆలోచనలకు శ్రీకారం చుట్టారు.

అదే సమయంలో వై.ఎస్. మరణం ప్రమాదవశాత్తూ సంభవించినది కాదనీ, దాని వెనుక కుట్ర ఉందనీ, ఆ కుట్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పరోక్ష పాత్ర ఉందన్న అనుమానం ప్రజల్లో కలిగేలా తన మీడియాలో కథనాలను ప్రచురించి ప్రసారం చేశారు. అంటే సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటించే నాటికి ప్రజల్లో కాంగ్రెస్ పట్ల, ముఖ్యంగా సోనియాగాంధీ పట్ల వ్యతిరేకత ఏర్పడేలా జగన్ వ్యూహ రచన చేశారని అర్థం చేసుకోవాలి. జగన్ ఆలోచనలను పసిగట్టడంలో విఫలమైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కేంద్ర నాయకత్వం, ఆ తర్వాతైనా విరుగుడు చర్యలు తీసుకోకపోగా, జగన్‌కు లాభించే విధంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డిని కీర్తించే పని మొదలు పెట్టారు.

కడప, పులివెందులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకులకు తాము చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నట్టు, తండ్రి (వై.ఎస్.)ని మంచివాడు, గొప్పవాడు అని ప్రశంసించి, కొడుకు (జగన్) దుర్మార్గుడు అంటే ప్రజలు విశ్వసిస్తారనుకోవడమే కాంగ్రెస్ నాయకత్వం చేసిన పొరపాటు.

తండ్రి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే జగన్ ఇంత అక్రమ సంపాదన చేయగలిగి ఉండేవారా? అంటే జగన్ చర్యలన్నింటినీ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి ప్రోత్సహించినట్టే కదా? వై.ఎస్. హయాంలో అవినీతి విచ్చలవిడిగా ఉండేదనీ, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయనీ ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గర నుంచి, దిగువ స్థాయి కాంగ్రెస్ నాయకుల వరకు అందరూ ప్రైవేటు సంభాషణల్లో చెబుతూ ఉంటారు.

రాజశేఖరరెడ్డి విధానాల కారణంగానే రాష్ట్రానికి ప్రస్తుత దుస్థితి దాపురించిన విషయాన్ని కూడా వారు అంగీకరిస్తారు. అయితే బహిరంగంగా మాత్రం వై.ఎస్. అంతటి గొప్పవాడు లేడనీ, ఆయన పథకాలనే తాము కొనసాగిస్తున్నామనీ, ఆయనకు తామే వారసులమనీ, వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని భజన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రచారం అంతా జగన్‌కే ఉపయోగపడింది. అమాయకులైన ప్రజలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి వై.ఎస్. అనుసరించిన విధానాలు కారణమని గ్రహించలేక పోతున్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ నాయకుల చర్యల వల్ల, వై.ఎస్. ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయానికి వచ్చారు. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారు. తన తండ్రిని మహా నేతగా చిత్రించి, ఆయన ప్రారంభించిన పథకాలను తాను మాత్రమే అమలు చేయగలనన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంలో జగన్ కృతకృత్యులయ్యారు.

రాజశేఖరరెడ్డి ఏ తప్పూ చేయకపోతే జగన్ వద్ద అంత సంపద ఎలా పోగయ్యేది? ప్రజల్లో ఇటువంటి సందేహాన్ని రేకెత్తించవలసింది పోయి, వై.ఎస్.ను కీర్తించడం వల్ల పరిస్థితి రివర్స్ అయింది. ఏ అధికార పదవులూ చేపట్టని జగన్, అక్రమ సంపాదనకు పాల్పడ్డారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? బలమైన వ్యవస్థను ఎదిరించిన వాడిని హీరోగా అభిమానించడం మనుషుల సైకాలజీ. ప్రస్తుతం దేశ రాజకీయాలలో అత్యంత శక్తిమంతురాలైన సోనియాగాంధీని, తొడగొట్టి ఎదిరించినందుకు జగన్‌కు కూడా ప్రజల్లో అటువంటి క్రేజ్ ఏర్పడింది. ప్రజల మనస్తత్వాన్ని ఔపోసన పట్టిన జగన్, కడప ఉప ఎన్నికలను తనకు - సోనియాగాంధీకి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.

ఇటువంటి స్వల్ప విషయాలను కూడా గ్రహించలేని స్థితిలో అటు కాంగ్రెస్ అధిష్ఠానం, ఇటు రాష్ట్ర నాయకత్వం ఉంది. చర్యకు ప్రతి చర్య అనేది న్యూటన్ సిద్ధాంతం. జగన్ అవినీతి గురించి పత్రికలు ఎంత రాసినా, తాము ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలెందుకు పట్టించుకోవడం లేదని సందేహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, అసలు మర్మాన్ని విస్మరిస్తున్నారు. జగన్ అవినీతికి పాల్పడి ఉంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నదన్న సామాన్యుల ప్రశ్నకు సమాధానం లేదు. కారణాలు ఏవైనప్పటికీ, కాంగ్రెస్ నాయకత్వ బలహీనతలను క్యాష్ చేసుకున్న జగన్, ఇప్పుడు ఏకంగా సోనియా, రాహుల్‌గాంధీలకే సవాల్ విసురుతున్నారు.

ఈ సవాల్‌ను తట్టుకోవడంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం విఫలమైతే విజయం జగన్‌నే వరిస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే కాంగ్రెస్ పార్టీ ముందు రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో మొదటిది, ఆరోపణలపై విచారణకు శ్రీకారం చుట్టడం ద్వారా జగన్‌పై చర్యలకు ఉపక్రమించడం. ఇలా చేయాలంటే జగన్ దోషి అని రుజువు చేయడానికి కొన్ని ఆధారాలైనా ఉండాలి. అటువంటి ఆధారాలు ఏమీ లేని పక్షంలో జగన్ అవినీతి గురించి ఇకపై ప్రస్తావించకుండా రాజకీయంగానే ఆయనను ఎదుర్కోవడానికి వ్యూహ రచన చేయడం రెండవ ప్రత్యామ్నాయం.

ఇందుకు భిన్నంగా రాజశేఖరరెడ్డిని కీర్తిస్తూ పోయినంతకాలం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తుందే తప్ప బలం పుంజుకోదు. ఇక పార్టీలో, మంత్రివర్గంలో కోవర్టుల విషయానికి వస్తే, అటువంటి పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తీసుకోవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా తనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిని మరిపించడానికి ప్రయత్నిస్తారు. 1995లో ఎన్.టి.ఆర్.పై తిరుగుబాటు జరిపి, అధికారాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబునాయుడు, ప్రజలు ఎన్.టి.ఆర్‌ను మరచిపోయి తనను మాత్రమే గుర్తుపెట్టుకునేలా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి పథకాల ద్వారా ప్రజలకు చేరువ అయ్యారు. ఆ తర్వాత క్రమంలో చేపట్టిన పలు ఇతర కార్యక్రమాల వల్ల అప్పట్లో ఆయన కీర్తి ఆకాశాన్నంటింది. రాజశేఖరరెడ్డి స్థానంలో నియమితులైన రోశయ్య, ప్రస్తుత సి.ఎం. కిరణ్ ఈ విషయంలో విఫలమయ్యారు. జీవిత చరమాంకానికి చేరుకున్న రోశయ్యకు అయాచితవరంగా ముఖ్యమంత్రి పదవి లభించింది. వయో వృద్ధుడైన రోశయ్య, అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ధైర్యంగా వ్యవహరించి ఉంటే పాలనపై ఆయన ముద్ర కనపడి ఉండేది. అది కాంగ్రెస్ పార్టీకి లాభించేది.

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కూడా, ఇప్పటివరకు ఈ విషయంలో విఫల మయ్యారనే చెప్పవచ్చు. మంత్రిగా కూడా అనుభవం లేని ఆయనకు ముఖ్యమంత్రి పదవి లభించిందంటే జీవిత లక్ష్యం సాకారమైనట్టే! అయితే, స్వతహాగా ఇతరులను ఎవరినీ పెద్దగా నమ్మని కిరణ్, తనకు తానుగా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. 50 ఏళ్ల వయస్సులోనే ఉన్న ఆయన, ఉరుకులు పరుగులతో వ్యవహరించాల్సింది పోయి, పగలంతా ఏమి చేస్తారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అదే సమయంలో తాను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యానన్న విషయాన్నీ విస్మరించి, పాత కక్షలను మనస్సులోనే పెట్టుకుని వ్యవహరించడం వల్ల కిరణ్ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు.

2009 ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో తన ఓటమికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న విషయాన్ని ఆయన ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారు. కిరణ్ స్థానంలో మరెవరు ఉన్నా, పాత విషయాన్ని మరచిపోయి, రామచంద్రారెడ్డిని చేరదీసి ఉండేవారు. తాను నిజాయితీ పరుడిననేది కిరణ్ నమ్మకం. అది నిజం కూడా కావచ్చు. అంతమాత్రాన ఇతరులను అనుమానించాల్సిన అవసరం లేదు. నిజానికి రాజశేఖరరెడ్డి అమలు చేసిన మోడల్ తర్వాత ఈ రాష్ట్రంలో ఇకపై ఎవరూ నిజాయితీగా వ్యవహరించలేని స్థితి. మడి గట్టుకుని కూర్చుంటే శాసనసభ్యులు దూరం అయ్యే పరిస్థితి.

అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విలువలను పూర్తిగా వదులుకోక పోయినా, పట్టు విడుపులతో వ్యవహరించక తప్పదు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన గులాం నబీ ఆజాద్‌ను కలిసిన కొంతమంది ఎం.పి.లు (వీరిలో పలువురు కాంట్రాక్టర్లే) ముఖ్యమంత్రి కిరణ్‌కు అనుకూలంగా మాట్లాడారు. కిరణ్ వచ్చిన తర్వాత ఒక్క పైసా కమీషన్ తీసుకోకుండా నాలుగు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారని ఆజాద్‌కు వివరించారు. కమీషన్ ఏమిటి? ఎంతిస్తారు? అని ఆజాద్ ప్రశ్నించగా, గతంలో అయిదు నుంచి ఏడు శాతం కమీషన్ ఇవ్వవలసి వచ్చేదని సదరు ఎం.పి.లు వివరించారు.

'అయిదు శాతం లెక్కేసుకున్నా నాలుగు వేల కోట్లకు 200 కోట్ల రూపాయలు కమీషన్‌గా వసూలు చేసే వారా? ఈ రాష్ట్రంలో ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించారా?' అని ఆశ్చర్యపోవడం ఆజాద్ వంతైంది. ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి లక్షణాలు, మరికొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. ఏవి ఎక్కువ అనే దాన్నిబట్టి అంచనా వేస్తూ ఉంటాం. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి నిజాయితీపరుడే అయి ఉండవచ్చుగానీ, సహచర మంత్రులను విశ్వాసంలోకి తీసుకోక పోవడం, పార్టీ - ప్రభుత్వ బాధ్యతలను నమ్మకం ఉన్న వారికి అప్పగించకపోవడం వంటి అవలక్షణాలు ఆయనలో ఎక్కువగా ఉన్నాయి. అన్నీ ఒక్కరే చేయడం ఎక్కడా సాధ్యం కాదు. కాంగ్రెస్‌ను కబళించడానికి జగన్ ఒకవైపు పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, పార్టీని కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రి తన వ్యవహారశైలిని మార్చుకోవాలి.

పార్టీలో అత్యధికులకు సంతృప్తి కలిగేలా వ్యవహరించాలి. అందుకు కిరణ్ సిద్ధపడకపోతే కాంగ్రెస్ అధిష్ఠ్టానమైనా చొరవ తీసుకుని ఆయనను మార్చడానికి కృషి చేయాలి. నాయకత్వ స్థానంలో ఉన్నవారు ఎవరైనా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. తన సహచరులలో అత్యధికులు అసంతృప్తికి గురవుతున్నారంటే లోపం తనలోనే ఉందని గ్రహించాలి. రాజకీయాలలో ఉన్న వారైతే, తమ నాయకత్వాన్ని పార్టీలోని సహచరులు శ్లాఘించేలా వ్యవహరించాలి. రాజశేఖరరెడ్డి అదే పనిచేశారు 1995-1999 మధ్యకాలంలో చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించారు. అందుకే వారిద్దరూ సక్సెస్ అయ్యారు. స్వంత శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉన్న వారెవ్వరూ ఇతరులను చూసి భయపడరు. అనుమానించరు. 

- ఆదిత్య


Tuesday, February 1, 2011

కాకా కేక అధినేత్రిపై తిగురుబాటు * ఇది ఉక్రోషమా? తెలంగాణ కాంగ్రెస్‌స్థాపించడమా?

 
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జీ వెంకటస్వామి డిమాండ్ చేశారు. పార్టీకి ఆమె నాయకత్వం ఇంకా కొనసాగితే.. దేశంలో కాంగ్రెస్ ఇక మిగలదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేసి, భారతీయులకు ఆ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం పార్టీకి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా నిరసించారు. డ్యాన్సులు వేసుకునే వ్యక్తి ఇంటికి రక్షణ మంత్రి వెళ్లడమేంటని కాకా నిలదీశారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్.. భిక్షం ఎత్తుకునే స్థితికి దిగజారిందని వాపోయారు. ఏఐసీసీ అవినీతిలో కూరుకుపోయిందని కాకా ఆరోపించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ సంచలన విమర్శలు చేశారు. ఇవి కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనాలు పుట్టించాయి. అదే సమయంలో కాకా చేసిన విమర్శల తీవ్రతకు అనుగుణంగానే అందుకు ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో వచ్చింది.


రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీఎస్ మొదలుకుని.. ఆయన జిల్లాకే, ఆయన సామాజిక వర్గానికే చెందిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వరకూ.. ఢిల్లీ పెద్దలు మొదలుకుని గల్లీ నేతల దాకా.. అందరూ కాకాపై మండిపడ్డారు. రెండు సార్లు ప్రధాని పదవిని త్యజించిన దేవతలాంటి సోనియాపై అంతలేసి మాటలనడానికి నోరెలా వచ్చిందంటూ గయ్‌మన్నారు. కుమారుడు, ఎంపీ అయిన వివేక్ సైతం.. ఆయన మాటలు వేరు.. తన పోరాటం వేరు అని తేల్చేశారు. సోనియా నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ఉన్నట్టుండి.. సోనియాపై వెంకటస్వామి ఒంటికాలిపై లేవడానికి కారణమేంటి? ఎవరూ ఊహించని విధంగా విమర్శల వాన కురిపించడానికి సందర్భమేంటి? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చ! కాంగ్రెస్‌లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

ప్రధానంగా పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవిని కాంగ్రెస్‌కు దగ్గర చేసుకునే క్రమంలో సోనియా దూతగా ఆంటోనీ రావడం వెంకటస్వామికి కోపం తెప్పించింది. అయితే.. ఆ ఒక్క కారణంపైనే ఇంత పెద్ద ఎత్తున సోనియాగాంధీపై కాకా విరుచుకుపడతారా? తాను గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల హయాం నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటున్నానని చెబుతూనే.. తనకు సోనియా ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని విలేకరుల సమావేశంలో పదే పదే ప్రస్తావించారు. అయితే.. అపాయింట్‌మెంట్ ఇవ్వనంత మాత్రన.. సోనియాను పరోక్షంగా విదేశీ వనితని గుర్తు చేస్తూ.. ఈ దేశంలో పుట్టినోళ్లకే ఏఐసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేసే స్థాయిలో మాట్లాడతారా? ఇవి కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం కలుగుతున్న సందేహాలు. ఆయన ఈ స్థాయిలో పార్టీ అధ్యక్షురాలిపై ధ్వజమెత్తడానికి బలమైన కారణాలేవో ఉండి ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు.


తెలంగాణ అంశం అనేది అందులో ఒకటి. తెలంగాణ సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపించాలనేది ఆయన ఆలోచన. అదే విషయాన్ని ఆయన మంగళవారం ఓ ప్రైవేటు చానల్‌లో కూడా చెప్పారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నంత కాలం తెలంగాణ రాదని కూడా ఆయన తేల్చేశారు. అందుకే తాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. అయితే.. అంతకు కొద్దిసేపటి ముందు విలేకరులతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌పార్టీని వీడబోనని.. తనంత సీనియర్ పార్టీలో ఎవరూ లేరని కాకా పేర్కొనడం విశేషం.


తెలంగాణ సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తానని వెంకటస్వామి అంటే పార్టీలో ఎవరూ స్వాగతించలేదు సరికదా.. సోనియాపై విమర్శలు చేసినందుకు ముక్తకంఠంతో విరుచుకుపడ్డారు. చివరికి ఆయన చిన్న కుమారుడు వివేక్ కూడా ఆయన వ్యాఖ్యలను సమర్ధించలేదు. ఏది ఏమైనా కాకా చేసిన విమర్శల నేపథ్యంపై లోతైన విశ్లేషణ జరగాల్సి ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అదే సమయంలో కాకా మాటలు పొంతన లేకుండా ఉన్నాయని పలువురు పార్టీ నేతలు తేల్చేస్తున్నారు. గతంలో మాటపై నిలబడని ఆయన తత్వాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.


2009 ఎన్నికల సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో అప్పటి సీఎం వైఎస్ హైదరాబాద్‌లో తిరగాలంటే వీసాలు కావాలా అని ప్రశ్నించడంపై కాకా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆ ఆంశమే మరిచిపోయారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని 8 ఎకరాల స్థలం విషయంలో వైఎస్ 50% వాటా అడిగారంటూ ఆరోపణలు చేశారు. తర్వాత దానిపై మళ్లీ నోరెత్తలేదు.


2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంతో వైఎస్ చనిపోయాక ఆయన కుమారుడు జగన్‌కు సీఎం బాధ్యతలు అప్పగించాలంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రాజీవ్‌గాంధీతో జగన్‌ను పోల్చారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. వెంటనే వెనక్కు తీసుకున్నారు. తెలంగాణకు వైఎస్ అడ్డంకిగా ఉన్నారంటూ గతంలో ఆరోపించారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వెంటనే తనకు సోనియాపై నిండా విశ్వాసం ఉందంటూ సంతోషించారు. ఇప్పుడు ఆమెపైనే నిప్పులు చెరిగారు.
Click Here!
సోనియా వెళ్లిపో...
Sonia-kakకాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ ముసలం మొదలయింది. కేంద్ర రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ సోమవారం నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి విలీనంపై జరిపిన చర్చలు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకే సెగ తగిలే వరకూ వెళ్లాయి. కాంగ్రెస్‌లో విలీనాన్ని రాష్ట్ర పార్టీలోని ఏ వర్గాలూ జీర్ణించుకోవడం లేదన్న వాస్తవం వెల్లడయింది. మూడుసార్లు సీడబ్ల్యుసీ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన తాను అపా యింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వని సోనియాగాంధీ.. కాంగ్రెస్‌ పార్టీని ఓడించేం దుకు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఇంటికి ఆంటోనీని పంపించడంపై వెంకటస్వామి ఆగ్రహంతో రగిలిపోయారు.


ఇది అవమానంగా భావించిన ఆయన తన ఆగ్రహాన్ని పార్టీ అధినేత్రి సోనియాగాంధీపైనే ఎక్కుపెట్టారు. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించకపోతే కాంగ్రెస్‌ బతకదన్న సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌లో కలకలం సృష్టించారు. ఇటు తెలంగాణ నేతలు, అటు సీమాంధ్ర నేతలు కూడా పీఆర్పీ విలీనం, పొత్తుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం పంపిన ఢిల్లీ రాయబారం క్షేత్రస్థాయిలో బెడిసికొడు తోంది. సీనియర్‌ నేత, సీడబ్ల్యుసీ మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ఈ రాయబారాన్ని తీవ్రంగా ఖండించారు. 125 సంవత్స రాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చిరంజీవి ఇంటికి భిక్షకోసం వెళ్లడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ఆయన తన కోపాన్ని చిరంజీవిని అడ్డుపెట్టుకుని పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై చూపించారు. ఆమె అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం దేశంలో కాంగ్రెస్‌ బతకదని, మన దేశంలో పుట్టిన వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలని డి మాండ్‌ చేసే వరకూ వెళ్లడం పార్టీలో కలకలం సృష్టించింది. చిరంజీవి వంటి ఒక సాధారణ స్థాయి నేత నివాసానికి ఆంటోనీ వెళ్లటాన్ని సిగ్గులేని తనంగా అభివర్ణించిన ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ దుస్థితిని స్పష్టం చేస్తున్నాయి.


Sonia-kakaచిరంజీవి వంటి ప్రాధాన్యం లేని నేత వద్దకు ఏకె ఆంటోనీవంటి అగ్రనేతను స్వయంగా సోనియాగాంధీ రాయబారిగా పంపించటాన్ని కాంగ్రెస్‌లోని ఏ స్థాయి నాయకుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిరంజీవి గురించి నాయకత్వం ఎక్కువగా ఊహించకుంటోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆంటోనీ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉండి చిరంజీవిని పిలిపించుకుంటే ఆయన రాడా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకటస్వామి సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేవలం 18 సీట్లు ఉన్న పీఆర్పీని భిక్షంఅడుక్కోవడంగానే భావిస్తున్నారు. పీఆర్పీతో చర్చలపై తెలంగాణ-సీమాంధ్ర నేతల్లోనూ అసంతృప్తి రగులుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి పొత్తులు అవసరం లేదని, పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయితే ఫర్వాలేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన మరో సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఆర్‌. దామోదర్‌రెడ్డి పీఆర్పీతో విలీనమయినా, పొత్తయినా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ బతకదన్నారు.


సోనియా దిగిపో
పార్టీ పగ్గాలు మరొకరికి అప్పగించాలి: కాకా
నిజంగా బుద్ధి ఉంటే ఆంటోనీని చిరంజీవి ఇంటికి పంపకపోతుండె.
చిరంజీవి ‘ఛూ...మంతర్’ అంటే కాంగ్రెస్ వెలిగిపోతుందా?
సీట్లు, ఓట్ల కోసం ఆయనవద్దకు పోయి బిచ్చమెత్తుకోవాలా?
కాంగ్రెస్ నేడు నాలుగైదు రాష్ట్రాలకే పడిపోయింది. ఇంకా చెప్తే సిగ్గుపోతది.
వచ్చే ఎన్నికల్లో ఆమె నాయకత్వంలో పార్టీ గెలుస్తుందనే విశ్వాసం లేదు. వెంటనే ఆమెను పార్టీ నాయకత్వం నుంచి తప్పించి వేరొకరికి పగ్గాలు అప్పగించాలి’’
సోనియాగాంధీ చేసిందేమీలేదు. కార్యకర్తల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది
సోనియా గురించి, పార్టీ గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి.. ఒక్కొక్కటీ తరువాత విప్పుతా
నన్ను పార్టీ నుంచి పంపే దమ్ము ఎవరికుంది?

కాంగ్రెస్ నాది.ఆ పార్టీమీద నాకూ హక్కుంది.
చిరంజీవిని బిచ్చమడుగుతారా?
సోనియా ఉన్నంత కాలం కాంగ్రెస్ బతకదు
ఆమె నాయకత్వంపై నాకు విశ్వాసం పోయింది
రాబోయే ఎన్నికల్లో పార్టీ మళ్లీ గెలవడం కల్ల
ఈ దేశంలో పుట్టి పెరిగినోళ్లకే ప్రజల బాధలు తెలుస్తాయి
సోనియా గురించి చెప్పాల్సింది చాలా ఉంది
నిప్పులు చెరిగిన సీనియర్ నేత వెంకటస్వామి
నెహ్రూ, ఇందిరల ఏఐసీసీకి వ్యతిరేకంగా సోనియా ఏఐసీసీ పనిచేస్తోంది
ఆమెను వెంటనే తప్పించి వేరొకరిని అధ్యక్షుడిని చేయాలి



కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీపై ఆ పార్టీ సీనియర్ నేత, కురువృద్ధుడు జి.వెంకటస్వామి (కాకా) నిప్పులు చెరిగారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీని బుద్ధిలేకుండా నడిపిస్తున్నారని మండిపడ్డారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ చిరంజీవి ఇంటికి వెళ్లి బిచ్చమడుగుతోందని విమర్శించారు. అందుకోసం కాంగ్రెస్ కోర్‌కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీని పంపడం సిగ్గుచేటన్నారు. దేశంలోని తనలాంటి సీనియర్ లీడర్లందరికీ ఇది పెద్ద షాక్ అని అన్నారు. గాంధీ, నెహ్రూ, ఇందిరా హయాంలో పనిచేసిన ఏఐసీసీకి వ్యతిరేకంగా సోనియా నాయకత్వంలోని ఏఐసీసీ పనిచేస్తోందన్నారు. ఆమె నాయకత్వంపట్ల తనకు నమ్మకం పోయిందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలుపు కల్ల అని అన్నారు. వెంటనే సోనియాను పార్టీ నుంచి తొలగించి మరో వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఇలా విరుచుకుపడ్డారు.


బిచ్చమెత్తుకోవడమెందుకు?


‘‘చిరంజీవి పార్టీతో పొత్తుకు ఇంత తొందరేముంది? గతంలో మాదిరిగా ఢిల్లీకి పిలిస్తే వచ్చి పోయేవాడు కదా! కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీచేసిన వాడింటికి ఆంటోనీని పంపుతారా? నిజంగా బుద్ధి ఉంటే ఆంటోనీని చిరంజీవి ఇంటికి పంపకపోతుండే. అంతగా అవసరమైతే లేక్‌వ్యూలో కూర్చొని పిలిపించుకుంటే సరిపోవచ్చు కదా! ఈ దేశంలో కాంగ్రెస్ గతేంకాను. చిరంజీవి ‘ఛూ...మంతర్’ అంటే కాంగ్రెస్ వెలిగిపోతుందా? సీట్లు, ఓట్ల కోసం ఆయనవద్దకు పోయి బిచ్చమెత్తుకోవాలా? మహా అంటే ఓడిపోతే ఓడిపోతం... ఇందిరాగాంధీ అంతటామే ఓడిపోయింది. మళ్లా 26 నెలలకే అధికారంలోకి వచ్చింది కదా! అయినా ఎందుకంత భయం? ఇంటికి పోయి బిచ్చమెత్తుకోవాల్సిన గతి ఎందుకు? పార్టీలో ఇద్దరు, ముగ్గురు క్రిస్టియన్లను పెట్టుకుని నడిపించడంవల్లే ఇట్లయితుంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారం కార్యకర్తలను పార్టీకి దూరం చేస్తోందన్నారు. తాము పార్టీలో అట్టడుగు స్థాయిలో పనిచేసి.. దరిద్రంపై కొట్లాడి ఈస్థాయికి వచ్చామన్నారు. సోనియా మాత్రం కిందిస్థాయి నుంచి రాకపోవడంతో ప్రజల సమస్యలు, బాధలు అర్థం కావడం లేదని విమర్శించారు.


చెప్తే సిగ్గుపోతది


‘‘కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుంది. ఒకప్పుడు 29 రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ నేడు నాలుగైదు రాష్ట్రాలకే పడిపోయింది. ఇంకా చెప్తే సిగ్గుపోతది. బీహార్ ఎన్నికల్లో పోయినసారి 9 సీట్లుంటే... ఈసారి 4 సీట్లకే పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రాల్లోనూ పార్టీ కొట్టుకుపోయేటట్లుంది. అందుకే సోనియా తీరుపట్ల నిరసన తెలుపుతున్న. ఆమెపట్ల నాకు నమ్మకం పోయింది. వచ్చే ఎన్నికల్లో ఆమె నాయకత్వంలో పార్టీ గెలుస్తుందనే విశ్వాసం లేదు.’’ అని కాకా అన్నారు.


ఇదేం టెన్ జనపథ్?


ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తే సోనియా తనకు అపాయిం ట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వెంకటస్వామి వాపోయారు. ‘‘కాంగ్రెస్‌లో నాకంటే సీనియర్ ఎవరున్నరు? నేను మూడు సార్లు ఆమె ఇంట ర్వ్యూ అడిగినా దొరకలేదు. ఇదేం టెన్ జనపథ్? ఇట్లా ఉంటే దేశంలో సమస్యలనేం అర్థం చేసుకుంటారు? ఎట్లా పరిష్కరిస్తారు?’’అని ప్రశ్నించారు.


ఎక్కడ చూసినా అవినీతే..


‘‘ఎంత అవినీతి? దేశంలో ఎక్కడ చూసినా అవినీతే...దానిపై ర్యాలీ తీస్తారట. ప్రతి నెలా ఇక్కడ నుంచి కేవీపీ దూతగా వెళ్లి హైకమాండ్‌కు మర్యాద చేసి వస్తుండే. ఆమె గురించి, పార్టీ గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటీ తరువాత విప్పుతా’అని అన్నారు. పార్టీలో ఈ పరిస్థితి చూసే ఎంపీగా పోటీచేసేందుకు నిరాకరించానన్నారు. ఎందుకు పోటీచేయవని సోనియా గత ఎన్నికల్లో తనను అడిగితే ‘‘ఏఐసీసీ పరిస్థితిని, మీ యాక్షన్‌ను చూసి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా’’అని చెప్పేశానన్నారు.


సోనియా చేసిందేం లేదు..


సోనియాగాంధీ ఇంకా అధ్యక్షురాలిగా కొనసాగితే కాంగ్రెస్ బతకదని, ఈ దేశంలో పుట్టిపెరిగిన వాళ్లు అధ్యక్షులైతేనే ప్రజల సమస్యలు తెలుస్తాయని కాకా అన్నారు. రాష్ర్టంలో పార్టీ భ్రష్టు పట్టడానికి కారణమేంటని ప్రశ్నిస్తే ‘‘చెట్టే పాడైతే... పండ్లు యాడికెల్లి వస్తయ్?’’ అని బదులిచ్చారు. ప్రభుత్వ అవినీతిలో సోనియాకు వాటా ఉందా? అని అడిగితే ‘‘అవన్నీఇప్పుడే చెబితే ఏం బాగుంటది.. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కదా!’’ అని పేర్కొన్నారు. సోనియావల్లే రెండు సార్లు పార్టీ అధికారంలోకి వచ్చిందని మీ వాళ్లు చెబుతున్నారు కదా అని అడిగితే ‘‘దానికి ఆమె చేసిందేమీలేదు. కాంగ్రెస్ కార్యకర్తలవల్లే అధికారంలోకి రాగలిగింది’’ అని అన్నారు.


నన్ను పార్టీ నుంచి పంపే దమ్ముందా?


సోనియాపైనే తీవ్ర విమర్శలు చేసినందున మీపైన, మీ కుమారుడిపైన పార్టీ చర్యలు తీసుకునే అవకాశముంది కదా అని ప్రశ్నిస్తే కాకా ఒక్కసారిగా నవ్వేశారు. ‘‘నన్నా (నవ్వుతూ)... నన్ను పార్టీ నుంచి పంపే దమ్ము ఎవరికుంది? పార్టీలో నాకంటే సీనియర్ ఎవరున్నరు? రాష్టప్రతిని కావాల్సినోడిని. ఇప్పుడున్నోళ్లంతా నా తరువాత వచ్చినవాళ్లే. అట్లాంటోళ్లు నన్ను బయటకు పంపుతారా? కాంగ్రెస్ నాది. ఆ పార్టీమీద నాకూ హక్కుంది. ఇందిరాగాంధీని పార్టీ అధినాయకురాలిగా చేసింది నేనే. పార్టీకి ఆఫీస్ లేకుంటే ఢిల్లీలో నా ఇంటినే ఇచ్చిన’’ అని చెప్పారు. ఎంపీ అయిన మీ కుమారుడు వివేక్‌ను హైకమాండ్ వేధించే అవకాశముంది కదా.. అని అడిగితే ‘‘నాకు కొడుకుకంటే దేశం, పార్టీయే ముఖ్యం. వాడు కొన్నాళ్లు బాధలు పడితే పడొచ్చు. అయినా ఎంపీ పదవి ఎవడమ్మ సొమ్మూ కాదు. ప్రజల్లోంచి గెలిచి వచ్చినోడ్ని ఎవరేం చేస్తరు?’’అని ప్రశ్నించారు.


తెలంగాణ వాదులారా... కళ్లు తెరవండి


సమైక్యవాది చిరంజీవితో కాంగ్రెస్ చేతులు కలిపేందుకు సిద్ధమైందని, ఇప్పటికైనా తెలంగాణవాదులు కళ్లు తెరవాలని కాకా అన్నారు. ‘కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పిండు.. సోనియా తెలంగాణ ఇస్తదని! ఇప్పుడేమైంది. అందుకే ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడండి. తెలంగాణ గురించి చెప్పాలంటే అదో పెద్ద సబ్జక్టే అవుతుంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలతో ముడిపడిన విషయం కాబట్టి ఇంతకుమించి ఇంకేమీ మాట్లాడను’ అని పేర్కొన్నారు.


పప్పా.. ఏందిది?: వినోద్


కాకా మీడియాతో మాట్లాడిన కొద్దిసేపటికి ఆయన పెద్ద కొడుకు మాజీ మంత్రి వినోద్ హుటాహుటిన అక్కడికి వచ్చారు. ‘‘ఏందిది పప్పా? ఎందుకిట్ల చేస్తున్నవ్?’’ అని మాట్లాడబోగా వెంటనే కాకా ‘‘పో.. పోవయ్యా... పనిచూస్కో పో’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వినోద్ బయటకొచ్చారు. ఆయనను మీడియా చుట్టుముట్టగా మాట్లాడేందుకు నిరాకరించారు. రెండో కుమారుడు, ఎంపీ వివేక్ ప్రస్తుతం గోవాలో ఉన్నారు. సోనియాపై తండ్రి చేసిన వ్యాఖ్యలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన కాకాతో ఫోన్‌లోనే మాట్లాడినట్లు తెలిసింది.
సోనియాతో... పార్టీ బతకదు
venkataswamiఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.వెంకటస్వామి నిప్పులు చెరి గారు. ఏఐసిసి అధ్యక్ష పదవి నుంచి ఆమె వైదొలగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సోనియాగాంధీవల్ల పార్టీ బతకదని స్పష్టం చేశారు. ఈ గడ్డపై పుట్టినవారే పార్టీ పగ్గాలు చేపట్టాలని అన్నా రు. ప్రజారాజ్యంతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ అవసరం ఏమోచ్చిందని ప్రశ్నిం చారు. చిరంజీవితో మాట్లాడేందుకు అంటోనినీ ఇక్కడికి ఎందు కు పంపించారో సోనియాగాంధీ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 125 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్‌ పార్టీకి సోనియా నాయక త్వంలో ఇంతటి దుస్థితి పట్టిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికైన వారంతా పార్టీ పేరుతోనే గెలిచారని తెలిపారు.


సోనియా గాంధీ పేరుతో కాదని ఆయన స్పష్టంచేశారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్నటి పరిణామం గురించి మాట్లాడేందుకు ఎవరైన ఒక్కరు ఉండాలనే తాను మాట్లాడు తున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సోనియాగాంధీ నేతృత్వం లో అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాలలో నాలుగు, ఐదు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ఉందని చెప్పారు. సోనియా నాయకత్వంలో అక్కడ కూడా పార్టీ తుడిచిపెట్టుకొని పోయి సున్నా మిగులుతుందని పేర్కొన్నారు. బీహార్‌ ఎన్నికల ఫలితాలు చూస్తే సిగ్గేస్తోందని చెప్పారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది సీట్ల నుంచి నాలుగు సీట్లకు పడిపోవడం దారుణం అన్నారు. సోనియా గాంధీ కిందిస్థాయి నుంచి పార్టీ అధ్యక్షస్థాయికి రాలేదన్నారు. తాము పార్టీ కోసం కిందిస్థాయి నుంచి పోరాడి పైకి వచ్చామన్నారు.


సోనియా పార్టీ నుంచి వైదొలిగితేనే అవినీతి అంతమవుతుంద న్నారు. ఆమె కొనసాగితే పార్టీ మనుగడ కష్టమేనని స్పష్టంచేశారు. చిరంజీవితో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సభ్యులు ఎ.కె.ఆంటోని భేటీ కావడం ఓ డ్రామా అన్నారు. ఆయనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏమోచ్చిందని ప్రశ్నించారు. ఈ పరిణామం పట్ల కాంగ్రెస్‌ సీనియర్లు బాధను వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. సిడబ్ల్యుసి సభ్యునిగా మూడుసార్లు అపాయింట్‌మెంట్‌ ఇవ్వమని కోరినా ఆహ్వానించని సోనియా చిరంజీవికి ఆహ్వానించేందుకు ఆంటోనినీ పంపించడం ఏమిటీ అని ప్రశ్నించారు. ఇది చిన్న విషయం కాదన్నారు.


నెహ్రు, ఇందిరా గాంధీ హయాంలో పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ఇప్పుడు జన్‌పథ్‌కు ఫోన్లు చేసినా ఎత్తడంలేదన్నారు. ఆయనొచ్చి పార్టీని చు..మంతర్‌ చేస్తాడా అని ప్రశ్నించారు. పార్టీకోసం పనిచేసేందుకు గ్రామగ్రామాన కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని, వారికోసం ఆంటోనిని సోనియా పంపివుంటే బాగుండేదని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి ఆంటోని పోవడం ఏమిటి అన్నారు. ఇదే తనకు బాధ కలిగించిందని చెప్పారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉండి రమ్మంటే చిరురాడా అని పేర్కొన్నారు. ఏఐసిసి స్థాయిలో పిలిస్తే రాడా అని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీచేసిన చిరంజీవిని ఆహ్వానించడమా అని ధ్వజమెత్తారు. పొత్తుకోసం చిరు వెంటపడటం ఏమిటి అని నిరసనవ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో సార్లు గెలిచింది, ఓడిందని చెప్పారు. స్వయంగా ఇందిరాగాంధీ కూడా ఓడారని తెలిపారు.


కానీ మళ్లీ 26 నెలల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. పిఆర్‌పితో పొత్తు అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడుకూడా పార్టీ ఓడినా వచ్చిన నష్టమేమిటీ అని అన్నారు. పొత్తుకోసం తొందర ఎందుకని ప్రశ్నించారు. చిరంజీవిని ఆహ్వానించడానికి జాతీయ స్థాయి నాయకుడు రావడం కాంగ్రెస్‌ను దిగజార్చడమేనని స్పష్టంచేశారు. పొత్తుకోసమే అయితే ఆంటోని స్థాయి నేత హైదరాబాద్‌కు రావాల్సిన అవసరంలేదన్నారు. చిరంజీవి ముందు బిక్షం ఎత్తుకోవడం సరికాదన్నారు. గాంధీ, నెహ్రు, అంబేద్కర్‌తో కలసి పనిచేసిన తనకు సోనియా ఇంటి తలపులు తెరుచుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ దినందినం చెడిపోతోందని విమర్శించారు. చెట్టుయే చెడిపోతే ఇక ఫలం ఎక్కడిది అని ప్రశ్నించారు.


రాష్ట్రంలో అవినీతి వల్లే పార్టీ నాశనం అయిందన్నారు. అక్కడి నుంచి ఢిల్లీలోని ఏఐసిసి వారికి నెలనెల అనవాయితీగా దక్షణ(ముడుపులు) చేరేవన్నారు. దీనిని వై.ఎస్‌. చేర్చేవారా అని ప్రశ్నించగా అన్ని తననోటితోనే చెప్పిస్తారా అని బదులిచ్చారు. కెవిపి రామచంద్రరావు నెలనెల ఏఐసిసి వారికి దక్షణ చెల్లించి వచ్చేవారని విమర్శించారు. ఈ అవినీతి గురించి చెబితే ఇక్కడి నుంచి ఫారిన్‌ వరకు ఉందన్నారు. అది తరువాత చెబుతానని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని, ఏఐసిసి చర్యలను చూసే గత ఎన్నికల్లో తాను పోటీచేయలేదన్నారు. పార్టీలోని వారికి అన్యాయం జరుగుతునే వస్తోందన్నారు.


పి.వి.నర్సింహారావుకు మాత్రమే ఏఐసిసిలో అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. కానీ ఆయన చనిపోయాక ఏఐసిసి కార్యాలయానికి ఆయన శవాన్ని కూడా తీసుకురానివ్వకుండా తాళాలు వేసిన పరిస్థితి . పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, తనలాంటి సీనియర్‌ నేతలు కొందరు యాక్టివ్‌గా ఉన్నారని తెలిపారు. సీనియర్ల సలహాలను తీసుకొని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని ఓ ప్రశ్నకు కాకా సమాధానంగా చెప్పారు.


తనను పార్టీ నుంచి పంపే దమ్ము ఎవరికి ఉందని ప్రశ్నించారు. తన ముందు పార్టీలోకి వచ్చిన వాళ్లా తనను పంపించేది అని ఆగ్రహంవ్యక్తంచేశారు.మీ కుమారుడిపై చర్యలు తీసుకొంటే అని ప్రశ్నించగా దేశం కోసం ఆలోచిస్తానే గానీ కుమారుడి గురించి కాదని చెప్పారు. కుమారుడికోసం దేశంలో అవినీతి పెరిగిపోతే చూస్తూ ఊరుకుండాలా అని ప్రశ్నించారు. పార్టీలో ఇంత తమాషా జరుగుతుంటే ఎలా ఊరుకుంటానని చెప్పారు. చిరంజీవితో పొత్తు వల్ల తెలంగాణ అంశం పక్కకు పోతుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా ఇప్పటికైన తెలంగాణ వాళ్లు కళ్లు తెరవాలని అన్నారు. సోనియా తెలంగాణ ఇస్తారని కెసిఆర్‌ ఎన్నోసార్లు చెప్పాడని తెలిపారు. సమైక్యాంధ్రకు చిరంజీవి కట్టుబడి ఉన్నారని, ఈ పరిస్థితులలో తెలంగాణ వాళ్లు కళ్లు తెరవాల్సి ఉందన్నారు.


మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అయితే పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెట్టిన తర్వాతే ఏ పార్టీతోనయినా పొత్తు, విలీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. పీఆర్పీతో పొత్తు, విలీనం వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి లాభం లేకపోయినా, పీఆర్పీకి మాత్రం లాభం కలిగిస్తాయని మంత్రి శంకర్‌రావు వ్యాఖ్యానించారు. జగన్‌కు సన్నిహితంగా వ్యవహరించే కాంగ్రెస్‌ అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ‘చిరంజీవితో ఆంటోనీ భేటీకావడం బాధాకరం. కాకా వ్యాఖ్యలతో అధిష్ఠానం ఇప్పటికయినా కళ్లు తెరవాలి. కాకా కేవలం చిరంజీవి వ్యవహారం వల్లే ఆవిధంగా వ్యాఖ్యానించి ఉంటారు. జగన్‌ పార్టీ పెట్టడం ఖాయం. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు కష్టకాలమేన’ని అన్నారు. ఆయన గతంలో కూడా పీఆర్పీతో పొత్తు పెట్టుకుంటే పార్టీనుంచి వైదొలుగుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే.


అటు సీమాంధ్రలో, ప్రధానంగా కోస్తాలో పీఆర్పీ విలీనాన్ని కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆరిపోయిన దీపం లాంటి పీఆర్పీని కౌగిలించుకుంటే కాంగెస్‌ కొంపే కాలిపోతుందని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. జగన్‌ మీద కోపంతో పీఆర్పీని ప్రోత్సహిస్తే సంస్థాగతంగా కాంగ్రెస్‌ను నాయకత్వమే నాశనం చేసినట్టవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. తూర్పు-పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కాంగ్రెస్‌ ఓటమికి కారణమయిన పీఆర్పీని ప్రజలు పూర్తిగా మర్చిపోతున్న సమయంలో, తమ పార్టీ నాయకత్వం సొంతపార్టీని సమాధి చేసే ప్రయత్నాలు ప్రారంభించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.


ఇటీవల పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గంలో జరిగిన 3 ఎంపీటీసీ ఎన్నికల్లో 3 సీట్లూ టీడీపీనే గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, పీఆర్పీ రెండుచోట్ల 500 ఓట్లు కూడా తెచ్చుకోలేకపోవడంతో పాటు, ఒకచోట కనీసం పోటీ పెట్టే పరిస్థితి కూడా లేదంటే క్షేత్రస్థాయిలో పీఆర్పీ పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు.కోస్తాలో కాంగ్రెస్‌ ఇప్పుడే బలపడుతూ, రానున్న కాలంలో టీడీపీతో పోరుకు సిద్ధమవుతోందని, ప్రజలు కూడా పీఆర్పీ పని అయిపోయిందని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా పీఆర్పీ వెంటపడటం వల్ల కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న పీఆర్పీకి తమ నాయకత్వం అమృతం అందించినట్టేనని సీనియర్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.


polticiansఇటు తెలంగాణలో కూడా పీఆర్పీతో పొత్తు/విలీన ప్రతిపాదనపై కాంగ్రెస్‌ నేతల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. సమైక్యాంధ్ర వాదానికి కట్టుబడ్డానని ప్రకటించడమే కాకుండా, శ్రీకృష్ణ కమిటీతోపాటు, చిదంబరం భేటీలో కూడా సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన చిరంజీవితో తమ పార్టీ కలిస్తే.. ఇక తెలంగాణ రాదని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసిందన్న అభిప్రాయానికి వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమైక్యవాది అయిన చిరంజీవితో కలవడం వల్ల కాంగ్రెస్‌ ఇక తెలంగాణ ఇవ్వదని తెలంగాణ ప్రజలు పార్టీపై వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పెడతా : కాకా
పార్టీ నుంచి దిగిపొమ్మని సంచలన వ్యాఖ్యలు చేసిన కాకా మరో ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ చెప్పారు. తెలంగాణ ఇస్తే సోనియా నాయకత్వంలో పనిచేస్తానని, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పెడతానని చెప్పారు. ఓ ప్రైవేట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. తెలంగాణ ఇస్తుందని సోనియాపై నమ్మకం లేదని, సోనియా పోతేనే తెలంగాణ వస్తుందని కాకా అన్నారు. చిరంజీవి జై తెలంగాణ అంటే తన వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకుంటానని కాకా అన్నారు. సమైక్యవాది అయిన చిరు కాంగ్రెత్‌ కలిస్తే తెలంగాణ రావడం అసంభవమని కాకా మరోసారి చెప్పారు.