Tuesday, February 1, 2011

కాకా కేక అధినేత్రిపై తిగురుబాటు * ఇది ఉక్రోషమా? తెలంగాణ కాంగ్రెస్‌స్థాపించడమా?

 
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జీ వెంకటస్వామి డిమాండ్ చేశారు. పార్టీకి ఆమె నాయకత్వం ఇంకా కొనసాగితే.. దేశంలో కాంగ్రెస్ ఇక మిగలదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేసి, భారతీయులకు ఆ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం పార్టీకి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా నిరసించారు. డ్యాన్సులు వేసుకునే వ్యక్తి ఇంటికి రక్షణ మంత్రి వెళ్లడమేంటని కాకా నిలదీశారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్.. భిక్షం ఎత్తుకునే స్థితికి దిగజారిందని వాపోయారు. ఏఐసీసీ అవినీతిలో కూరుకుపోయిందని కాకా ఆరోపించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ సంచలన విమర్శలు చేశారు. ఇవి కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనాలు పుట్టించాయి. అదే సమయంలో కాకా చేసిన విమర్శల తీవ్రతకు అనుగుణంగానే అందుకు ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో వచ్చింది.


రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీఎస్ మొదలుకుని.. ఆయన జిల్లాకే, ఆయన సామాజిక వర్గానికే చెందిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వరకూ.. ఢిల్లీ పెద్దలు మొదలుకుని గల్లీ నేతల దాకా.. అందరూ కాకాపై మండిపడ్డారు. రెండు సార్లు ప్రధాని పదవిని త్యజించిన దేవతలాంటి సోనియాపై అంతలేసి మాటలనడానికి నోరెలా వచ్చిందంటూ గయ్‌మన్నారు. కుమారుడు, ఎంపీ అయిన వివేక్ సైతం.. ఆయన మాటలు వేరు.. తన పోరాటం వేరు అని తేల్చేశారు. సోనియా నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ఉన్నట్టుండి.. సోనియాపై వెంకటస్వామి ఒంటికాలిపై లేవడానికి కారణమేంటి? ఎవరూ ఊహించని విధంగా విమర్శల వాన కురిపించడానికి సందర్భమేంటి? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చ! కాంగ్రెస్‌లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

ప్రధానంగా పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవిని కాంగ్రెస్‌కు దగ్గర చేసుకునే క్రమంలో సోనియా దూతగా ఆంటోనీ రావడం వెంకటస్వామికి కోపం తెప్పించింది. అయితే.. ఆ ఒక్క కారణంపైనే ఇంత పెద్ద ఎత్తున సోనియాగాంధీపై కాకా విరుచుకుపడతారా? తాను గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల హయాం నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటున్నానని చెబుతూనే.. తనకు సోనియా ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని విలేకరుల సమావేశంలో పదే పదే ప్రస్తావించారు. అయితే.. అపాయింట్‌మెంట్ ఇవ్వనంత మాత్రన.. సోనియాను పరోక్షంగా విదేశీ వనితని గుర్తు చేస్తూ.. ఈ దేశంలో పుట్టినోళ్లకే ఏఐసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేసే స్థాయిలో మాట్లాడతారా? ఇవి కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం కలుగుతున్న సందేహాలు. ఆయన ఈ స్థాయిలో పార్టీ అధ్యక్షురాలిపై ధ్వజమెత్తడానికి బలమైన కారణాలేవో ఉండి ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు.


తెలంగాణ అంశం అనేది అందులో ఒకటి. తెలంగాణ సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపించాలనేది ఆయన ఆలోచన. అదే విషయాన్ని ఆయన మంగళవారం ఓ ప్రైవేటు చానల్‌లో కూడా చెప్పారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నంత కాలం తెలంగాణ రాదని కూడా ఆయన తేల్చేశారు. అందుకే తాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. అయితే.. అంతకు కొద్దిసేపటి ముందు విలేకరులతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌పార్టీని వీడబోనని.. తనంత సీనియర్ పార్టీలో ఎవరూ లేరని కాకా పేర్కొనడం విశేషం.


తెలంగాణ సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తానని వెంకటస్వామి అంటే పార్టీలో ఎవరూ స్వాగతించలేదు సరికదా.. సోనియాపై విమర్శలు చేసినందుకు ముక్తకంఠంతో విరుచుకుపడ్డారు. చివరికి ఆయన చిన్న కుమారుడు వివేక్ కూడా ఆయన వ్యాఖ్యలను సమర్ధించలేదు. ఏది ఏమైనా కాకా చేసిన విమర్శల నేపథ్యంపై లోతైన విశ్లేషణ జరగాల్సి ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అదే సమయంలో కాకా మాటలు పొంతన లేకుండా ఉన్నాయని పలువురు పార్టీ నేతలు తేల్చేస్తున్నారు. గతంలో మాటపై నిలబడని ఆయన తత్వాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.


2009 ఎన్నికల సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో అప్పటి సీఎం వైఎస్ హైదరాబాద్‌లో తిరగాలంటే వీసాలు కావాలా అని ప్రశ్నించడంపై కాకా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆ ఆంశమే మరిచిపోయారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని 8 ఎకరాల స్థలం విషయంలో వైఎస్ 50% వాటా అడిగారంటూ ఆరోపణలు చేశారు. తర్వాత దానిపై మళ్లీ నోరెత్తలేదు.


2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంతో వైఎస్ చనిపోయాక ఆయన కుమారుడు జగన్‌కు సీఎం బాధ్యతలు అప్పగించాలంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రాజీవ్‌గాంధీతో జగన్‌ను పోల్చారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. వెంటనే వెనక్కు తీసుకున్నారు. తెలంగాణకు వైఎస్ అడ్డంకిగా ఉన్నారంటూ గతంలో ఆరోపించారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వెంటనే తనకు సోనియాపై నిండా విశ్వాసం ఉందంటూ సంతోషించారు. ఇప్పుడు ఆమెపైనే నిప్పులు చెరిగారు.
Click Here!
సోనియా వెళ్లిపో...
Sonia-kakకాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ ముసలం మొదలయింది. కేంద్ర రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ సోమవారం నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి విలీనంపై జరిపిన చర్చలు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకే సెగ తగిలే వరకూ వెళ్లాయి. కాంగ్రెస్‌లో విలీనాన్ని రాష్ట్ర పార్టీలోని ఏ వర్గాలూ జీర్ణించుకోవడం లేదన్న వాస్తవం వెల్లడయింది. మూడుసార్లు సీడబ్ల్యుసీ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన తాను అపా యింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వని సోనియాగాంధీ.. కాంగ్రెస్‌ పార్టీని ఓడించేం దుకు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఇంటికి ఆంటోనీని పంపించడంపై వెంకటస్వామి ఆగ్రహంతో రగిలిపోయారు.


ఇది అవమానంగా భావించిన ఆయన తన ఆగ్రహాన్ని పార్టీ అధినేత్రి సోనియాగాంధీపైనే ఎక్కుపెట్టారు. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించకపోతే కాంగ్రెస్‌ బతకదన్న సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌లో కలకలం సృష్టించారు. ఇటు తెలంగాణ నేతలు, అటు సీమాంధ్ర నేతలు కూడా పీఆర్పీ విలీనం, పొత్తుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం పంపిన ఢిల్లీ రాయబారం క్షేత్రస్థాయిలో బెడిసికొడు తోంది. సీనియర్‌ నేత, సీడబ్ల్యుసీ మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ఈ రాయబారాన్ని తీవ్రంగా ఖండించారు. 125 సంవత్స రాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చిరంజీవి ఇంటికి భిక్షకోసం వెళ్లడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ఆయన తన కోపాన్ని చిరంజీవిని అడ్డుపెట్టుకుని పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై చూపించారు. ఆమె అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం దేశంలో కాంగ్రెస్‌ బతకదని, మన దేశంలో పుట్టిన వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలని డి మాండ్‌ చేసే వరకూ వెళ్లడం పార్టీలో కలకలం సృష్టించింది. చిరంజీవి వంటి ఒక సాధారణ స్థాయి నేత నివాసానికి ఆంటోనీ వెళ్లటాన్ని సిగ్గులేని తనంగా అభివర్ణించిన ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ దుస్థితిని స్పష్టం చేస్తున్నాయి.


Sonia-kakaచిరంజీవి వంటి ప్రాధాన్యం లేని నేత వద్దకు ఏకె ఆంటోనీవంటి అగ్రనేతను స్వయంగా సోనియాగాంధీ రాయబారిగా పంపించటాన్ని కాంగ్రెస్‌లోని ఏ స్థాయి నాయకుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిరంజీవి గురించి నాయకత్వం ఎక్కువగా ఊహించకుంటోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆంటోనీ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉండి చిరంజీవిని పిలిపించుకుంటే ఆయన రాడా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకటస్వామి సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేవలం 18 సీట్లు ఉన్న పీఆర్పీని భిక్షంఅడుక్కోవడంగానే భావిస్తున్నారు. పీఆర్పీతో చర్చలపై తెలంగాణ-సీమాంధ్ర నేతల్లోనూ అసంతృప్తి రగులుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి పొత్తులు అవసరం లేదని, పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయితే ఫర్వాలేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన మరో సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఆర్‌. దామోదర్‌రెడ్డి పీఆర్పీతో విలీనమయినా, పొత్తయినా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ బతకదన్నారు.


సోనియా దిగిపో
పార్టీ పగ్గాలు మరొకరికి అప్పగించాలి: కాకా
నిజంగా బుద్ధి ఉంటే ఆంటోనీని చిరంజీవి ఇంటికి పంపకపోతుండె.
చిరంజీవి ‘ఛూ...మంతర్’ అంటే కాంగ్రెస్ వెలిగిపోతుందా?
సీట్లు, ఓట్ల కోసం ఆయనవద్దకు పోయి బిచ్చమెత్తుకోవాలా?
కాంగ్రెస్ నేడు నాలుగైదు రాష్ట్రాలకే పడిపోయింది. ఇంకా చెప్తే సిగ్గుపోతది.
వచ్చే ఎన్నికల్లో ఆమె నాయకత్వంలో పార్టీ గెలుస్తుందనే విశ్వాసం లేదు. వెంటనే ఆమెను పార్టీ నాయకత్వం నుంచి తప్పించి వేరొకరికి పగ్గాలు అప్పగించాలి’’
సోనియాగాంధీ చేసిందేమీలేదు. కార్యకర్తల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది
సోనియా గురించి, పార్టీ గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి.. ఒక్కొక్కటీ తరువాత విప్పుతా
నన్ను పార్టీ నుంచి పంపే దమ్ము ఎవరికుంది?

కాంగ్రెస్ నాది.ఆ పార్టీమీద నాకూ హక్కుంది.
చిరంజీవిని బిచ్చమడుగుతారా?
సోనియా ఉన్నంత కాలం కాంగ్రెస్ బతకదు
ఆమె నాయకత్వంపై నాకు విశ్వాసం పోయింది
రాబోయే ఎన్నికల్లో పార్టీ మళ్లీ గెలవడం కల్ల
ఈ దేశంలో పుట్టి పెరిగినోళ్లకే ప్రజల బాధలు తెలుస్తాయి
సోనియా గురించి చెప్పాల్సింది చాలా ఉంది
నిప్పులు చెరిగిన సీనియర్ నేత వెంకటస్వామి
నెహ్రూ, ఇందిరల ఏఐసీసీకి వ్యతిరేకంగా సోనియా ఏఐసీసీ పనిచేస్తోంది
ఆమెను వెంటనే తప్పించి వేరొకరిని అధ్యక్షుడిని చేయాలి



కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీపై ఆ పార్టీ సీనియర్ నేత, కురువృద్ధుడు జి.వెంకటస్వామి (కాకా) నిప్పులు చెరిగారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీని బుద్ధిలేకుండా నడిపిస్తున్నారని మండిపడ్డారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ చిరంజీవి ఇంటికి వెళ్లి బిచ్చమడుగుతోందని విమర్శించారు. అందుకోసం కాంగ్రెస్ కోర్‌కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీని పంపడం సిగ్గుచేటన్నారు. దేశంలోని తనలాంటి సీనియర్ లీడర్లందరికీ ఇది పెద్ద షాక్ అని అన్నారు. గాంధీ, నెహ్రూ, ఇందిరా హయాంలో పనిచేసిన ఏఐసీసీకి వ్యతిరేకంగా సోనియా నాయకత్వంలోని ఏఐసీసీ పనిచేస్తోందన్నారు. ఆమె నాయకత్వంపట్ల తనకు నమ్మకం పోయిందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలుపు కల్ల అని అన్నారు. వెంటనే సోనియాను పార్టీ నుంచి తొలగించి మరో వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఇలా విరుచుకుపడ్డారు.


బిచ్చమెత్తుకోవడమెందుకు?


‘‘చిరంజీవి పార్టీతో పొత్తుకు ఇంత తొందరేముంది? గతంలో మాదిరిగా ఢిల్లీకి పిలిస్తే వచ్చి పోయేవాడు కదా! కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీచేసిన వాడింటికి ఆంటోనీని పంపుతారా? నిజంగా బుద్ధి ఉంటే ఆంటోనీని చిరంజీవి ఇంటికి పంపకపోతుండే. అంతగా అవసరమైతే లేక్‌వ్యూలో కూర్చొని పిలిపించుకుంటే సరిపోవచ్చు కదా! ఈ దేశంలో కాంగ్రెస్ గతేంకాను. చిరంజీవి ‘ఛూ...మంతర్’ అంటే కాంగ్రెస్ వెలిగిపోతుందా? సీట్లు, ఓట్ల కోసం ఆయనవద్దకు పోయి బిచ్చమెత్తుకోవాలా? మహా అంటే ఓడిపోతే ఓడిపోతం... ఇందిరాగాంధీ అంతటామే ఓడిపోయింది. మళ్లా 26 నెలలకే అధికారంలోకి వచ్చింది కదా! అయినా ఎందుకంత భయం? ఇంటికి పోయి బిచ్చమెత్తుకోవాల్సిన గతి ఎందుకు? పార్టీలో ఇద్దరు, ముగ్గురు క్రిస్టియన్లను పెట్టుకుని నడిపించడంవల్లే ఇట్లయితుంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారం కార్యకర్తలను పార్టీకి దూరం చేస్తోందన్నారు. తాము పార్టీలో అట్టడుగు స్థాయిలో పనిచేసి.. దరిద్రంపై కొట్లాడి ఈస్థాయికి వచ్చామన్నారు. సోనియా మాత్రం కిందిస్థాయి నుంచి రాకపోవడంతో ప్రజల సమస్యలు, బాధలు అర్థం కావడం లేదని విమర్శించారు.


చెప్తే సిగ్గుపోతది


‘‘కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుంది. ఒకప్పుడు 29 రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ నేడు నాలుగైదు రాష్ట్రాలకే పడిపోయింది. ఇంకా చెప్తే సిగ్గుపోతది. బీహార్ ఎన్నికల్లో పోయినసారి 9 సీట్లుంటే... ఈసారి 4 సీట్లకే పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రాల్లోనూ పార్టీ కొట్టుకుపోయేటట్లుంది. అందుకే సోనియా తీరుపట్ల నిరసన తెలుపుతున్న. ఆమెపట్ల నాకు నమ్మకం పోయింది. వచ్చే ఎన్నికల్లో ఆమె నాయకత్వంలో పార్టీ గెలుస్తుందనే విశ్వాసం లేదు.’’ అని కాకా అన్నారు.


ఇదేం టెన్ జనపథ్?


ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తే సోనియా తనకు అపాయిం ట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వెంకటస్వామి వాపోయారు. ‘‘కాంగ్రెస్‌లో నాకంటే సీనియర్ ఎవరున్నరు? నేను మూడు సార్లు ఆమె ఇంట ర్వ్యూ అడిగినా దొరకలేదు. ఇదేం టెన్ జనపథ్? ఇట్లా ఉంటే దేశంలో సమస్యలనేం అర్థం చేసుకుంటారు? ఎట్లా పరిష్కరిస్తారు?’’అని ప్రశ్నించారు.


ఎక్కడ చూసినా అవినీతే..


‘‘ఎంత అవినీతి? దేశంలో ఎక్కడ చూసినా అవినీతే...దానిపై ర్యాలీ తీస్తారట. ప్రతి నెలా ఇక్కడ నుంచి కేవీపీ దూతగా వెళ్లి హైకమాండ్‌కు మర్యాద చేసి వస్తుండే. ఆమె గురించి, పార్టీ గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటీ తరువాత విప్పుతా’అని అన్నారు. పార్టీలో ఈ పరిస్థితి చూసే ఎంపీగా పోటీచేసేందుకు నిరాకరించానన్నారు. ఎందుకు పోటీచేయవని సోనియా గత ఎన్నికల్లో తనను అడిగితే ‘‘ఏఐసీసీ పరిస్థితిని, మీ యాక్షన్‌ను చూసి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా’’అని చెప్పేశానన్నారు.


సోనియా చేసిందేం లేదు..


సోనియాగాంధీ ఇంకా అధ్యక్షురాలిగా కొనసాగితే కాంగ్రెస్ బతకదని, ఈ దేశంలో పుట్టిపెరిగిన వాళ్లు అధ్యక్షులైతేనే ప్రజల సమస్యలు తెలుస్తాయని కాకా అన్నారు. రాష్ర్టంలో పార్టీ భ్రష్టు పట్టడానికి కారణమేంటని ప్రశ్నిస్తే ‘‘చెట్టే పాడైతే... పండ్లు యాడికెల్లి వస్తయ్?’’ అని బదులిచ్చారు. ప్రభుత్వ అవినీతిలో సోనియాకు వాటా ఉందా? అని అడిగితే ‘‘అవన్నీఇప్పుడే చెబితే ఏం బాగుంటది.. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కదా!’’ అని పేర్కొన్నారు. సోనియావల్లే రెండు సార్లు పార్టీ అధికారంలోకి వచ్చిందని మీ వాళ్లు చెబుతున్నారు కదా అని అడిగితే ‘‘దానికి ఆమె చేసిందేమీలేదు. కాంగ్రెస్ కార్యకర్తలవల్లే అధికారంలోకి రాగలిగింది’’ అని అన్నారు.


నన్ను పార్టీ నుంచి పంపే దమ్ముందా?


సోనియాపైనే తీవ్ర విమర్శలు చేసినందున మీపైన, మీ కుమారుడిపైన పార్టీ చర్యలు తీసుకునే అవకాశముంది కదా అని ప్రశ్నిస్తే కాకా ఒక్కసారిగా నవ్వేశారు. ‘‘నన్నా (నవ్వుతూ)... నన్ను పార్టీ నుంచి పంపే దమ్ము ఎవరికుంది? పార్టీలో నాకంటే సీనియర్ ఎవరున్నరు? రాష్టప్రతిని కావాల్సినోడిని. ఇప్పుడున్నోళ్లంతా నా తరువాత వచ్చినవాళ్లే. అట్లాంటోళ్లు నన్ను బయటకు పంపుతారా? కాంగ్రెస్ నాది. ఆ పార్టీమీద నాకూ హక్కుంది. ఇందిరాగాంధీని పార్టీ అధినాయకురాలిగా చేసింది నేనే. పార్టీకి ఆఫీస్ లేకుంటే ఢిల్లీలో నా ఇంటినే ఇచ్చిన’’ అని చెప్పారు. ఎంపీ అయిన మీ కుమారుడు వివేక్‌ను హైకమాండ్ వేధించే అవకాశముంది కదా.. అని అడిగితే ‘‘నాకు కొడుకుకంటే దేశం, పార్టీయే ముఖ్యం. వాడు కొన్నాళ్లు బాధలు పడితే పడొచ్చు. అయినా ఎంపీ పదవి ఎవడమ్మ సొమ్మూ కాదు. ప్రజల్లోంచి గెలిచి వచ్చినోడ్ని ఎవరేం చేస్తరు?’’అని ప్రశ్నించారు.


తెలంగాణ వాదులారా... కళ్లు తెరవండి


సమైక్యవాది చిరంజీవితో కాంగ్రెస్ చేతులు కలిపేందుకు సిద్ధమైందని, ఇప్పటికైనా తెలంగాణవాదులు కళ్లు తెరవాలని కాకా అన్నారు. ‘కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పిండు.. సోనియా తెలంగాణ ఇస్తదని! ఇప్పుడేమైంది. అందుకే ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడండి. తెలంగాణ గురించి చెప్పాలంటే అదో పెద్ద సబ్జక్టే అవుతుంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలతో ముడిపడిన విషయం కాబట్టి ఇంతకుమించి ఇంకేమీ మాట్లాడను’ అని పేర్కొన్నారు.


పప్పా.. ఏందిది?: వినోద్


కాకా మీడియాతో మాట్లాడిన కొద్దిసేపటికి ఆయన పెద్ద కొడుకు మాజీ మంత్రి వినోద్ హుటాహుటిన అక్కడికి వచ్చారు. ‘‘ఏందిది పప్పా? ఎందుకిట్ల చేస్తున్నవ్?’’ అని మాట్లాడబోగా వెంటనే కాకా ‘‘పో.. పోవయ్యా... పనిచూస్కో పో’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వినోద్ బయటకొచ్చారు. ఆయనను మీడియా చుట్టుముట్టగా మాట్లాడేందుకు నిరాకరించారు. రెండో కుమారుడు, ఎంపీ వివేక్ ప్రస్తుతం గోవాలో ఉన్నారు. సోనియాపై తండ్రి చేసిన వ్యాఖ్యలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన కాకాతో ఫోన్‌లోనే మాట్లాడినట్లు తెలిసింది.
సోనియాతో... పార్టీ బతకదు
venkataswamiఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.వెంకటస్వామి నిప్పులు చెరి గారు. ఏఐసిసి అధ్యక్ష పదవి నుంచి ఆమె వైదొలగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సోనియాగాంధీవల్ల పార్టీ బతకదని స్పష్టం చేశారు. ఈ గడ్డపై పుట్టినవారే పార్టీ పగ్గాలు చేపట్టాలని అన్నా రు. ప్రజారాజ్యంతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ అవసరం ఏమోచ్చిందని ప్రశ్నిం చారు. చిరంజీవితో మాట్లాడేందుకు అంటోనినీ ఇక్కడికి ఎందు కు పంపించారో సోనియాగాంధీ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 125 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్‌ పార్టీకి సోనియా నాయక త్వంలో ఇంతటి దుస్థితి పట్టిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికైన వారంతా పార్టీ పేరుతోనే గెలిచారని తెలిపారు.


సోనియా గాంధీ పేరుతో కాదని ఆయన స్పష్టంచేశారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్నటి పరిణామం గురించి మాట్లాడేందుకు ఎవరైన ఒక్కరు ఉండాలనే తాను మాట్లాడు తున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సోనియాగాంధీ నేతృత్వం లో అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాలలో నాలుగు, ఐదు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ఉందని చెప్పారు. సోనియా నాయకత్వంలో అక్కడ కూడా పార్టీ తుడిచిపెట్టుకొని పోయి సున్నా మిగులుతుందని పేర్కొన్నారు. బీహార్‌ ఎన్నికల ఫలితాలు చూస్తే సిగ్గేస్తోందని చెప్పారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది సీట్ల నుంచి నాలుగు సీట్లకు పడిపోవడం దారుణం అన్నారు. సోనియా గాంధీ కిందిస్థాయి నుంచి పార్టీ అధ్యక్షస్థాయికి రాలేదన్నారు. తాము పార్టీ కోసం కిందిస్థాయి నుంచి పోరాడి పైకి వచ్చామన్నారు.


సోనియా పార్టీ నుంచి వైదొలిగితేనే అవినీతి అంతమవుతుంద న్నారు. ఆమె కొనసాగితే పార్టీ మనుగడ కష్టమేనని స్పష్టంచేశారు. చిరంజీవితో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సభ్యులు ఎ.కె.ఆంటోని భేటీ కావడం ఓ డ్రామా అన్నారు. ఆయనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏమోచ్చిందని ప్రశ్నించారు. ఈ పరిణామం పట్ల కాంగ్రెస్‌ సీనియర్లు బాధను వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. సిడబ్ల్యుసి సభ్యునిగా మూడుసార్లు అపాయింట్‌మెంట్‌ ఇవ్వమని కోరినా ఆహ్వానించని సోనియా చిరంజీవికి ఆహ్వానించేందుకు ఆంటోనినీ పంపించడం ఏమిటీ అని ప్రశ్నించారు. ఇది చిన్న విషయం కాదన్నారు.


నెహ్రు, ఇందిరా గాంధీ హయాంలో పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ఇప్పుడు జన్‌పథ్‌కు ఫోన్లు చేసినా ఎత్తడంలేదన్నారు. ఆయనొచ్చి పార్టీని చు..మంతర్‌ చేస్తాడా అని ప్రశ్నించారు. పార్టీకోసం పనిచేసేందుకు గ్రామగ్రామాన కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని, వారికోసం ఆంటోనిని సోనియా పంపివుంటే బాగుండేదని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి ఆంటోని పోవడం ఏమిటి అన్నారు. ఇదే తనకు బాధ కలిగించిందని చెప్పారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉండి రమ్మంటే చిరురాడా అని పేర్కొన్నారు. ఏఐసిసి స్థాయిలో పిలిస్తే రాడా అని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీచేసిన చిరంజీవిని ఆహ్వానించడమా అని ధ్వజమెత్తారు. పొత్తుకోసం చిరు వెంటపడటం ఏమిటి అని నిరసనవ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో సార్లు గెలిచింది, ఓడిందని చెప్పారు. స్వయంగా ఇందిరాగాంధీ కూడా ఓడారని తెలిపారు.


కానీ మళ్లీ 26 నెలల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. పిఆర్‌పితో పొత్తు అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడుకూడా పార్టీ ఓడినా వచ్చిన నష్టమేమిటీ అని అన్నారు. పొత్తుకోసం తొందర ఎందుకని ప్రశ్నించారు. చిరంజీవిని ఆహ్వానించడానికి జాతీయ స్థాయి నాయకుడు రావడం కాంగ్రెస్‌ను దిగజార్చడమేనని స్పష్టంచేశారు. పొత్తుకోసమే అయితే ఆంటోని స్థాయి నేత హైదరాబాద్‌కు రావాల్సిన అవసరంలేదన్నారు. చిరంజీవి ముందు బిక్షం ఎత్తుకోవడం సరికాదన్నారు. గాంధీ, నెహ్రు, అంబేద్కర్‌తో కలసి పనిచేసిన తనకు సోనియా ఇంటి తలపులు తెరుచుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ దినందినం చెడిపోతోందని విమర్శించారు. చెట్టుయే చెడిపోతే ఇక ఫలం ఎక్కడిది అని ప్రశ్నించారు.


రాష్ట్రంలో అవినీతి వల్లే పార్టీ నాశనం అయిందన్నారు. అక్కడి నుంచి ఢిల్లీలోని ఏఐసిసి వారికి నెలనెల అనవాయితీగా దక్షణ(ముడుపులు) చేరేవన్నారు. దీనిని వై.ఎస్‌. చేర్చేవారా అని ప్రశ్నించగా అన్ని తననోటితోనే చెప్పిస్తారా అని బదులిచ్చారు. కెవిపి రామచంద్రరావు నెలనెల ఏఐసిసి వారికి దక్షణ చెల్లించి వచ్చేవారని విమర్శించారు. ఈ అవినీతి గురించి చెబితే ఇక్కడి నుంచి ఫారిన్‌ వరకు ఉందన్నారు. అది తరువాత చెబుతానని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని, ఏఐసిసి చర్యలను చూసే గత ఎన్నికల్లో తాను పోటీచేయలేదన్నారు. పార్టీలోని వారికి అన్యాయం జరుగుతునే వస్తోందన్నారు.


పి.వి.నర్సింహారావుకు మాత్రమే ఏఐసిసిలో అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. కానీ ఆయన చనిపోయాక ఏఐసిసి కార్యాలయానికి ఆయన శవాన్ని కూడా తీసుకురానివ్వకుండా తాళాలు వేసిన పరిస్థితి . పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, తనలాంటి సీనియర్‌ నేతలు కొందరు యాక్టివ్‌గా ఉన్నారని తెలిపారు. సీనియర్ల సలహాలను తీసుకొని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని ఓ ప్రశ్నకు కాకా సమాధానంగా చెప్పారు.


తనను పార్టీ నుంచి పంపే దమ్ము ఎవరికి ఉందని ప్రశ్నించారు. తన ముందు పార్టీలోకి వచ్చిన వాళ్లా తనను పంపించేది అని ఆగ్రహంవ్యక్తంచేశారు.మీ కుమారుడిపై చర్యలు తీసుకొంటే అని ప్రశ్నించగా దేశం కోసం ఆలోచిస్తానే గానీ కుమారుడి గురించి కాదని చెప్పారు. కుమారుడికోసం దేశంలో అవినీతి పెరిగిపోతే చూస్తూ ఊరుకుండాలా అని ప్రశ్నించారు. పార్టీలో ఇంత తమాషా జరుగుతుంటే ఎలా ఊరుకుంటానని చెప్పారు. చిరంజీవితో పొత్తు వల్ల తెలంగాణ అంశం పక్కకు పోతుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా ఇప్పటికైన తెలంగాణ వాళ్లు కళ్లు తెరవాలని అన్నారు. సోనియా తెలంగాణ ఇస్తారని కెసిఆర్‌ ఎన్నోసార్లు చెప్పాడని తెలిపారు. సమైక్యాంధ్రకు చిరంజీవి కట్టుబడి ఉన్నారని, ఈ పరిస్థితులలో తెలంగాణ వాళ్లు కళ్లు తెరవాల్సి ఉందన్నారు.


మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అయితే పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెట్టిన తర్వాతే ఏ పార్టీతోనయినా పొత్తు, విలీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. పీఆర్పీతో పొత్తు, విలీనం వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి లాభం లేకపోయినా, పీఆర్పీకి మాత్రం లాభం కలిగిస్తాయని మంత్రి శంకర్‌రావు వ్యాఖ్యానించారు. జగన్‌కు సన్నిహితంగా వ్యవహరించే కాంగ్రెస్‌ అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ‘చిరంజీవితో ఆంటోనీ భేటీకావడం బాధాకరం. కాకా వ్యాఖ్యలతో అధిష్ఠానం ఇప్పటికయినా కళ్లు తెరవాలి. కాకా కేవలం చిరంజీవి వ్యవహారం వల్లే ఆవిధంగా వ్యాఖ్యానించి ఉంటారు. జగన్‌ పార్టీ పెట్టడం ఖాయం. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు కష్టకాలమేన’ని అన్నారు. ఆయన గతంలో కూడా పీఆర్పీతో పొత్తు పెట్టుకుంటే పార్టీనుంచి వైదొలుగుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే.


అటు సీమాంధ్రలో, ప్రధానంగా కోస్తాలో పీఆర్పీ విలీనాన్ని కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆరిపోయిన దీపం లాంటి పీఆర్పీని కౌగిలించుకుంటే కాంగెస్‌ కొంపే కాలిపోతుందని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. జగన్‌ మీద కోపంతో పీఆర్పీని ప్రోత్సహిస్తే సంస్థాగతంగా కాంగ్రెస్‌ను నాయకత్వమే నాశనం చేసినట్టవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. తూర్పు-పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కాంగ్రెస్‌ ఓటమికి కారణమయిన పీఆర్పీని ప్రజలు పూర్తిగా మర్చిపోతున్న సమయంలో, తమ పార్టీ నాయకత్వం సొంతపార్టీని సమాధి చేసే ప్రయత్నాలు ప్రారంభించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.


ఇటీవల పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గంలో జరిగిన 3 ఎంపీటీసీ ఎన్నికల్లో 3 సీట్లూ టీడీపీనే గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, పీఆర్పీ రెండుచోట్ల 500 ఓట్లు కూడా తెచ్చుకోలేకపోవడంతో పాటు, ఒకచోట కనీసం పోటీ పెట్టే పరిస్థితి కూడా లేదంటే క్షేత్రస్థాయిలో పీఆర్పీ పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు.కోస్తాలో కాంగ్రెస్‌ ఇప్పుడే బలపడుతూ, రానున్న కాలంలో టీడీపీతో పోరుకు సిద్ధమవుతోందని, ప్రజలు కూడా పీఆర్పీ పని అయిపోయిందని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా పీఆర్పీ వెంటపడటం వల్ల కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న పీఆర్పీకి తమ నాయకత్వం అమృతం అందించినట్టేనని సీనియర్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.


polticiansఇటు తెలంగాణలో కూడా పీఆర్పీతో పొత్తు/విలీన ప్రతిపాదనపై కాంగ్రెస్‌ నేతల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. సమైక్యాంధ్ర వాదానికి కట్టుబడ్డానని ప్రకటించడమే కాకుండా, శ్రీకృష్ణ కమిటీతోపాటు, చిదంబరం భేటీలో కూడా సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన చిరంజీవితో తమ పార్టీ కలిస్తే.. ఇక తెలంగాణ రాదని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసిందన్న అభిప్రాయానికి వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమైక్యవాది అయిన చిరంజీవితో కలవడం వల్ల కాంగ్రెస్‌ ఇక తెలంగాణ ఇవ్వదని తెలంగాణ ప్రజలు పార్టీపై వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పెడతా : కాకా
పార్టీ నుంచి దిగిపొమ్మని సంచలన వ్యాఖ్యలు చేసిన కాకా మరో ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ చెప్పారు. తెలంగాణ ఇస్తే సోనియా నాయకత్వంలో పనిచేస్తానని, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పెడతానని చెప్పారు. ఓ ప్రైవేట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. తెలంగాణ ఇస్తుందని సోనియాపై నమ్మకం లేదని, సోనియా పోతేనే తెలంగాణ వస్తుందని కాకా అన్నారు. చిరంజీవి జై తెలంగాణ అంటే తన వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకుంటానని కాకా అన్నారు. సమైక్యవాది అయిన చిరు కాంగ్రెత్‌ కలిస్తే తెలంగాణ రావడం అసంభవమని కాకా మరోసారి చెప్పారు.