
సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత ఇందిర, రాజీవ్ కన్నా శక్తివంతమైన నాయకురాలిగా ఆవిర్భవించారన్న కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. పార్టీకి సంబంధించిన సమస్యలను అలవోకగా పరిష్క రిస్తున్నారని పేరున్న సోనియా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీకి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుండటం పార్టీకి చెందిన జాతీయ నాయకులకు సైతం పజిల్‌గా మారింది. పార్టీ సారథ్యం అందుకున్న తర్వాత తొలిసారిగా మన రాష్ట్రం నుంచే సోని యాకు సమస్యల సవాలు ఎదురవడం అటు పార్టీ వర్గా ల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధి నేత్రి సోనియగాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు తల నొప్పిలా పరిణమించాయి. దీనితో రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. నిజానికి.. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమెకు సొంత పరిజ్ఞానం లేకపోయిన ప్పటికీ.. తాను ఎక్కువగా ఆధారపడే ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్‌పటేల్ వంటి అనుభవ జ్ఞులకూ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు అర్థం కాకపోవడమే సోనియాకు చిక్కులు రావడానికి అసలు కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పు, కొత్త ిపీసీసీ అధ్యక్షుడి నియామకం, సమర్థవంతంగా వ్యవహరించే రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి, జగన్ వ్యవహారం, రాష్ట్ర విభజన అంశాలు సోనియాకు పెను సవాలుగా పరిణమించాయి. బహుశా ఆమె అధ్యక్ష పగ్గాలు అందుకున్న తర్వాత ఏ రాష్ట్రం నుంచి ఇన్ని తీవ్రమైన సమస్యలు ఎదురయి ఉండవని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తు న్నాయి. ఇప్పుడు ఈ సమస్యలపై ఆమె ఎలాంటినిర్ణయాలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది.
ముఖ్యమంత్రి రోశయ్య అనారోగ్యం పార్టీ అధినేత్రిని కలవరపెడుతోందంటున్నారు. వివాదరహితుడు, సీనియర్ రాజకీయ నాయకుడయినప్పటికీ అనారోగ్యం పరిపా లనకు, పార్టీ-ప్రభుత్వ సుస్థిరతకు అవరో దంగా పరిణమించాయని సోనియా ఈ పాటికే గ్రహించింది. మరోవైపు రోశయ్య కూడా తనకు ఆరోగ్యం సహకరించినంత కాలం ఈ పదవిలో కొనసాగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ముఖ్యమంత్రిని ప్రతిష్ఠించే అంశంపై దృష్టి సారించడం సోనియాకు అనివార్యంగా మారింది.
దక్షిణాదిలో అతిపెద్ద రాష్టమ్రయిన ఆంధ్రప్రదేశ్‌ను విస్మరిస్తే భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరుగుతుం దో ఆమెకు తెలియని కాదు. అందుకే ఆమె సీఎం మార్పుపై తర్జన భర్జనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, వి.హన్మంతరావు, గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి పదవికి ప్రత్యా మ్నాయంగా కనిపిస్తున్నారు. వారిలో తనకు విధే యులు, రాష్ట్రంలో పార్టీని-ప్రభుత్వాన్ని సమన్వ యం చేసుకుని నడిపించగల సమర్థతో పాటు.. ఆర్థికంగా పార్టీ అవసరాలు కూడా తీర్చే వారిని ఎంపిక చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇక పిసిసి అధ్యక్ష ఎంపి లో కూడా సోనియా అయోమయంలో ఉన్నారు. ఇది తెలంగాణ అంశంతో ముడిపడి ఉన్నందున ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆమెకు అర్ధం కాకుండా ఉందంటు న్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలా? వద్దా? ఆ క్రెడిట్ కేసీఆర్‌కు పోతుందా? తన ఖాతాలో కలుస్తుందా అన్నదీ మరో అనుమానం. తెలంగాణ ఇస్తే హైదరాబాద్ సంగతేమిటి? రాష్ట్ర విభజన చేస్తే కోస్తాలో పార్టీ మనుగడ ఏమిటి? ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న డి.శ్రీనివాస్ స్థానంలో ఎవరిని నియమించాలన్న అన్వేషణలో భాగంగా.. వి.హన్మంతరావు, సురేష్‌రెడ్డి, నంది ఎల్లయ్య, మల్లు రవి, జానారెడ్డి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం కోస్తాకు చెందిన రోశయ్య సీఎంగా ఉన్నందున తెలంగాణ నేతకు పిసిసి ఇవ్వాల్సి ఉంది. అయితే, రోశయ్యను మార్చి తెలంగాణకు చెందిన నేతకు సీఎం పదవి అప్పగిస్తే, అప్పుడు కోస్తా నేతకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వవలసి ఉంటుంది. ఆ ప్రకారంగా సీనియర్లయి న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కాసు కృష్ణారెడ్డి, పాలడుగు వెంకట్రావు వంటి నేతలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. వీరిలో ఎవరిని ఎంచుకోవాలన్నది ప్రధాన సమస్య.అదే సమయంలో జగన్ సమస్య కూడా సోనియాకు చిక్కుముడిలా పరిణమించింది. జగన్ పార్టీలో ఉంటారా? బయటకు వెళతారా? అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలా? లేక జగన్ ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలా అన్నది సోనియాకు పెద్ద సమస్యలా పరిణమించింది.
తాను వద్దంటున్నా వినకుండా, తనను ప్రజల ముందు దోషిలా నిలబెడుతూ జగన్ చేసిన ప్రకటనతో సోనియా ఆగ్రహంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జగన్ అక్రమ సంపాదనకు సంబంధించిన వార్తలు వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ జగన్‌పై ఇంతవరకూ చర్య తీసుకోకపోవడం, ఆయన కంపెనీలపై ఎలాంటి దాడులు జరగకపోవడం బట్టి అసలు కాంగ్రెస్ నాయకత్వమే జగన్‌తో ఇలాంటి కార్యక్రమం చేయిస్తోందా? పార్టీని పటిష్ఠం చేసుకునేందుకు జగన్ యాత్రను చూసీ చూడనట్లు పోతుందా? అదే నిజమయితే జగన్ యాత్రకు వెళ్లవద్దంటూ వస్తున్న లీకులన్నీ ఉత్తిదేనా? ఒక వేళ రాష్ట్రం విడిపోతే కోస్తాలో పార్టీ పటిష్ఠం కోసం టీడీపీని దెబ్బతీసేందుకే నాయకత్వమే జగన్‌ను జనంలోకి పంపుతోం దా? అన్న అనుమానాలు ఇప్పటికే సామాన్య జనంలో చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికలు తెప్పించుకుంటున్న సోనియాగాంధీ వీటిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుం టారా? అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. శరద్‌ప వా ర్, కరుణానిధి, మమతాబెనర్జీ వంటి హేమాహేమీలే సోనియా గాంధీ శక్తికి భయపడి సర్దుకుపోతున్న నేపథ్యంలో.. జగన్ వంటి జూనియర్ ఎంపి తనను సవాల్ చేస్తుంటే సోనియాగాంధీ ఇప్పటివ రకూ మౌనంగా ఉన్నారంటే ఇదంతా నాయకత్వం ఆడుతున్న నాటకంలా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు కూడా సోనియాకు జగన్‌పై ఏదో ఒక చర్య తీసుకునేందుకు ఇరకాటంగా పరిణమించాయం టున్నారు.
మరోవైపు.. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి నియామకంపైనా సోనియా గందరగోళంలో ఉన్నారు. ఇప్పటివవరకూ వచ్చిన ఇన్చార్జులు వైఎస్, ఆయన మిత్రుడయిన కేవీపీ రామచంద్రరావు ప్రభావంతో పనిచేసి, వారికి అనుకూల నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వారే. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారినందున.. వ్యక్తులకు అనుకూలంగా కాకుండా పార్టీకి అనుకూలంగా పనిచేసే ఇన్చార్జి కోసం అన్వేషించడం అనివార్యంగా మారింది. దిగ్విజయ్‌సింగ్ ఇన్చార్జిగా వస్తున్నారన్న వార్తలు వస్తున్నప్పటికీ, ఆయన సైతం వైఎస్ వర్గానికి అనుకూలంగా వ్యవహరించే ప్రమాదం ఉందని సీనియర్లు గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆందోళన చెందుతున్నారు.
No comments:
Post a Comment