కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వేటు ఖాయమయిపోయింది. అందులో భాగంగా ముందు రెండు రోజుల్లో షోకాజ్ నోటీ సు ఇచ్చేందుకు రంగం సిద్ధమయింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా సంపాదించి ఆర్థికంగా బలోపేతుడయిన జగన్‌ను.. ఇప్పుడు ఉపేక్షిస్తే చివరకు ఆ సంపదతో పార్టీనే శాసించి, పార్టీని నిర్వీర్యం చేసేందుకు సాహిస్తారన్న ఆందోళన నాయకత్వాన్ని పట్టిపీడిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌పై చర్య తీసుకోవాలన్న ఆలోచనకు అసలు కారణం ఆయన సంపదేనంటున్నారు.
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పవర్ ప్రాజెక్టులతో పాటు, ఇబ్బడిముబ్బడిగా పలు వ్యాపారాల స్థాపన ద్వారా జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్న సమాచారం తెప్పించుకున్న అధిష్ఠానం ఈ దశలో ఆయనను నియంత్రిచకపోతే తన సంపాదనతో మరింత ఎత్తుకు ఎదిగి, చివరకు తననే శాసించే ప్రమాదం ఉందని నాయకత్వం భయపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ముందస్తు ఆదాయపన్ను 86 కోట్లు రూపాయలు చెల్లించిన జగన్, దేశంలోని మిగిలిన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని 500 కోట్ల పన్ను చెల్లించినట్లు అధిష్ఠానం దృష్టికి వచ్చిందని పార్టీ వర్గాలు వివరించాయి.

ఈ నేపథ్యంలో తన సంపద ద్వారా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని శాసించే స్థాయికి ఎదిగి, పార్టీ నియమించిన ముఖ్యమంత్రులను ఇబ్బందిపెడుతున్నారని నాయకత్వం గ్రహించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జగన్ పార్టీని శాసిస్తుంటే, ఇక సంపద పెరిగితే జగన్ హవా ఇతర రాష్ట్రాలకూ పాకే ప్రమాదం ఉందని నాయకత్వం అంచనా వే స్తున్నట్లుతెలుస్తోంది. కేవలం ధన బలంతోనే జగన్ తనను సవాలు చేసే స్థాయికి ఎదిగారన్న తీర్మానానికి వచ్చింది.
జగన్‌ను విడిచిపెడితే.. ఆయన చివరకు మరో ఆంధ్రా శరద్‌పవార్‌లా మారి చివరకు పార్టీ ఉనికికే ప్రమాదంగా పరిణ మిస్తారన్న భయాందోళన కూడా నాయకత్వానికి లేకపోలేదంటున్నారు. మహా రాష్ట్ర కేంద్రంగా మొదట కాంగ్రెస్‌లో ఉంటూ, పార్టీ నాయకత్వంపై తిరుగు బాటు బావుటా ఎగురవేసిన శరద్‌పవార్ స్థాపించిన నేషలిస్టు కాంగ్రెస్‌తో అక్కడ కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. చివరకు అదే పవార్ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయవలసిన దుస్థితికి చేరింది.
చక్కెర లాబీ ద్వారా వేల కోట్లు సంపాదించిన పవార్, చివరకు ఆ సంపాదనతో పార్టీ స్థాపించి, కాంగ్రెస్‌ను శాసించే స్థాయికి ఎదిగిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంది. జగన్ వ్యవహారం ఆవిధంగా కాకూడద న్న పట్టుదలతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దీనికితోడు.. జగన్ పార్టీని శాసిస్తూ, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్నప్పటికీ ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం వల్ల.. సోనియాగాంధీ ఒక సాధారణ ఎంపీ అయిన జగన్‌కు భయపడుతున్నారన్న సంకేతాలు వెళ్లడంపైనా నాయకత్వం అప్రమత్తమవుతోంది. ఈ సంకేతాల వల్ల.. దేశవ్యాప్తంగా అగ్రనేతలను అణచివేసిన సోనియాగాంధీ చివరకు జగన్‌కు భయపడుతోంద న్న భావన బలపడుతుందేమోనన్న భయం కూడా జగన్‌కు షోకాజ్ ఇచ్చేందుకు ఒక కారణమవుతోంది.

అమీతుమీకి రెఢీ
జగన్ వర్గం అధిష్ఠానం మాటల యుద్ధం
మోహరించిన ఇరుపక్షాలు
కత్తులు దూయడం ఖాయం
ఎప్పుడన్న దానిపైనే సందిగ్ఢం
ఉపేక్షించలేమంటున్న హైకమాండ్

వివేకా, జైపాల్ ద్వారా సంకేతాలు
బలం చూసిన తర్వాతే చర్యలు
వేరుకుంపటి బాటలో కడప ఎంపీ
వివేకాకు పదవి ఇస్తే ఫైటింగే
40 మంది వెంట వస్తారని ధీమా
సిఎం కిరణ్ మధ్యేమార్గం?
అప్పుడే చర్యలకు విముఖం
ఈ గొడవతో మంత్రివర్గం జూప్యం
"అధిష్ఠానం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటిదాకా నన్ను చులకన చేసింది. ఇప్పుడు మా కుటుంబ సభ్యుల మధ్య కలతలు సృష్టించి, చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మా బాబాయ్ వివేకానంద రెడ్డిని ఢిల్లీకి రప్పించింది. ఇప్పుడు సాక్షిలో పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి షోకాజ్‌లకు భయపడేది లేదు. కొత్త పార్టీ పెట్టి మన సత్తా చాటుదాం ''
- సన్నిహితులతో జగన్
- సన్నిహితులతో జగన్
అడుగులు పడుతున్నాయి! అటు అధిష్ఠానం... ఇటు జగన్ వర్గం! ఇరు శిబిరాలు మోహరించాయి! చర్యలు తక్షణం తీసుకుందామా, వద్దా అనే 'వ్యూహాత్మక' అనిశ్చితిలో అధిష్ఠానం... చర్యలు తీసుకుంటే సత్తా చూపించేందుకు సిద్ధమైన జగన్ వర్గం! సమరం జరగడం ఖాయం! ఎప్పుడన్నదే సందిగ్ధం! కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అధిష్ఠానం వేసిన కీలక అడుగు. అలాగే... జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డికి పదవి ఇస్తున్నట్లు సంకేతాలు పంపడం మరో అడుగు! ఎప్పుడూ నోరు తెరిచి వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యలు చేయని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తొలిసారి జగన్‌పై స్పందించడం ఇంకో అడుగు! ఇవన్నీ చర్యల దిశగా అధిష్ఠానం వేస్తున్న అడుగులు. జగన్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. తన వర్గీయులతో విస్తృతస్థాయిలో మంతనాలు జరుపుతున్నారు.
షోకాజ్ నోటీసు ఇచ్చినా, తన బాబాయ్‌కి మంత్రి పదవి ఇచ్చినా... అదే అదనుగా ఒకే ఒక్క భారీ అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. సొంత పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే మాటల యుద్ధం మొదలుపెట్టారు. జగన్ 'గొంతుక'గా భావించే అంబటి రాంబాబు అధిష్ఠానంపై మాటల తూటాలు వదిలారు. 'సై అంటే సై' అన్నట్లుగా సవాల్ విసిరారు. ఒక్కటిమాత్రం సుస్పష్టం! ఇరువర్గాలు కత్తులు పట్టుకుని నిల్చున్నాయి. ఎవరు ముందు కత్తి దూసినా... సమరం ప్రారంభమైనట్లే! జగన్‌పై చర్యల విషయంలో, ఇటు మంత్రివర్గ కూర్పు వ్యవహారంలో అధిష్ఠానం దాగుడు మూతలు ఆడుతోంది. జగన్ విషయంలో కొంచెం వేచి చూడాలని, ఆయన యాక్షన్ బట్టే రియాక్షన్ ఇవ్వాలని భావిస్తోంది. షోకాజ్ నోటీసు జారీ చేసి తాడోపేడో తేల్చుకోవడమా? ఆయన వర్గీయులకు కేబినెట్లో కోత పెట్టడమా? వివేకానంద రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని మరింత రెచ్చగొట్టడమా? అనే విషయాన్ని తేల్చుకోలేకపోతోంది. దీంతో మంత్రివర్గ జాబితాను ఖరారు చేయలేకపోయింది. శనివారం సాయంత్రం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ నివాసంలో దాదాపు మూడు గంటలకు పైగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ, జగన్ వర్గంపై నిర్ణయం తీసుకోలేకపోయారు.
వివేకానంద రెడ్డికి పదవి ఇస్తే సమస్య జటిలమవుతుందని, ప్రస్తుతం ఆచితూచి వ్యవహరించాలని కిరణ్ భావిస్తున్నప్పటికీ... జగన్ విషయంలో ఇక ఉపేక్షించరాదని, ఆయన బలం ఏమిటో బయటపడేలా చూడాలని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసే విషయం పెండింగ్‌లో పడిందని, పార్లమెంట్ సమావేశాల తర్వాత మరో నాలుగు రోజుల్లో ఈ విషయంపై దృష్టిసారించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి జరిగిన క్రమశిక్షణా సంఘం సమావేశంలో జగన్‌పై వేటు వేయడంపై తర్జన భర్జనలు జరిగాయి. జగన్ చానల్లో రాహుల్ గాంధీపైనా వ్యతిరేక కథనం రావడంతో ఇక ఉపేక్షించరాదని పార్టీ నేతలు భావించారు. జైపాల్ రెడ్డి ద్వారా ఈ మేరకు సంకేతాలు పంపించారు. బుధవారానికి పార్లమెంట్ సమావేశాలు పూర్తవుతాయని, రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణం అదే రోజు జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలోపు జగన్, ఆయన వర్గీయులపై తీసుకోవాల్సిన చర్యలపై అధిష్ఠానం ఓ నిర్ణయానికి వస్తుందని చెబుతున్నారు.
జగన్ వర్గం హెచ్చరిక స్వరం
జగన్‌పై చర్యలు తీసుకోవడంపై అధిష్ఠానం వ్యూహం ఇలా ఉండగా... 'మమ్మల్ని టచ్ చేస్తే ఇబ్బందులు తప్పవు' అంటూ జగన్ వర్గం శనివారం సాయంత్రానికే అటు కొత్త సీఎం కిరణ్‌కు, ఇటు అధిష్ఠానానికి హెచ్చరికలు పంపింది. షోకాజ్ నోటీసు జారీ చేసినా, వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా, తమ వర్గీయులకు చెక్ పెట్టినా... ప్రత్యక్ష యుద్ధానికి దిగాలని జగన్ వర్గీయులు భావిస్తున్నట్లు అధిష్ఠానానికి సమాచారం అందింది. జగన్‌కు సంబంధించి ఎలాంటి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా ఐదుగురు ఎంపీలు, 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు అంచనా వేసి, అందుకు తగిన విధంగా మంత్రివర్గ మార్పుల ద్వారా చెక్ పెట్టాలని, జగన్ బలం పెద్దగా లేదని తేలిన తర్వాతే ఆయనపై చర్యకు పూనుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడుతుందనే భయంతో అవే పాత ముఖాలతో, కళంకితులతో కేబినెట్‌ను నింపేస్తే కిరణ్‌కుమార్ రెడ్డిని సీఎంగా నియమించిన ఉద్దేశం నెరవేరదని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా సరే, ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే... జగన్‌పై తాడోపేడో తేల్చుకోవాలని, అదను చూసి కొరడా ఝళిపించాలని నిర్ణయించారు. అయితే, కొంత రాజీబాటలో వెళ్లాలని, ఇప్పుడే జగన్‌పై యుద్ధం ప్రకటించరాదని కిరణ్ మెతక వైఖరి ప్రదర్శిస్తుండడం పార్టీ నేతలను ఆశ్చర్యపరుస్తోంది. అందువల్ల మంత్రివర్గ జాబితా అధిష్ఠానం అనుకున్న ప్రకారం రూపొందుతుందా... కిరణ్ సూచించినట్లు మ««ధ్యే మార్గం అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కిరణ్ కేవీపీ రామచంద్రరావు సూచించిన జాబితాను ప్రతిపాదిస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

జగన్‌తో లింక్?..

రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. అయితే ఆదిలోనే హంసపాదులు అన్నట్లుగా మంత్రివర్గం కూర్పులోనే జగన్‌వర్గం అధిష్ఠానానికి గొంతులో పచ్చి వెలక్కాయలా మారింది. ఇతరత్రా ప్రాంత, కుల సమీకరణాల విషయంలో అంతగా ఇబ్బందులు లేకపోయినా జగన్ వర్గీయుల విషయం వచ్చేసరికి సందిగ్ధం తప్పలేదు. జగన్ వర్గీయులను మంత్రివర్గంలో తీసుకుంటే ఒక చిక్కు, తీసుకోకుంటే మరో చిక్కు ఈ సమస్యకు ఏది పరిష్కారం అన్నది అధిష్ఠానానికి సైతం పాలుపోకుండా ఉన్నట్లు సమాచారం.
మంత్రివర్గ జాబితా రూపకల్పనకు ఇదికూడా ఓ కారణంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. మంత్రివర్గ కూర్పు రూపకల్పన నేపథ్యంలో యువనేత హైదరాబాద్‌లో మకాంవేసి తన వర్గీయులతో రహస్య మంతనాలు పార్టీ అధిష్ఠానానికి కలవరానికి గురిచేస్తోంది.ఏ వర్గానికి చెక్‌పెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించిందో ఆ యువనేత వర్గం నూతన మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఈ దిశగా కొండా సురేఖ, వై.ఎస్.వివేకానందరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, మల్లాది విష్ణు, జోగి రమేష్ తదితరులు ఇప్పటికే సిఎంను కలసి మంత్రి పదవుల కోసం అభ్యర్థనలుచేశారు.
అయితే వీరిని కేబినేట్లో చేర్చుకోవడం ద్వారా జగన్‌కు చెక్ పెట్టాలన్న ఆలోచనతో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. సహజంగా కేబినేట్‌లోని మంత్రివర్గ సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరం చేయవచ్చు అని పార్టీ నాయకత్వం ఆలోచన. అదే సందర్భంలో వారిని జగన్ నుంచి దూరం చేయోచ్చని కూడా హైకమాండ్ ఆలోచిస్తోంది. కానీ మరోవైపు వారిని చేర్చుకుంటే వచ్చే నష్టాలపై కూడా అంచనావేస్తోంది. ఈ మంత్రిపదవులు అడిగే వారు యువనేత వద్ద తమ విధేయతను అదే తీరులో కొనసాగిస్తున్నారు.ఈ అంశమే పార్టీ హైకమాండ్‌కు కొంత కలవరానికి గురిచేస్తోంది. కేవలం జగన్ ప్రాబల్యంను కేబినేట్లో తమ ప్రాతినిధ్యం ద్వారా కొనసాగించే కుట్ర జరుగుతోందా అన్న కోణంలో పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. మంత్రి పదవుల కోసం ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి ఎంత దగ్గరగా ఈ నేతలు వ్యవహరిస్తున్నారో జగన్‌తోనూ అంతే సాన్నిహిత్యాన్ని వారు కొనసాగిస్తున్నారు.
పార్టీపై తన పట్టును కోల్పోకుండ ఉండేందుకు జగన్ స్వయంగా ఈ పైరవీలకు ప్రోత్సహిస్తున్నారా అన్న కోణంలో పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. మరోవైపు వీరిని పక్కన పెట్టి మంత్రివర్గ కూర్పును రూపొందిస్తే యువనేత వర్గీయుల అసమ్మతి తప్పదని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తమ వర్గానికి చెక్ పెట్టేందుకే సిఎంను మార్చారు అన్న సంగతి యువనేత శిభిరంగా నిశితంగా పరిశీలిస్తుంది. అందుకు యువనేత సిఎం మార్పు ప్రకటన వెలువడగానే హుటాహుటీనా బెంగుళూరునుంచి హైదరాబాద్‌కు చేరుకొన్నారు.
అంతేకాకుండా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యేంతవరకు రాజధానిలోనే ఉండాలన్న జగన్ నిర్ణయం వెనక ఆయన వ్యూహం దాగిఉన్నదని కూడా పార్టీ నాయకత్వం భావిస్తోంది. మంత్రివర్గ ఏర్పాటు తరువాత తన వ్యూహాన్ని పదును పెట్టాలని జగన్ ఆలోచనగా ఉందని పార్టీ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనూ పూర్తిగా కేబినేట్ ఏర్పాటులో జగన్ వర్గానికి పీఠం వేసినా, వేయక పోయినా చిక్కులు తప్పవని కాంగ్రెస్ అధిష్ఠానం తలపట్టుకొంటోంది. ఒక వేళ వారికి మంత్రి పదవులు ఇస్తే ఇప్పటికే రూపొందించిన జాబితాలు కొంత మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది.
ఈ మార్పులు చేర్పులలో కులం, ప్రాంతం వంటి అన్ని కోణాలో మళ్లీ జాబితాను ప్రక్షళన చేసి రూపొందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలోనే ఇప్పటికే జగన్ వర్గానికి దూరం పెట్టి రూపొందించిన జాబితా ఉన్నప్పటికీ వాటిని ఇప్పిటికిప్పుడు వాటిని ప్రకటించే సాహసం కాంగ్రెస్ నాయకత్వం చేయలేకపోతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్ వర్గానికి ప్రవేశం ఇవ్వాలా వద్ద అన్న కోణంలో ఆలోచించి నిర్ణయంతీసుకొనున్న నేపథ్యంలో బుధవారమే మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొత్త పార్టీ వైపు జగన్ చూపు రాజీనామాలు చేయాలని సన్నిహితులకు ఆదేశం
అధిష్ఠానం షోకాజ్ ఇస్తే చెత్తబుట్టలో పారేయాలని నిర్ణయం
ధిక్కారమే ఆయుధం
బాబాయ్‌ను మచ్చిక చేసుకుని కుటుంబంలో చిచ్చు
పార్టీ నేతలకు జగన్ సూచన
రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీకి అంకురార్పణ జరుగుతోంది. కొత్త పార్టీని పెట్టాలన్న యోచనకు కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిష్ఠానం తనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తే దానినే మాత్రం పట్టించుకోకుండా చెత్తబుట్టకు పరిమితం చేయాలని .. ఇదే సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని తన వర్గ నేతలకు ఆదేశించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తన వెంట శాసనసభ్యులూ, ఎమ్మెల్సీలూ, ఎంపీలు ఎవరు వచ్చినా రాకున్నా .. తాను మాత్రం తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రం మార్పు లేదని స్పష్టం చేస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేస్తున్న పథకాల కారణంగానే రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జగన్ స్పష్టం చేస్తున్నారు. వైఎస్ తనయుడిగా ప్రజాదరణ తనకే ఉందని సన్ని హితుల వద్ద స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీలో వేగంగా కదులుతున్న రాజకీయ పరిణామాలు జగన్‌ను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం ముఖ్యమంత్రి పదవి కోసం 153 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను సేకరించినా అధిష్ఠానం ఏమాత్రం పట్టించుకోలేదు. దీని తర్వాత అధిష్ఠానం వద్దంటున్నా బేఖాతరు చేస్తూ ఓదార్పు యాత్ర ద్వారా తన బలాన్ని నిరూపించుకునే యత్నం చేస్తున్నారు. అయితే.. దీనిని ధిక్కారంగానే పరిగణించడం మినహా .. జగన్ బలంగా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
దీనికి తోడు .. ముఖ్యమంత్రి బాధ్యతలను రోశయ్య నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించడంతో జగన్ వర్గం షాక్‌కు గురైంది. ఇక ముఖ్యమంత్రి కుర్చీ ఇప్పట్లో దొరికే అవకాశాల్లేవన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇక అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర అనంతరం రెండు రోజులు చెన్నైలో వైద్యం చేయించుకుని తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకున్న అనంతరం .. రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చిన జగన్ .. భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొణిజేటి రోశయ్య అప్పట్లో సీఎం క్యాంపు కార్యాలయంలో నివాసం ఉంటున్న వైఎస్ సతీమణి విజయమ్మను, వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు.
ఇదే విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తనను కలవాల్సిందే తప్ప తాను ఆయనను కలవడం ఏమిటన్న ఆలోచన జగన్‌లో స్పష్టంగా కన్పించిందని ఆయన వర్గాలు వివరించాయి. ఇదే సమయంలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కమలమ్మ, శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గురునాథరెడ్డి, లబ్బి వెంకటస్వామి, జయసుధ, వై.వెంకటేశ్వరరెడ్డి, శివప్రసాదరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆళ్ల నాని, రామచంద్రారెడ్డి, కొండా మురళి, జూపూడి ప్రభాకర్‌రావు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిలతో జరిగిన భేటీలో కొత్త పార్టీ అంశాన్ని జగన్ చర్చకు తీసుకువచ్చారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ' అధిష్ఠానం కక్ష పూరిత ధోరిణతో వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ నన్ను చులకన చేయడమే కాకుండా .. మా కుటుంబ సభ్యుల మధ్య కలతలు సృష్టించి చిచ్చురేపేందుకు యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మా బాబాయ్ వివేకానందరెడ్డిని ఢిల్లీకి రప్పించింది. నాతో సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పిస్తానని వివేకానందరెడ్డి చెప్పడం వంటి విధానాలకు పాల్పడుతోంది. ఇప్పుడు సాక్షిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి షోకాజ్ నోటీసులకు భయపడేది లేదు. కొత్త పార్టీని పెట్టి మన సత్తా చాటుదాం' అని జగన్ పేర్కొన్నారు.
రాజకీయంగా జగన్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని బాలినేని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు స్పష్టం చేశారు. అయితే.. పలువురు శాసనసభ్యులు పార్టీ ఏర్పాటు పట్ల పునరాలోచన చేయాలని సూచించారు. అయితే.. తన వెంట ఎవరు వచ్చినా రాకున్నా .. పార్టీ పెట్టాలన్న యోచనలో ఎలాంటి మార్పు లేదని జగన్ స్పష్టం చేశారు. కాగా.. జగన్ సొంత పార్టీ పెడితే .. శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేస్తారా అని జగన్‌వర్గ నేతలు పలువురిని ప్రశ్నిస్తే ..'అధిష్ఠానం షోకాజ్ నోటీసు ఇవ్వదు .. తమకు రాజీనామా చేసే అవకాశం రాదు ' అని చెప్పేవారి సంఖ్యే అధికంగా ఉంటోంది. కాగా.. జగన్‌వర్గ ఎమ్మెల్యేలు పలువురు శనివారం అందుబాటులోకి రాలేదు. కాగా.. ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ .. జగన్‌కు షోకాజ్ నోటీసు రావడం, కొత్త పార్టీ పెట్టడం వంటి అంశాలపై తాను అవసరాన్ని బట్టి మాట్లాడతానని అన్నారు. ఇప్పటి వరకూ జగన్‌వర్గ నేతగా ఉన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం తాను రాజీనామాకు సిద్ధంగా లేనని అన్నారు.
ఇప్పుడు పార్టీ పెట్టడం మంచిది కాదని తాను స్పష్టం చేశానని ఆన్‌లైన్‌తో అన్నారు. శుక్రవారం నాడు తాను జగన్ వద్దకు వెళ్లలేదని.. కాని కొందరు నేతల వద్ద పార్టీ ప్రస్తావన వచ్చినట్లు సమాచారం అందిందని అన్నారు. తమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం జగన్‌తో ఉంటానని స్పష్టం చేశారని.. తాను మాత్రం ఇప్పటి నుంచే ఎమ్మెల్యే సీటు కోల్పోయేందుకు సిద్ధంగా లేనని అన్నారు. ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన వాడినన్న ముద్ర పడడంతో రాజోలు బ్రిడ్జి పనులకు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య నిధులు మంజూరు చేయలేదని అన్నారు. తనకు నియోజకవర్గ అభివృద్ధి కూడా ముఖ్యమేనని ఆయన చెప్పారు. మొత్తానికి .. జగన్ వేరు కుంపటి వైపే జగన్ అడుగులు వేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

బాబాయ్ X అబ్బాయ్

వైఎస్ కుటుంబంలో రోజురోజుకూ చిచ్చు రాజు కుంటోంది. మంత్రి పదవి కావాలని ఢిల్లీకి వెళ్లిన జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలు జగన్ శిబిరంలో ఆగ్రహం రగిల్చాయి. జగన్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నారని, సాక్షి ద్వారా పార్టీపై వ్యతిరేక కథనాలు రాయిస్తున్నారంటూ జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన కొద్ది సేపటి తర్వాతే వివేకానం దరెడ్డి ఆయనను కలవడం చర్చనీయాంశ మయింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వివేకా.. జగన్‌తో క్షమాపణ చెప్పిస్తానని, ఆ వార్తలపై విచారం వ్యక్తం చేయిస్తానని, జగన్‌ను సోనియా వద్దకు తీసుకువెళతానన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. వివేకా నంద వ్యాఖ్యలను జగన్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించడంతోపాటు.. వివేకా దుష్టశక్తుల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారంటూ జగన్‌కు అనుకూలంగా ధ్వజమెత్తారు. కాగా, వైఎస్ కుటుంబంలో చిచ్చు మొదలయిందంటూ శనివారం వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలు దీనిని నిజం చేస్తుండటం గమనార్హం.

వివేకానందరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో జగన్ తప్పుచేశారన్న విషయాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పష్టం చేయడమే కాకుండా, జగన్‌తో క్షమాపణ, విచారం వ్యక్తం చేయిస్తానంటూ వ్యాఖ్యానించడంపై స్వయంగా జగన్ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవైపు తనను అణచివేసేందుకే కిరణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రిగా తీసుకువచ్చిన నాయకత్వంతో తాను తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు బాబాయ్ స్వయంగా తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాలు పంపించడం జగన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఒకవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతుంటే, తన బాబాయ్ మాత్రం తాను కచ్చితంగా తప్పు చేశానని చెప్పడమే కాకుండా, చేసిన తప్పును మన్నించమంటూ సోనియాగాంధీ వద్దకు వెళతామన్న బాబాయ్ వ్యాఖ్యలపైనా జగన్ తన అనుచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
దానితో ఆయన తన అధికార ప్రతినిధిగా వ్యవహరించే అంబటి రాంబాబు ద్వారా వివేకా వ్యాఖ్యలను ఖండింపచేశారు. వివేకానందరెడ్డి దాదాపు అధిష్ఠానానికి లొంగిపోయారన్నట్లు అంబటి మాట్లాడటం అందరినీ ఆకర్షిం చాయి. జగన్ ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల విచారంగానీ, క్షమాపణ గానీ చెప్పాల్సిన అవసరం లేదని నిక్కచ్చిగా స్పష్టం చేశారు. ఒకవేళ జగన్ ఆదేశం లేకపోతే.. కుటుంబ వ్యవహారంలో, అందునా వైఎస్ సోదరుడిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేంత ధైర్యం అంబటి చేయరన్నది నిర్వివాదం. దానితోపాటు.. వైఎస్ కుటుంబాన్ని చీల్చేందుకు కుట్ర జరుగుతుందని చెప్పడం చూస్తే.. అది అంబటి వైఖరి కాకుండా జగన్ గళం మాదిరిగానే అర్థం చేసుకోవలసి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ కుటుంబం నిలువునా చీలిపోయిందని స్పష్టమవుతోంది.
ఇక వైఎస్ కుటుంబంలో వివేకానందరెడ్డి వేరయినట్టేనని పార్టీ శ్రేణుల్లో స్పష్టమైన సంకేతం వెళ్లినట్టయింది. దీనితో ఇప్పటిదాకా కడప జిల్లాలో తిరుగులేకుండా పెత్తనం సాగించిన వైఎస్ కుటుంబం కూడా చీలిపోయింది. వివేకాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కడపలో జగన్ హవాకు తెరదించాలన్న నాయకత్వ ఎత్తుగడతో కడప జిల్లా రాజకీయాలు కొత్త మలుపు తిరగనున్నాయి.ఇదిలాఉండగా, తమ ప్రత్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డికి జిల్లా నుంచి మంత్రి పదవి రాకూడదన్న వ్యూహంతోనే వివేకానందరెడ్డి హటాత్తుగా రంగప్రవేశం చేసి, మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. దానిని జగన్ వర్గం మరోలా అర్థం చేసుకోవడం దురదృష్టకరమంటున్నారు.
వైఎస్ కుటుంబాన్ని చీల్చే కుట్ర |
కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు ధ్వజం |

* దుష్టశక్తుల చేతిలో వైఎస్ వివేకానందరెడ్డి పావు కావద్దు
* ఇదంతా ఢిల్లీలోని కొందరు పెద్దల కుట్రనిపిస్తోంది
* వివేకాను ఢిల్లీ పిలిచి నాటకమాడిస్తున్నారు
* వైఎస్ కుటుంబాన్ని చీల్చి జగన్‌ను ఇరుకున పెట్టాలనుకుంటున్నారు
* ఆయనను ఏకాకిని చేయాలన్న ప్రయత్నమే ఇది
* ‘సాక్షి’లో కథనాలకు, జగన్‌కు సంబంధం లేదు
* ఆయన ఏనాడూ సోనియా, రాహుల్‌లను విమర్శించలేదు
* అలాంటప్పుడు వివరణ ఎందుకు ఇవ్వాల్సివస్తుంది?
‘‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, యువ ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏకాకిని చేసి బలహీనపర్చాలన్న కుట్ర జరుగుతోంది. వైఎస్ జ్ఞాపకాలను సైతం చెరిపేయాలని, జగన్‌ను బలహీనపరచాలని ఢిల్లీలోని కొందరు పెద్దలు పన్నుతున్న మహాకుట్రలో వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిని పావుగా వాడుకుంటున్నారన్న అనుమానం కలుగుతోంది’’ అని కాంగ్రెస్ నేత, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు ఆరోపించారు. వైఎస్ కుటుంబ గౌరవాన్ని అభాసుపాలు చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగం కావద్దని వివేకానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు. సాక్షి చానెల్లో వచ్చిన కథనాలు తప్పని, జగన్మోహన్రెడ్డితో సోనియాగాంధీకి వివరణ ఇప్పిస్తానని ఢిల్లీలో వివేకానందరెడ్డి పేర్కొనడంపై రాంబాబు అభ్యంతరం వ్యక్తంచేశారు. సాక్షిలో వచ్చిన కథనాలకు జగన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని, జగన్ ఏ తప్పూ చేయలేదని వివరించారు.
‘‘జగన్ పార్టీ క్రమశిక్షణను ఏనాడూ ఉల్లంఘించలేదు. ఇప్పటివరకు ఏనాడూ సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని విమర్శించలేదు. పావురాలగుట్టలో ఇచ్చిన మాటమేరకు ఓదార్పు యాత్ర చేస్తున్నారే తప్ప మరెన్నడూ పార్టీ గీత దాటలేదు. అలాంటప్పుడు ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వివరణ ఎందుకు ఇవ్వాలి?’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు, రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్‌లతో కలిసి ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమని దుయ్యబట్టారు. జగన్‌ను బయటకు పంపే కుట్రలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
అంబటి మాటల్లోనిముఖ్యాంశాలు ఇవీ...
‘‘సాక్షిలో వచ్చిన కథనాల మీద జగన్మోహన్రెడ్డిని తీసుకొని ఢిల్లీ వెళ్తానని, సోనియాగాంధీకి వివరణ ఇప్పిస్తానని వివేకానంద అనడం బాధ కలిగించింది. సాక్షిలో వచ్చిన కథనాలు తప్పు, వాటిని నివారించడానికి ప్రయత్నిస్తానని చెప్పడం చాలా అభ్యంతరకరం. సాక్షి అనేది స్వతంత్రంగా, వాస్తవాలను ప్రతిబింబించేదిగా ఉంటుందని, ఏ పార్టీకీ సంబంధంలేదని ముందునుంచి జగన్ చెబుతున్నారు. అక్కడి సంపాదకవర్గానికి ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందులో వచ్చిన కథనంపై ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీకి వివరణ ఇవ్వాల్సిన అవసరం జగన్‌కు లేదు. జగన్ ఏతప్పూ చేయలేదు. మీడియాలో వచ్చిన కథనాలు కూడా తప్పుకాదు. అవి విశ్లేషణాత్మక కథనాలు. వాటికి, జగన్ అభిప్రాయాలకు సంబంధంలేదు. మీడియాలో వచ్చిన కథనాలకు, జగన్‌కు ఎంతవరకు సంబంధం ? ఎంతమందికి మీడియాలు లేవు? ఆ పేపర్లలో వచ్చిన ప్రతి కథనం ఆయా యాజమాన్యాలు చేస్తున్నవేనా? ఆ మాత్రం విచక్షణతో చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి లేదా?
వివేకాను పావుగా వాడుకుంటున్నారని అనుమానం
వివేకానంద మంత్రివర్గంలో స్థానం కోసం వెళ్లినట్లుగా అనిపించడం లేదు. ఆయన్నెవరో పిలిచి ఢిల్లీలో నాటకమాడిస్తున్నారన్న భావన కలుగుతోంది. కేవలం జగన్‌పై బురద చల్లాలన్న ఉద్దేశంతో ఏకాకిని చేయాలన్న కుట్రలో భాగంగానే వివేకాను పావుగా చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎప్పట్నుంచో వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రానికి చెందిన కొందరు ఢిల్లీ పెద్దలు కుట్రపన్ని ఇలా చేస్తుండవచ్చు. ఇది అన్యాయం. వైఎస్ కుటుంబంలోని వ్యక్తిని చీల్చి జగన్‌ను బలహీనపర్చాలని, ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేయడం హేయం. ఎవరిచేతిలోనో పావుగా ఉండవ.ద్దని వివేకాకు విజ్ఞప్తి చేస్తున్నా.
వైఎస్‌కు, ఆయన కుటుంబానికి రాష్ట్రంలో అపార ప్రజాదరణ, గౌరవం ఉంది. దాన్ని అభాసుపాలుచేసేలా కాంగ్రెస్ దుష్టశక్తుల చేతిలో కీలుబొమ్మగా మారవద్దని కోరుతున్నా. వివేకానంద ఎమ్మెల్సీ. వైఎస్‌కు సోదరుడిగా, జగన్‌కు బాబాయిగా మంత్రివర్గంలోస్థానం కోసం ప్రయత్నం చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ నిన్న మాట్లాడిన దానికి, ఈరోజు మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. జగన్‌తోకానీ విజయమ్మతో కానీ సంప్రదించలేదని నిన్న చెప్పారు. ఈరోజు వేరుగా మాట్లాడారు. జగన్ కుటుంబంలోని వారినే పావులా ఉపయోగించి జగన్‌ను అభాసుపాలు చేయాలన్న దుష్టశక్తుల కుట్రలో భాగంగానే వివేకానంద ఇలా వ్యవహరిస్తున్నారేమోనన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అధిష్టానానికి, జగన్‌కు మధ్య ఏర్పడిన అగాధాన్ని వివేకా పూడ్చితే మంచిదే. ఆ పనికోసం మంత్రివర్గ విస్తరణ సమయంలో, మంత్రి పదవికోసం వెళ్లాల్సిన పనిలేదు. అగాధం ఏర్పడినప్పటినుంచే ఈ ప్రయత్నం చేసి ఉండాల్సింది. వైఎస్ కుటుంబం ఐక్యంగా ఉంది. ఇప్పుడు అందులో చీలిక తేవాలని, జగన్‌ను బలహీనపర్చాలని కుట్రచేస్తున్నవారు సక్సెస్ కాలేరన్న విశ్వాసం నాకుంది.
జగన్ క్రమశిక్షణ ఉల్లంఘించలేదు
ఓదార్పు యాత్రకు వెళ్లడం ఎలా తప్పవుతుంది? యాత్ర రెండు జిల్లాల్లో జరిగినప్పుడు ఎవరూ తప్పు పట్టలేదు. కానీ తరువాత కొందరు పెద్దలు, ముఖ్యమంత్రి జోక్యంచేసుకొని దాన్నొక బహిష్కరించాల్సిన యాత్రగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. జగన్ ఏనాడూ కాంగ్రెస్ క్రమశిక్షణకు భిన్నంగా పనిచేయలేదు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల మీద ఏనాడూ విమర్శలు చేయలేదు. మీడియాలో వస్తున్న విమర్శలను ఆయన విమర్శలుగా చూపించి బురదచల్లాలని చూస్తున్నారు. చివరకు వివేకానందరెడ్డి కూడా అలా మాట్లాడ్డం ధర్మంకాదు. ఓదార్పుయాత్రకు వెళ్లవద్దంటూ, వెళ్తే మంత్రి పదవులనుంచి తొలగిస్తామని చెప్పి తప్పు చేసిన వారు తప్పును ఒప్పుకొని వివరణ ఇవ్వాలే తప్ప జగన్ కాదు. తప్పు జరిగిందల్లా అటువైపునుంచే, దాన్ని సరిచేసుకోవలసిందీ వారే.’’
విలేకర్ల ప్రశ్నలకు అంబటి జవాబులు
జగన్ తరఫున మీరెందుకు మాట్లాడుతున్నారు?
వైఎస్ మరణించిన తర్వాత తండ్రిలేని కుమారున్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. రాత్రనక, పగలనక ఇంటింటికీ గడప గడపకు తిరుగుతున్న 36 ఏళ్ల యువకుడిని ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందా? అందువల్లనే ఆయనకు అండగా నిలబడాలని కోరుకుంటున్నా. వైఎస్ అనుచరుడిగా, ఆయనతో పాదయాత్ర చేసిన వ్యక్తిగా, జగన్ అభిమానిగా మాట్లాడే హక్కు నాకు ఉందనే భావిస్తున్నా. అందుకే మాట్లాడుతున్నా.
వివేకానంద కుట్రలో ఇరుక్కునేంత అమాయకుడా?
కుట్రలో ఇరుక్కోవడానికి అమాయకుడు కావలసిన పనిలేదు. ఎవరైనా ఇరుక్కుంటారు. కుట్రలో పావుగా మారుతున్నారన్న అనుమానం కలుగుతోందన్నది నా భావన. ఇంకా ఏమైనా ఉంటే ఆ తరువాత తేలుతాయి.
జగన్‌కు షోకాజ్ నోటీసిస్తున్నారన్న ప్రచారం నిజమేనా?
జగన్‌కు షోకాజ్ నోటీసు ఇస్తారని ఇప్పటికి 23 సార్లు రాశారు, ప్రసారం చేశారు. ఎప్పుడైనా షోకాజ్ నోటీసు ఇచ్చారా? ఇంతవరకు ఇవ్వలేదంటే జగన్ తప్పు చేయలేదనేకదా దాని అర్థం. జగన్‌పై చర్యతీసుకొనే అవకాశం లేదని మొయిలీకూడా చెప్పారు. షోకాజ్ ఇవ్వలేదంటే... తప్పుచేశాడంటూ వందసార్లంటున్న వారి నోళ్లు మూయించినట్లే కదా?