Monday, December 27, 2010

కాంగ్రెస్‌లో అవినీతి ప్రకంపనలు... కుమ్ములాటలు

Pm--Sonia 
ఈ ఏడాది జరిగిన భారీ కుంభకోణాలు ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారుు. లక్షల కోట్ల రూపాయల మేరకు జరిగిన అవినీతి ేకంద్ర ప్రభుత్వం ఉనికిేక ప్రశ్నార్థకంగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో స్కాములు యూపీఏ ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. చాలా కుంభకోణాల్లో సర్కార్‌లోని పెద్దల పాత్ర ఉందని, అవినీతిలో వారికి వాటా ఉందని వెల్లువెత్తిన ఆరోపణలే ఇందుకు కారణం. ఈ ఏడాది దేశంలో దుమారం రేపిన స్కాముల్లో అన్నిటికన్నా పెద్దది 2జి స్పెక్ట్రం ేకటారుుంపుల కుంభకోణం. కామన్వెల్త్‌ క్రీడోత్సవాల నిర్వహణ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, ఎంఆర్‌ ప్రాపర్టీస్‌ కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టులు, ప్రసారభారతి మాజీ ఛైర్మన్‌ లల్లీ వివాదం, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సొంత పార్టీలోనే ప్రతికూల వాతావరణం ఢిల్లీ ప్రభుత్వం అస్తిత్వానిేక సవాల్‌గా మారారుు. తమదాకా వచ్చేసరికి ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ మరొకరిపైకి నెట్టేస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వీటికి కారకులంటూ తప్పంతా ఆయన మీదికి నెట్టేస్తున్నారు. పైగా జేపీసీని వేయడానికి ప్రభుత్వం వెనకాడుతుండడంతో... ఏదో జరిగిందని, అందుక జేపీసీ వేయడం లేదని ప్రజల్లో కూడా అనుమానాలు అంకురిస్తున్నారు
.
జేపీసీని అడ్డుకుంటున్నది ఎవరు ?
som2జి పై జేపీసీ దర్యాప్తు జరగాలని ప్రతిపక్షం ఎంత బలంగా కోరుతోందో, ప్రభుత్వం అంతకంటే బలంగా వ్యతిరేకిస్తోంది. సర్కార్‌లో పెద్దలు ఏ తప్పూ చేయనప్పుడు జేపీసీ వేయడానికి అభ్యంతరమేమిటని ప్రతిపక్షం నిలదీస్తోంది.ఇందుకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. అసలు జేపీసీని అడ్డుకుంటున్నది ఎవరు? ఎందుకు అని ఆలోచిస్తే, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీనే కారణమని అంటున్నారు.

pranab-mukherjeeజేపీసీపై ప్రభుత్వంలో ఇతరులెవరూ ప్రకటనలు చేయడం లేదు. ప్రతిసారీ జేపీసీని వేసేది లేదంటూ ప్రణబ్‌ముఖర్జీనే చెబుతూ వస్తున్నారు. ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కానీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కానీ జేపీసీ పై ఎందుకు మాట్లాడడం లేదు? ప్రణబ్‌ పట్టుదల వల్ల యూపీఏ ప్రతిష్ట దెబ్బతింటోందని కూడా కొందరు అంటున్నారు. ప్రణబ్‌కు కావలసింది అదేనా? అన్న సందేహమూ కలుగుతోంది. మన్మోహన్‌ కానీ, సోనియా కానీ ఆయనకు ఎదురు చెప్పలేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది.

లల్లీ వివాదం
Lalli_ప్రసారభారతి మాజీ ఛైర్మన్‌ లల్లీ కూడా కామన్వెల్త్‌ క్రీడల కుంభకో ణంలో చిక్కుకున్నారు. అది క్రీడోత్స వాల్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయడానికి హక్కులకు సంబంధించిన అంశం. క్రీడోత్సవాల ప్రసారానికి హక్కులు కొను క్కోవాలి. బ్రిటన్‌కు చెందిన ఒక కంపెనీకి ప్రసార హక్కుల కాంట్రాక్ట్‌ ఇచ్చారు.

ambikaఆ కంపెనీలో ప్రసారభారతి మాజీ ఛైర్మన్‌ లిల్లీ కుమార్తె పనిచేస్తున్నారని, ఆమె చెప్పినందువల్లే ఆ కంపెనీ ప్రసార హక్కుల్ని పొందిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్ని లల్లీ ఖండించారు. హక్కుల కాంట్రాక్ట్‌ విషయంలో తను ఫలానా కంపెనీని సిఫార్సు చేసినా చివరికి కాంట్రాక్టు ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకున్నది సమాచార శాఖ మంత్రి అంబికాసోనీనే అని లల్లీ మంత్రిని విమర్శించారు. దీనిపై మంత్రికి, ప్రసారభారతి మాజీ ఛైర్మన్‌ లల్లీ మధ్య వివాదం రేగింది. చివరకు రాష్టప్రతి ఉత్తర్వుతో లల్లీ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది.

‘కామన్వెల్త్‌’ కథ
kalmadiకామన్వెల్త్‌ క్రీడోత్సవాల్లో ప్రాజెక్టుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలు మరో కథ. ఈ కుంభ కోణానికి క్రీడోత్సవాల నిర్వహణ కమిటీ (ఓసీ) ఛైర్మన్‌ సురేష్‌ కల్మాడీ కేంద్ర బిందువుగా నిలిచారు. క్రీడోత్సవాల్లో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో మొదట వేసిన అంచనాలకన్నా, ఆ తర్వాత క్రమంగా కేటాయింపులు పెరుగుతూ వచ్చాయి.

Jaipal-Reddy అందుకు నిర్వహణా కమిటీలో ఉన్న వారే కారణమని ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టుల వ్యయం పెరగడానికి తను కారణం కాదని సురేష్‌ కల్మాడీ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఆర్‌ ప్రాపర్టీస్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు కాంట్రాక్టు ఇవ్వడం వివాదాస్పదమైంది. కేటాయింపుల్లో తన పాత్ర చాలా తక్కువ శాతమేనని, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కేటాయింపుల్లో ప్రధాన పాత్ర వహించారనీ ఆయన ఆరోపించారు.

ఎన్నికల్లో అపజయం
mukul-wasnikaskmeanyఆమధ్య జరిగిన బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయం పాలైంది. బీహార్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి నిలిపింది. సవాల్‌గా భావించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ బీహార్‌లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. రాహుల్‌ గాంధీ అయితే, మిగతా ఇద్దరు నాయకులకన్నా ఎక్కువ సార్లే ప్రచారంకోసం బీహార్‌ వెళ్లారు. అయినా లాభం లేకపోయింది.

rahul-gandhiపరాజయానికి కారణం బీహార్‌ ఎన్నికల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి ముకుల్‌ వాస్నిక్‌ అని అంటారు. వాస్నిక్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లను అమ్ముకున్నారని, గెలుపు గుర్రాలకు కాకుండా, డబ్బిచ్చిన వారికి టిక్కెట్లిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీహార్‌ ఎన్నికల్లో పరాజయం కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం చూిపుతుందంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ ఒక రాష్ట్రాన్ని పోగొట్టుకోవడం కేంద్రంలో ఆ పార్టీ బలహీనపడేందుకు దారితీసి, ప్రభుత్వానికి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది.

ఆంధ్రప్రదేశ్‌ సంగతేమిటి ?
Jagan-Mohaకాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా సొంతపార్టీలో పరిణా మాలు అధిష్ఠానానికి చికాకు కలిగిస్తున్నాయి. ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలు సొంతపార్టీవారు చేయడం, అసమ్మతి ఓ విధంగా తిరుగుబాటుకు దారితీయడం అధినాయకత్వానికి మింగుడు పడడం లేదు. వైఎస్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని వదిలి, ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటికి వెళ్లడం, సొంతంగా పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేయడం ఢిల్లీ నాయకత్వానికి కొరుకుడు పడడం లేదు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ఆ రాష్ట్రంలో పార్టీ వ్యవహరాల్లో అనుసరిస్తున్న వైఖరే ఈ విపరిణామాలకు కారణమనే ఆరోపణలు కూడా లేకపోలేదు.

Ahmed-Patelజగన్‌పట్ల అధిష్ఠానం పట్టువిడుపులు లేకుండా మొండిగా వ్యవహరించ డమే ఆయన పార్టీని వదిలి వెళ్లేందుకు దారితీసిందని, ఇందుకు పటేల్‌ అనుసరించిన వైఖరే కారణమని, అందువల్లే ఏపీలో రాజకీయాలు చేయిదాటి పోయాయని విమర్శలు వచ్చాయి. ఇన్ని రాజకీయ పరిణామాలు జరిగినా, అవినీతి వీరవిహారం చేస్తున్నా ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టమైన చర్య తీసుకునే విషయంలో మౌనంగా ఉండడం సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వంలో పెద్దలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే స్థాయి కూడా దాటిపోయి, నేరుగా ప్రధానిపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

2010...దీన్ని కుంభకోణాల సంవత్సరమని పిలుచుకోవచ్చు. ఏదైనా సంవత్సరాన్ని ఒక అంశం పేరుతో వ్యవహరించడం సర్వసాధారణం. అంతర్జాతీయ శాంతివత్సరమని, మహిళా సంవత్సరమని పిలుచు కుంటుంటాం. ఆయా అంశాల ప్రాముఖ్యతను, విశిష్టను బట్టి అలా పిలుచుకుంటాం. అలా ఈ ఏడాది (2010) అవినీతి, కుంభకోణాలు ఘనత వహించాయి. ఈ ఏడాది వెలుగు చూసిన కుంభకోణాలు ప్రభు త్వంలో ప్రముఖుల అంతర్గత విభేదాల్ని బయటపెట్టాయి.ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణం 2జి స్పెక్టం లైసెన్స్‌ కేటాయింపులు. టెలికాం సంస్థలకు స్పెక్ట్రం లైసెన్సుల కేటాయింపుల తీరు లోపభూ యిష్టంగా ఉందని, అవినీతి పడగలు విప్పి విహరించిందని పెను తుపాను రేగింది. ఈ కుంభకోణంలో లక్షా 76 కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటుచేసుకుందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక (కాగ్‌) వెల్లడించింది.

ఎ. రాజా ఏమన్నారు ?
a-raja టెలికాం మంత్రిగా రాజా రాజీ నామా చేయాల్సి వచ్చింది. జరిగిన కుంభకోణంలో తన పాత్ర లేదని, అంతా ప్రధానమంత్రి మన్మోహ న్‌సింగ్‌కు తెలిసే జరిగిందని రాజా పదేపదే చెప్పారు. 2జి స్పెక్ట్రం కేటాయింపుల సందర్భంగా తను ప్రధానికి లేఖలు కూడా రాశానని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాధానాలు కూడా వచ్చాయని రాజా చెప్పారు. పైగా, ఆయన మరో వాదం కూడా లేవనెత్తారు.

Manmohan-Singhటెలికాం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయింపుల్లో తను కొత్త విధానాన్ని ఏదీ అనుసరించలేదని, గతంలో ఈ శాఖ మంత్రులుగా పనిచేసిన మురసోలీ మారన్‌, ప్రమోద్‌ మహాజన్‌ల బాటలోనే తను కూడా నడిచానని రాజా సమర్థించుకున్నారు. అయితే ఇది అంతటితో ఆగలేదు. రాజా కేంద్రప్రభుత్వాన్నే సవాలు చేస్తున్నారు. స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వ్యవహారం ఈనాటిది కాదని ఏన్డీఏ హయం నుంచి విచారణ జరపాలని పట్టుపడుతున్నారు. దశాబ్ధ కాలంగా పనిచేసిన టెలికాం మంత్రులందరిని బరిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు.

No comments:

Post a Comment