ఒకానొక దశలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని భావించిన ప్రియాంక గాంధీ ఆ తరువాత అకస్మాత్తుగా తెరమరుగయ్యారు. కుటుంబ జీవితానికి పరిమితమయ్యారు. ఇటీవల ఆమె పార్లమెంట్ ఆవరణలో ప్రత్యక్షం కావడం తిరిగి రకరకాల ఊహాగానాలకు తెరదీసింది.

తల్లి ఆరోగ్యం బాగా ఉందని చెప్పడానికి మాత్రమే తాను వచ్చినట్లు ప్రియాంకా గాంధీ చెబుతున్నప్పటికీ, ఊహాగానాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ పరోక్షంగా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ ఫలితాలు మాత్రం నిరాశాజనకంగా ఉండడం కాంగ్రెస్ శ్రేణులను కుంగదీస్తోంది.

పార్టీలోని సీనియర్ నాయకులు కొంతమంది రాహుల్ స్థానంలో ప్రియాంక పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు. ముమ్మూర్తులా నాయనమ్మ ఇందిరాగాంధీని పోలి ఉండే ప్రియాంక గాంధీకి అభిమానులు కూడా అనేకం ఉన్నారు. భవిష్యత్తులో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటే, ప్రయోగించే అస్త్రంగా ప్రియాంక ఉంటారనే వాదనలూ ఉన్నాయి.

ప్రొఫైల్
పేరు : ప్రియాంక
పుట్టిన తేదీ : 12 జనవరి 1972
తల్లిదండ్రులు : సోనియా, రాజీవ్ గాంధీ
భర్త : రాబర్ట్ వధేరా
పిల్లలు : రైహన్ వధేరా,
ఒమిరయా వధేరా
హాబీలు : అమెచ్యూర్ రేడియో ఆపరేటర్
రాజకీయాల్లో...

ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు ఒకప్పుడు బాగా సాగి నప్పటికీ, ఆమె మాత్రం ఎన్నడూ తన పరిమితులు దాటలేదు. రాజకీయాల్లో తల్లికి, సోదరుడికి సహకరించినప్ప టికీ, తన ప్రాధాన్యాలేంటో స్పష్టం చేశారు. తన కుటుంబం, ఇద్దరు పిల్లల పెంపకానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చారు.1999 నాటి ఎన్నికల ప్రచారం సంద ర్భంగా ఆమె బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రజల కన్నా కూడా రాజకీయాలు ముఖ్యం కాదన్నారు. రాజకీయాల్లోకి రాకుండానే తాను ప్రజలకు చేయగలిగింది చేస్తానని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

ఆమె ఇంతగా వెల్లడించినా కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఆశ చావలేదు. ఆమె ఎప్పటికైనా రాజకీయాల్లోకి రాకపోదా అని చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. 
రాజీవ్, సోనియాగాంధీల ముద్దుల పట్టీగా ప్రియాంక భారత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావించే కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా తిరిగి తమ గళాన్ని విప్పుతున్నారు. వారంతా ఆమెలో ఇందిరాగాంధీని దర్శిస్తున్నారు.
ఆమె గనుక పార్టీ పగ్గాలు చేపడితే ఇందిర తరహాలో పార్టీకి పునర్ వైభవం తేగలరని భావిస్తున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ప్రియాంక గాంధీ పెళ్ళి అయిన తరువాత ప్రియాంక వధేరాగా మారిపోయారు.
విద్యాభ్యాసం...

ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో ప్రియాంక ప్రాథమిక విద్యా భ్యాసం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆమె సైకాలజీలో డిగ్రీ పొందారు. ఆమె అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ కావడం విశేషం.
తల్లికి, సోదరుడికి సహకరిస్తూ...
ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ, తల్లి నియోజకవర్గం రాయ్‌బరేలిలో, సోదరుడి నియోజకవర్గం అమేథీలో తరచూ పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆమె ఎక్కడ పర్యటించినా ప్రజాస్పందన బాగా ఉండేది. అమేథి కా ఢంకా బైఠియా ప్రియాంక అనే నినాదం అక్కడ బాగా ప్రాచుర్యంలో ఉంది. చక్కటి కార్యనిర్వాహకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. తల్లికి వివిధ రాజకీయ అంశాల్లో ఆమె సలహా లిచ్చేవారు.
2004 సాధారణ ఎన్నికల్లో ఆమె తల్లికి క్యాంపెయిన్ మేనేజర్‌గా వ్యవహరించా రు. సోదరుడు రాహుల్‌గాంధీ ప్రచార వ్యవహారాలను కూడా ఆమె పర్యవేక్షించా రు.

ప్రజలకు సేవ చేయడమే రాజకీయం... రాజకీయాల్లోకి రాకుండానే నేను ఆ పని చేస్తున్నాను అని అంటారు ఆమె. మరో ఐదేళ్ళ పాటు మాత్రమే ఇలా రాజకీయాల్లో సహకరించే అవకాశం ఉందని కూడా అప్పట్లోనే ఆమె స్పష్టం చేశారు.
వివాహం...
వివాహం...

ఢిల్లీకి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త రాబర్ట్ వధేరా ను ఆమె వివాహం చేసుకు న్నారు. వారికి ఇద్దరు పిల్ల లు. రాజీవ్ కుటుంబానికి సన్నిహితమైన ఖత్రోచి ఇంట్లో ప్రియాంక, రాబర్ట్‌ల తొలి పరిచయం జరిగి ఉం టుందని భావిస్తున్నారు. 1997 ఫిబ్రవరి 18న వీరి పెళ్ళి జరిగింది. రాబర్ట్ సోదరుడు రిచర్డ్ 2003లో తన నివాసంలో మృతి చెంది కన్పించారు. రాబర్ట్ సోదరి మిషిల్లె 2001లో కారుప్రమాదంలో మరణించింది.రాబర్ట్ తండ్రి రాజీం దర్ 2009లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు.సోనియాగాంధీ అల్లుడిగా రాబర్ట్ వధేరా శరవేగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిపోయారు.

యూనిటెక్‌లో ఆయనకు 20 శాతం వాటా ఉంది. జ్యుయలరీ, హస్తకళలకు సంబంధించిన ఆర్టెక్స్ అనే చిన్న కంపెనీని ఆయన సొంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన కంపెనీలు డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ నుంచి అన్ సెక్యూర్డ్ రుణాలు పొందాయి. ఆయన, ఆయన తల్లి భాగస్వాములుగా ఉన్న సై్క లైట్ హాస్పిటాలిటీ ప్రై.లి. దక్షిణ ఢిల్లీలోని హిల్టన్ గార్డెన్ ఇన్‌లో వాటా కలిగి ఉంది. 2009 నాటికి సై్క లైట్ హాస్పిటాలిటీ సంస్థ డీఎల్‌ఎఫ్ నుంచి రూ. 25 కోట్ల మేరకు రుణాలుపొందింది. బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ కంపెనీ (ఎయిర్‌క్రాఫ్ట్ ఛార్టరింగ్), నార్త్ ఇండియా ఐటీ పార్క్‌స ప్రై.లి., రియల్ ఎర్త్ ఎస్టేట్స్ ప్రై.లి., సై్క లైట్ రియాలిటీ ప్రై.లి. తదితరాల్లో ఆయనకు వాటాలున్నాయి. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఒక దశలో వచ్చాయి.