Friday, April 6, 2012

త్రిమూర్తులకు గర్వభంగం!

త్రిమూర్తులు హస్తిన వెళ్లి వచ్చారు. మరి సంధి కుదిరిందా అంటే... ఆ దాఖలాలైతే కనిపించడం లేదు. ముగ్గురూ కలిసి టిఫిన్‌ చేసినా ఎవరిదారిన వారు ఇళ్లకు వచ్చేశారు. ఉమ్మడిగా మీడియాతో మాట్లాడు తారనుకుంటే అదీ జరగలేదు. చివరకు సోనియా అపాయింట్ మెంటూ దక్కలేదు. ఆపత్కాలంలో పార్టీకి అండగా ఉంటారని అందలమెక్కిస్తే భ్రష్టూ పట్టించిన ఈ అగ్ర నేతలపై అధినేత్రి ఎంత గుస్సాతో ఉన్నారో ఈ పరిణామమే చెబుతున్నది.

cmmత్రిమూర్తుల హస్తిన పర్యటన ముగిసింది. ఎవరి ఇళ్లకు వారు వచ్చేశారు. ఇరవై నాలుగ్గంటల పాటు సుదీర్ఘ మంతనాల తర్వాత పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? అందరికీ వచ్చే సహజ సందేహం ఇదొక్కటే కాదు. ఇంకా అనేక సందేహాలున్నాయి. వెళ్లేటప్పుడు విడివిడిగా వెళ్లిన కిరణ్‌, బొత్స తిరిగి వచ్చేటప్పుడు కూడా విడివిడిగానే హైదరాబాదు చేరుకోవడం ఒక విశేషం. 



 ఢిల్లీ వెళ్లిన వాళ్లు సంధి కుదిరి చెట్టాపట్టాల్‌ వేసుకుని వస్తారని ఆశించిన వారికి ఆశా భంగమే ఎదురైంది. చర్చలు కాగానే ఒకసారి ముగ్గురూ కారెక్కి కనిపించి కాసేపు మురిపించారు. మర్నాడు ఉదయా న్నే ముఖ్యమంత్రి మిగతా ఇద్దర్నీ అల్పాహారానికి పిలిచారు. కలిసి కూర్చుని టిఫిన్‌ తిన్నారు. ఇదీ శుభపరిణామమే. పనిలో పనిగా బాబూ జగ్జీవన్‌రామ్‌కి కలిసికట్టుగానే శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత ఇక ఎవరి దారి వారిదైంది. ముఖ్యమం త్రేమో ప్రధానమంత్రిని కలవడానికి వెళితే బొత్స సత్యనారా యణ తనదైన శైలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అది ఎందుకు పెట్టారో.. అందులో ఆయన చెప్పిన విశేషాలేమిటో బోధపడక అందరూ తలలు పట్టుకున్నారు. ముఖ్యమంత్రికీ, తనకూ మధ్య విభేదాలే లేవని ఒక పరమ నిజం చెప్పారు. ఆజాద్‌తో సమావేశం లో ఉప ఎన్నికల గురించి, పార్టీ వ్యూహం గురించీ చర్చించాం తప్ప ఇతరత్రా ఏ విషయాలూ రాలేదని అన్నారు. అదే నోటితో పనిలో పనిగా ఎక్సయిజ్‌ ఐపీఎస్‌ శ్రీనివాసరెడ్డి ఎవరో ఆ కథేంటో తనకు అస్సలు తెలీదని వక్కాణించారు.

Sonia 

చెప్పకపోతే పత్రికల వాళ్లు, టీవీల వాళ్లు ఇంకేవేవో రాసేసుకుంటారని ఈ మాత్రమైనా చెప్తున్నానని కూడా సెలవిచ్చారు. ముఖ్యమంత్రీ, పీసీసీ అధ్యక్షుడూ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడతారని అందరూ ఊహించారు. కాని అది మరీ ఇబ్బందికరంగా ఉంటుందనుకున్నారో ఏమో ఆ సాహసం చేయలేకపోయారు. ఇవన్నీ పరిశీ లించాక, అస్సలు వీరిద్దరి మధ్యా నిజమైన సంధి కుదిరిందా అన్న అను మానం రాక మానదు. తమ మధ్య విభేదాలు లేవని గాని, ఉన్నా మన స్ఫూర్తిగా వాటిని పరిష్కరించుకున్నామని గాని వాళ్లిద్దరూ చిత్తశుద్ధితో భావిస్తే, ఇద్దరూ ఒక చోట కలిసి ఒకే గొంతుకతో చెప్పేవాళ్లు. అది జరగ లేదు కాబట్టే ఇన్ని సందేహాలు.

ఇదంతా ఒక ఎత్తయితే ఇంత పెద్ద కసరత్తు జరిగాక వీళ్లిద్దరూ కాం గ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలవక పోవడం మరొక పెద్ద సందే హానికి బీజాలు వేసింది. వీళ్లిద్దరూ ఢిల్లీలో కాలు మోపిన సమయంలోనే కిరణ్‌ ప్రత్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమె దగ్గరకు ఇలా వెళ్లి అలా పావు గంట సేపు మాట్లాడి వచ్చారు.
రాష్ట్ర నేతలు చాలా మంది దాదాపు నిత్యం ఆమెను కలుస్తూనే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి ఏవేవో చెప్పి వస్తున్నారు. వాటన్నింటికీ కర్త, కర్మ, క్రియలుగా ముద్రపడ్డ కిరణ్‌, బొత్స ఆజాద్‌ దగ్గర పంచాయతీ తర్వాత అధినేత్రిని కలవకపోవడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందే. నిజానికి ఆనవాయితీ ప్రకారం పంచాయతీ ముగిశాక ఆజాదే వాళ్లిద్దర్నీ ఆమె దగ్గరకు తీసుకెళ్లి చర్చల సారాంశం చెప్పి, ఆమె చేత చివరిగా నాలుగు మంచి మాటలు చెప్పించాలి. కాని అది కూడా జరగలేదు. రాజకీయపరంగా చాలా కీలక సమావేశంగా ప్రచారంలోకి వచ్చిన ఈ ఉదంతం చివరకు ఆజాద్‌ దగ్గరే ఆగిపోవడాన్ని నిశి తంగా పరిశీలించాలి. ఆమె వీళ్లతో మాట్లాడేందుకు నిరాకరించారా? ఆపత్కాలంలో పార్టీకి అండగా నిలుస్తారని గంపెడు ఆశలతో వీళ్లిద్దరికీ కీలక బాధ్యతలు అప్పగిస్తే చివరకిలా పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టుపటి ్టస్తున్నారని ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.

_DKr 


అందుకే ఆ వ్యవహా రాన్ని ఆజాద్‌కి అప్పగించి, తాత్కాలిక ఉపశమనానికి చర్యలు తీసు కోమని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికల గొడవ అయ్యాక, వీరిద్దర్నీ లేదా ఇద్దర్లో ఎవరో ఒకర్ని తప్పించాలని అధిష్టానం స్ధాయిలో సూత్రప్రాయంగా నిర్ణయించినందునే ఆమె వీరిని పిలిపించలేదని అం టున్నారు. లేకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి.. అదీ రాజకీయ రచ్చబండకు వచ్చి.. సోనియాను కలవకుండా వెళ్లడం అరుదైన విషయమే.ఈ సంకేతాలు నర్మగర్భంగా అందినందువల్లే కిరణ్‌, బొత్స ఉమ్మడిగా విలేకరుల ముందుకు రాకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారన్నది మరొక కథనం.

ఉప ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులు అంటే కొత్త తలనొప్పులు వస్తాయని, అందువల్ల మంచో చెడో వీళ్లతోనే ఆ తతంగాన్ని ముగించడం ఉన్నంతలో రక్షణాత్మక చర్యగా అధిష్టానం భావించింది. అందుకే ఎంతో సస్పెన్స్‌తో మొదలైన త్రిమూర్తుల డిల్లీ పర్యటన చివరకు నీరుగారి తేలిపోయింది. ఇదమిద్దంగా ఏమి తేల్చారో ఎవ్వరూ చెప్ప లేకపోయారు. ఆజాద్‌ కూడా పెదవి విప్పలేదు. ముగ్గురికీ మనస్సు తడిసేలా తలంటిపోసి పంపించాల్సిందిగా సోనియా ఆజాద్‌ని ఆదేశించారు. ఆ పనిని ఆజాద్‌ నిర్విఘ్నంగా నిర్వహించారు. అందుకే తలంటి పోయించుకున్న వారు కిక్కురుమనలేదు. తలంటి పోసిన
వారు నోరెత్తలేదు.

No comments:

Post a Comment