
ఒకప్పుడు... రాజకీయాల్లోకి రావడానికి బొత్తిగా ఇష్టపడని సోనియాగాంధీ ఇప్పుడు నాలుగోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక కాబోతున్నారు. పన్నెండేళ్లు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నిర్వహించి రికార్డు సృష్టించిన ఏకైన నాయకురాలు ఆమె. ఇన్నేళ్లు పార్టీకి సారథ్యం వహించడంలోనే కాదు... వరసగా రెండుసార్లు యూపీఏ కూటమికి అధికా రాన్ని కట్టబెట్టిన ఘనత కూడా ఆమెదే. అదివరకు కొన్నేళ్లపాటు అధికారానికి దూరమై కొట్టుమిట్టాడిన కాంగ్రెస్ పార్టీకి ఆమె ఆశాకిరణమయ్యారు. వెలుగుదివ్వెగా నిలిచి నడిపించి, గెలిపించారు.
సామాన్య కుటుంబం నుంచి...
ఇటలీలో టూరిన్ ప్రాంతంలో సంప్రదాయ రోమన్ కేథలిక్ కుటుంబంలో పుట్టిన సోనియా ఓ చిన్న బిల్డింగ్ కాంట్రాక్టర్ కూతురు. ఇందిరా గాంధీ కోడలుగా భారతదేశంలోకి అడుగుపెట్టిన సోనియాగాంధీ తను కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తానని అనుకోలేదు. తను విదేశీయురా లిననే విమర్శను ఆమె చాలాసార్లు ఖండించారు. 1983లో తను భారత పౌరసత్వాన్ని తీసుకున్నా నని ఎన్నోసార్లు తెలిపారు.

నామినేషన్ దాఖలు
నాలుగోసారి పార్టీ అధ్యక్షపదవిని చేపట్టేం దుకు సోనియాగాంధీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇంతవరకు మూడుసార్లు రాయ్ బరేలీ నియోజక వర్గం నుంచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైన సోనియా 1998లో ...125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన వారిలో సోనియా అయిదో వ్యక్తి. విదేశంలో జన్మించి, పార్టీ అధ్యక్షపదవిని అలంకరించిన వారిలో ఎనిమిదో వ్యక్తి.1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. అప్పుడు...పార్టీని నడిపించగల నాయకత్వం కావలసి రావడంతో ఆమె రాజకీయరంగ ప్రవేశం చేశారు. భర్త రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు సోనియా దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు.
విమర్శలకు జవాబుగా...
2004 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన సోనియాగాంధీ ప్రధాని పదవిని చేపట్టేవారే. కానీ, ఆమె విదేశీయురాలు అని తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘ఒక విదేశీ వ్యక్తి దేశ ప్రధాని ఎలా అవుతారు?’ అని భారతీయ జనతాపార్టీ నిప్పులు చెరిగింది. దాంతో ఆమె ప్రధాని పదవిని త్యాగం చేసి అధికారానికి వెలుపలే ఉండిపోయారు. తను అధికారంలో లేకపోయినా, ప్రభుత్వాన్ని నడిపించడంలో ప్రధానికి అండగా ఉన్నారు.
అసలామె అధికారం ఏమిటి అనే విమర్శకులూ ఉన్నారు. కానీ, ప్రధాని పదవిని సైతం త్యాగం చేసిన మనిషిగా సోనియాగాంధీ దేశంలో కోట్లాదిమంది ప్రజలు అభిమానం సంపాదించారు.గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పైనా, ప్రధాని మన్మోహన్ సింగ్ పైనా ఎన్ని విమర్శలు చేసినా వాటిని ఎదురొడ్డి నిలిచి, ప్రచారం చేశారు. ప్రతిపక్షా లపై ఎదురు దాడి చేసి గెలిచారు. సోనియాగాంధీ క్రమంగా భారత రాజకీయాల్ని ప్రభావితం చేసి పాలక కూటమి యూపీఏకు లోక్‌సభలో ఛైర్‌పర్సన్ అయ్యారు. పాలకపక్షాన్ని నడిపించే సారథిగా సోనియాగాంధీ తన ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించారు.
నలభైసార్లైన ఎన్నికవుతారు : కాంగ్రెస్

సోనియాగాంధీని నాలుగోసారి పార్టీ అధ్యక్షపదవికి ఎన్నుకోవాలను కుంటున్న కాంగ్రెస్‌ను భారతీయ జనతాపార్టీ తప్పు పట్టింది. బీజేపీ అభ్యంతరంపై కాంగ్రెస్ విరుచుకు పడింది. ‘నాలుగుసార్లు కాదు, పార్టీ కోరితే ఆమె 40 సార్లు ఎన్నికవుతారు. తప్పేముంది? మనం మరో పార్టీకి సంబంధించిన నియమ నిబంధనల్ని గురించి మాట్లాడకూడదు’ అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ విలేకరులకు చెప్పారు.వారికి ఆ అవకాశం రాలేదనే ఇలా అంటున్నారని ద్వివేదీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ కనుక ఎన్నికపై విస్తృతంగా చర్చిస్తాం. ఇది మరో పార్టీలో కనిపించదు’ అన్నారు. పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ ఆస్కార్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ-‘పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికలో రాజ్యాంగాన్ని అనుసరిస్తాం. పిసిసి అధ్యక్షులు రెండు సార్లకంటే మించి ఆ పదవిని చేపట్టకూడదు. కానీ, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ నిబంధన వర్తించదు’ అన్నారు.

పుట్టిన తేదీ డిసెంబర్ 9, 1946 ( 63 )
జన్మస్థలం టూరిన్, ఇటలీ
రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
భర్త రాజీవ్‌గాంధీ
పిల్లలు ప్రియాంక, రాహుల్ గాంధీ
నివాసం 10 జనపథ్, న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకురాలు,
సామాజిక కార్యకర్త
జన్మస్థలం టూరిన్, ఇటలీ
రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
భర్త రాజీవ్‌గాంధీ
పిల్లలు ప్రియాంక, రాహుల్ గాంధీ
నివాసం 10 జనపథ్, న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకురాలు,
సామాజిక కార్యకర్త
- 2004లో ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని అతి శక్తివంతమైన మహిళల్లో 3వ స్థానం. 2007లో 6వ స్థానం.
- 2007,2008లో టైమ్స్ విడుదల చేసిన ప్రపంచం లోని 100 మంది శక్తిమంతుల జాబితాలో స్థానం.
- 1998లో మొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియామకం.
- వరసగా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నిక.
- ఎక్కువ కాలం పాటూ అధ్యక్షపీఠంపై ఉన్న నాయకురాలిగా అరుదైన రికార్డు.
- 1999లో ప్రతిపక్ష నాయకురాలుగా 13వ లోక్‌సభకు ఎన్నిక.
No comments:
Post a Comment